ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సులపై తనిఖీలను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ శివారు పటాన్చెరువులో సోమవారం తనికీలు చేపట్టారు.
ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సులపై తనిఖీలను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ శివారు పటాన్చెరువులో సోమవారం తనికీలు చేపట్టారు. అనుమతులు, రికార్డులు సరిగా లేని పది ప్రైవేట్ బస్సులను అధికారులు సీజ్ చేశారు.
కృష్ణా జిల్లాలోనూ దాడులు నిర్వహించారు. గరికపాడు చెక్పోస్టు వద్ద ఆర్టీఏ అధికారులు ఐదు ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు. మహబూబ్నగర్ బస్సు ప్రమాద దుర్ఘటన అనంతరం ఆర్టీఏ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ బస్సులను తనిఖీలు చేసి పెద్ద సంఖ్యలో సీజ్ చేశారు.