ఎల్బీనగర్ (హైదరాబాద్): ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు మరోసారి కొరడా ఝుళిపించారు. బుధవారం తెల్లవారుజామున ఎల్బీనగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఐదు ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేయగా, మరో ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు.