RTA Officers
-
స్కూళ్లు, కాలేజీ బస్సులను తనిఖీ చేసిన అధికారులు
-
బండి స్క్రాప్ కింద అమ్మేశారా? ఈ విషయం తెలుసుకోండి.. వారికి తెలపండి
వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక డ్రైవర్ కారు కొనుగోలు చేశాడు. కొంతకాలం తరువాత స్క్రాప్ కింద విక్రయించేశాడు. కానీ రవాణాశాఖ అధికారులు పన్ను చెల్లించాలని నోటీసు ఇచ్చారు. హడావిడిగా రవాణాశాఖ అధికారులను కలిసి కారును స్క్రాప్ కింద విక్రయించేశానని.. అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఆ విషయాన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉందని అధికారులు బదులిచ్చారు. ఆఖరికి నాలుగు త్రైమాసికాలు పన్నులు చెల్లించాడు. ఇలా చాలా మంది ఇబ్బంది పడుతుండటారు. దీనిపై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్ : నూతన వాహనం కొనుగోలు చేసే సమయంలో ధ్రువీకరణ పత్రాలు సరి చూసుకోవటమే కాదు.. వాహనాన్ని తీసేసినా.. స్క్రాప్ కింద వేసినా.. ఇతరులకు విక్రయించినా ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు తీసుకెళ్లినా అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందే. జిల్లాలో 5 లక్షల 680 వాహనాలు ఉన్నాయి. వాటిలో లారీలు 21,771, మ్యాక్సీ క్యాబ్‌లు 1320, మోటారు క్యాబ్‌లు 3160, కమర్షియల్ ట్రాక్టర్లు 19,311, ఆటోలు 29,135, స్కూలు బస్సులు 1461తోపాటు ఇతరత్రా ట్రాన్స్‌పోర్టు వాహనాలు ఉన్నాయి. వాటిలో అనేక సంవత్సరాలుగా త్రైమాసిక పన్ను బకాయిలు ఉన్నారు. అధికారుల గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 8061 వాహనాలు పన్నులు చెల్లించనవిగా గుర్తించారు. అయితే ఇప్పటికే సదరు వాహన యజమానులకు నోటీసులు జారీ చేయడంతోపాటు నిత్యం పన్ను చెల్లించాలని సమాచారం అందజేస్తున్నారు. లేని వాహనాలు ఎన్నో.. జిల్లాలో త్రైమాసిక పన్నులు చెల్లించాల్సిన వాహనాలు 2061 ఉండగా, వాటిలో అనేక వాహనాలు లేనే లేవని అధికారులు గుర్తించారు. వేలాది వాహనాలు ప్రమాదాలకు గురైనవి, వదిలివేయడం, కాలం చెల్లిన వాహనాలను స్క్రాబ్ వేయడం, ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు తీసుకెళ్లిన వాహనాల గురించి పట్టించుకోకపోవడం, విక్రయించిన వాహనాల గురించి సమాచారం ఇవ్వకపోవడం వంటివి ప్రధానంగా గుర్తించారు. 8061 వాహ నాల్లో సుమారు 2000–3000 వాహనాలు స్క్రాబ్తోపాటు ఇతర అంశాలలో సంబంధిత యజమానుల వద్ద లేనట్లు, గుర్తించినట్లు సమాచారం. పన్ను పడుతూనే ఉంది.. వాహనాలకు సంబంధించి యజమానుల వద్ద వాహనం లేనప్పటికీ త్రైమాసిక పన్నులు మాత్రం పడుతూనే ఉంటాయని అఽధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వాహనదారులు వాహనాలను స్క్రాబ్ వేసినా, ఇతరత్రా అంశాల్లో కోల్పోయినా, కనీసం అధికారులకు సమాచారం ఇవ్వకపోవడంతో వాటికి పన్నులు పడుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు వాహనాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. వాహనాన్ని స్క్రాబ్ కింద తీసివేసినా, ఫైనాన్స్ వారు తీసుకుపోయినా, ప్రమాదం జరిగి ఎక్కడైనా వాహనం నిలిచిపోయినా తప్పనిసరిగా తెలియజేయాల్సిన అవసరం ఉందని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే అధికం వాహనాలను తీసివేయడం, ఫైనాన్స్ సంస్థల వారు తీసుకెళ్లడం వంటివి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి. వాటికి సంబంధించి యజమానులు దరఖాస్తు చేసుకోకపోవడం వల్ల పన్నులు పెరిగిపోతున్నాయని అధికారులు గుర్తించారు. స్క్రాబ్ చేసిన వాహనానికి సంబంధించి ఛాయిస్ నెంబర్లు దుర్వినియోగానికి పాల్పడితే దానికి సంంధించిన వాహన యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుందని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే క్రమంలో వాహనం స్క్రాబ్ వేసినట్లు దరఖాస్తు చేసుకుని రోడ్డుపై తిరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని, వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదుకు అవకాశం ఉందని చెబుతున్నారు. వాహన యజమానులు ఈ విషయాన్ని గుర్తించి వాహనాన్ని తీసివేసినా, ఫైనాన్షియర్లు తీసుకెళ్లినా, ఇతరత్రా అంశాలు జరిగితే దరఖాస్తు చేసుకోవడంతోపాటు అధికారుల దృష్టికి తీసుకు రావాలని సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకోవాలి వాహనాన్ని తీసివేసినా, స్క్రాబ్‌కు వేసినా, ఫైనాన్షియర్లు తీసుకెళ్లినా ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవడంతోపాటు అఽధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ట్రాన్స్‌పోర్టు వాహనాలైతే వాహనాలు మన దగ్గర లేకపోయినప్పటికీ త్రైమాసిక పన్నులు, ఆపైగా జరిమానాలు పడుతూనే ఉంటాయని యజమానులు గ్రహించాలి. స్క్రాబ్‌కు వేసినప్పటికీ ఛాయిస్ నెంబర్లు దుర్వినియోగం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. యజమానులు గుర్తించి వాహనాల విషయంగా తగు జాగ్రత్తలు తీసుకుని నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలి. – ఇ.మీరప్రసాద్, జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్, కడప -
అరచేతిలో.. ఫ్యాన్సీ నంబర్!
గద్వాల క్రైం: కారు కొనాలనే ఆశయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఆర్థికంగా ఉన్న వారు మాత్రం ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.లక్షలు వెచ్చించి దక్కించుకునేందుకు వెనకడుగు వేయరు. అయితే ఇక్కడే పలువురు యజమానులు దళారుల వైపు.. ఆర్టీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అయినప్పటికీ దళారులకు తెలిసిన సిబ్బంది ద్వారా ఫ్యాన్సీ నంబర్‌ను పెద్ద మొత్తంలో చెల్లించే యజమానులకు ఎలాగైనా ఫ్యాన్సీ నంబర్ సొంతం చేయాలనే లక్ష్యంతో ఉంటారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి తెలంగాణ ట్రాన్స్‌పోర్టు శాఖ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వివిధ సేవలు ఆన్లైన్ చేసి దళారీ వ్యవస్థకు చెక్ పెట్టింది. తాజాగా ఫ్యాన్సీ నంబర్ విషయంలోనూ అందరికీ అందుబాటులో ఉండేలా ఆన్లైన్లోనే వాహనదారులకు ఉపయోగపడేలా కోరుకున్న నంబర్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. జిల్లాలో ఈ విధానానికి ఈనెల 10న అనుమతులు జారీ చేయడంతో వాహన యజమానులు ఊరట చెందుతున్నారు. సేవలు ప్రారంభం.. ఫ్యాన్సీ నంబర్‌ను పొందేందుకు జిల్లా రవాణా శాఖలో ప్రతిరోజూ ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రక్రియ పూర్తయి మొబైల్ నంబర్‌కు సందేశం వస్తుంది. అనంతరం కోరుకున్న నంబర్‌ను త్వరగా పొందవచ్చు. ఇక ఎక్కడి నుంచైనా ఆన్లైన్ నంబర్‌ను ఎంపిక చేసుకునే ఆవకాశం ఉండటంతో వాహనదారులకు ఎంతో ఉపయోగపడనుంది. సద్వినియోగం చేసుకోవాలి వాహనాల రిజిస్ట్రేషన్‌లో భాగంగా ఫ్యాన్సీ నంబర్లు ఆన్లైన్లో రిజర్వు చేసుకునే అవకాశాన్ని కల్పించాం. ఈ విధానం ద్వారా వాహన యజమానులు కోరుకున్న నంబరును సులువుగా పొందవచ్చు. అలాగే 15 రోజుల్లో వాహనాన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. – పురుషోత్తంరెడ్డి, డీటీఓ -
రవాణా కమిషనర్ కార్యాలయంలో దాడులు
సాక్షి, హైదరాబాద్: స్వయంగా రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొలువుదీరి ఉండే రవాణా కమిషనర్ కార్యాలయంలోనే లంచావతారం పడగవిప్పింది. కొత్త వాహనాల్లో మార్పుచేర్పులు, అక్షర దోషాలను సవరించడం వంటి విధులు నిర్వహించే పరిపాలనాధికారి జె.నరేందర్ మంగళవారం రూ.36 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇలా అవినీ తికి పాల్పడుతూ నరేందర్ ఏసీబీకి చిక్కడం ఇది రెండోసారి. ఖైరతాబాద్‌లోని రవాణా కమిషనర్ కార్యాలయంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. సంగారెడ్డికి చెందిన సీహెచ్ సందీప్ ట్రేలర్ అండ్ ట్యాంకర్‌గా వాహనాన్ని మార్పు చేసుకోవడం కోసం రవాణాశాఖ నుంచి ప్రొసీడింగ్స్‌ను పొందేందుకు గత నెల 13న అడ్మినిస్ట్రేటివ్ అధికారి నరేందర్‌ను సంప్రదించాడు. సదరు అనుమతుల కోసం రూ.36 వేలు లంచం ఇవ్వాల్సిందిగా నరేందర్ డిమాండ్ చేశాడు. చివరకు రూ.30 వేలు తీసుకొని ప్రొసీడింగ్స్ ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈ క్రమంలో సందీప్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారుల సూచన మేరకు రూ.36 వేల నగదును నరేందర్‌కు అందజేశాడు. అప్పటికే నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు నరేందర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 2016 జనవరి 4న ఒక కేసులో రూ.8,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన నరేందర్ తిరిగి మరోసారి పట్టుబడటం గమనార్హం. అతన్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. లంచం అడిగితే ఫిర్యాదు చేయండి.. రవాణా శాఖలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్–1064కు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, రవాణా కమిషనర్ ప్రధాన కార్యాలయంలో ఏసీబీ దాడులతో హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. దళారులను కార్యాలయాల్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ జాగ్రత్తలు పాటించారు. -
జేసీ దివాకర్ రెడ్డికి షాక్
సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి రవాణా శాఖ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 23 బస్సులను ఆర్టీఏ అధికారులు గురువారం సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడస్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ కమిషనర్ సీతారామాంజనేయులు, జాయింట్ కమిషనర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలోని అధికారులు పలు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారంగా టికెట్ ధరలు వసూలు చేస్తున్న 23 బస్సులను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. అంతేకాకుండా దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 23 ఇంటర్ స్టేట్ క్యారియల్ బస్సుల పర్మిట్లను కూడా రద్దు చేశారు. అదేవిధంగా నిబంధనలను అతిక్రమించినందుకు పలు కేసులు నమోదు చేశారు. అయితే దివాకర్ ట్రావెల్స్‌పై అనేక ఫిర్యాదులు వచ్చాయని అందులో భాగంగానే తనిఖీలు చేశామని, దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని జాయింట్ కమిషనర్ ప్రసాద్ రావు వెల్లడించారు. -
ఆర్టీఏలో..అలజడి!
జిల్లా ఆర్టీఏలో రోజురోజుకు ముసలం ముదురుతోంది. ఎంవీఐలు మొదలు ఇతర ఉద్యోగులు సైతం ఇక్కడ విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపడంలేదు. ఇప్పటికే అధికారులు, సిబ్బంది కొరతతో సతమతమవుతుండగా.. అందుబాటులో ఉన్నవారిలో పలువురు అవినీతి మరకలు అంటించుకుంటున్నారు. దీంతో మిగతా అధికారులు, ఉద్యోగులు సైతం ఒక్కొక్కరుగా జిల్లా దాటివెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా ఆర్టీఏ సేవలు పూర్తిగా స్తంభిస్తున్నాయి. లైసెన్సులు, ఆర్సీబుక్లు, రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్, ట్యాక్సుల వసూలు తదితర రెగ్యులర్ సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. పాఠశాలల పునఃప్రారంభం నాటికే స్కూల్ బస్సులన్నింటికీ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. స్కూళ్లు మొదలై వారం కావస్తున్నా ఈ విషయంపై ఇప్పటికీ దృష్టిసారించడం లేదు. ఒక్కోసారి పరిగిలో నిర్వహించాల్సిన ఫిట్నెస్ టెస్టులు, ఇతర సేవలకు సైతం వికారాబాద్ రప్పించుకుంటున్నారు. జిల్లాలో కేవలం పరిగిలో మాత్రమే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఉండగా.. వికారాబాద్‌లో ఎలాంటి చోదక పరీక్షలు నిర్వహించకుండానే లైసెన్స్‌లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరిగి: జిల్లా పరిధిలో పని చేసేందుకు ఆర్టీ ఏ శాఖ అధికారులు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరులో ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. ఈ మూడింటికీ కలిపి ఒకే ఎంవీఐ పోస్టు ఉంది. పరిగి ఆర్టీఏ యూనిట్ కార్యాలయంలో ఎంవీఐ పోస్టు ఉండగా.. వికారాబాద్, తాండూరుకు సైతం ఇన్చార్జ్ ఎంవీఐగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఇటీవలి వరకు మూడు ఆర్టీఏ కార్యాలయాల్లో ఎంవీఐగా విధులు నిర్వహించిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఎవరూ రాకపోవటంతో చెకింగ్ ఎంవీఐ కిషోర్ బాబుకు మూడు కార్యాలయాల ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన ఏసీబీ దాడులతో జంకిన ఈయన లాంగ్‌లీవ్‌పై వెళ్లిపోయారు. జిల్లాకు చెందిన మరికొందరు ఉద్యోగులు సైతం ఇక్కడ ఇమడలేక జిల్లా దాటి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో వారం రోజులుగా ఆర్టీఏ సేవలు స్తంభించాయి. ఈ విషయంలో వికారాబాద్ ఆర్టీఓ వాణిని వివరణ కోరగా ఇటీవల రెండు మూడు రోజులు సేవలు స్తంభించిన మాట వాస్తవమేనని, సాధ్యమైనంత వరకు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పక్క జిల్లాకు చెందిన జూనియర్ ఎంవీఐలకు జిల్లాలో ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. అధికారులకు అవినీతి మరకలు... జిల్లాలో ఆర్టీఏ ఉద్యోగుల అవినీతి హద్దులు దాటుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.500 చేయాల్సిన పనికి రూ.2 వేలు, రూ.వెయ్యికి పూర్తయ్యే పని కోసం రూ.5 వేలు వసూలు చేస్తున్నారని సమాచారం. రూ.2 వేలలోపు ఖర్చయ్యే హెవీ లైసెన్స్‌కు ఏకంగా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు దండుకుంటున్నారు. ఇటీవల ఓ ఆర్టీఏ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. దీంతో ఆర్టీఏ అధికారుల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. గతేడాది జిల్లాలో విధులు నిర్వహించే ఓ అధికారి అవినీతి నిర్వాకం రాష్ట్ర సరిహద్దులు దాటిన విషయం తెలిసిందే. ఏకంగా విజయవాడలో లారీలకు బాడీ ఫిట్టింగ్ జరుగుతుండగానే అక్కడికే వెళ్లి ఫిట్నెస్ క్లియరెన్స్ ఇచ్చారు. ఈ ఘటనతో సదరు అధికారిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా అవినీతి మరకలంటించుకున్న అధికారికి మళ్లీ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చి.. కొన్ని నెలల పాటు జిల్లాకు చెందిన మూడు కార్యాలయాల బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిచ్చింది. -
ఇంకా ‘ఫిట్’ కాలేదు!
సాక్షి, హైదరాబాద్: వాహనాల ఫిట్నెస్ తనిఖీ కోసం చౌటుప్పల్ సమీపంలోని మల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన ఫిట్నెస్ సెంటర్ ప్రారంభోత్సవానికి నోచుకోవట్లేదు. యంత్రాలతో వాహనాల ఫిట్నెస్ను తనిఖీ చేసి 10 నిమిషాల్లో సర్టిఫికెట్ జారీ చేసే సామర్థ్యం ఈ కేంద్రం ప్రత్యేకత. 95 శాతం పూర్తయిన ఈ కేంద్రాన్ని 2018 మే నెలాఖరుకు ప్రారంభించాలి. కానీ పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వస్తోంది. పనులు పూర్తయి ఏడాది కావొస్తున్నా దీన్ని ప్రారంభించట్లేదు. ఈ సెంటర్ ప్రారంభోత్సవాన్ని పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు. జాప్యానికి కారణాలేంటి? ఈ కేంద్రానికి కేటాయించిన ప్రాంతంలోని 10 గుంటల స్థలం వివాదంలో చిక్కుకుంది. ఈ స్థలం తనదంటూ ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. దీంతో దీని ప్రారంభోత్సవంలో జాప్యం నెలకొంటోంది. ఇప్పటిదాకా దాదాపు 70 శాతం మేరకు కొనుగోలు చేసిన యంత్రాలు వృథాగా ఉన్నాయి. వీలైనంత త్వరగా దీన్ని ప్రారంభించాలని, లేకపోతే కోట్లు వెచ్చించి తెప్పించిన యంత్రాలు పనికిరాకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేపథ్యం ఇదీ..! రోడ్డుపైకి వచ్చే ప్రతి వాహనానికి ఫిట్నెస్ ఎంతో కీలకం. ఈ విషయంలో రాష్ట్ర రవాణా అధికారులు వాహనాల ఫిట్నెస్ జారీకి ఇంకా మాన్యువల్ విధానాన్నే పాటిస్తున్నారు. దీనివల్ల అనేక అవకతవకలకు ఆస్కారం ఉంది. మామూళ్ల కోసం పలువురు ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ లేని వాహనాలకు పర్మిట్లు ఇస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రానికి అనుమతి, నిధులు సమకూర్చింది. 2014లో ఈ సెంటర్ నిర్మాణానికి కేంద్రం వాటా మేరకు రూ.14.4 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2015 జూన్‌లో చౌటుప్పల్ సమీపంలోని మల్లాపూర్‌లో దాదాపు 10 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ పనులకు అప్పటి రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రోజుకు 250 నుంచి 300 వాహనాలను తనిఖీ చేసి సర్టిఫికెట్లు జారీ చేసే సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంది. రద్దీని బట్టి దీని కెపాసిటీని పెంచుకునే అవకాశం కూడా ఉంది. పూర్తి అత్యాధునిక ఆటోమేటెడ్ యంత్రాలతో వాహనాలకు ఈ కేంద్రంలో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇది దేశంలోనే రెండో కేంద్రం కావడం విశేషం. ఈ సెంటర్లో అవసరమైన వాటిలో ఇప్పటివరకు 70 శాతం యంత్రాలు వచ్చాయి. ఏమేం పరీక్షలు చేస్తారు? ఇక్కడి యంత్రాలన్నీ కంప్యూటర్‌కు అనుసంధానం చేసి ఉంటాయి. సర్టిఫికెట్ల జారీ కూడా కంప్యూటర్ల ద్వారానే జరుగుతుంది. వాహనాల బ్రేకులు, పీయూసీ, ఇంజిన్ కండీషన్, గేర్‌బాక్స్, హెడ్లైట్లను పరీక్షించేందుకు ఇక్కడ అత్యాధునిక యంత్రాలు అమర్చారు. నిర్ణీత ప్రమాణాల మేరకు వాహనాల పరికరాల్లోని లోపాలను ఇవి క్షణాల్లో గుర్తిస్తాయి. -
ఎల్ఎల్ఆర్ గాలం!
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ నేతలు అందివచ్చే ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటున్నారు. నాలుగు ఓట్లు రాలుతాయంటే ఎవరినైనా భయపెడుతున్నారు. ఏ పనైనా చేస్తామంటున్నారు. ఇటీవల కాలంలో ఆర్టీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎల్ఎల్ఆర్ మేళాలు కూడా అలాంటివే. మధ్యతరగతి యువతకు ఎల్ఎల్ఆర్ పేరుతో గాలం వేసి తమవైపు తిప్పుకునేందుకు నేతలు సిద్ధమయ్యారు. అందుకే ఎల్ఎల్ఆర్ మేళా కాస్త ఎన్నికల మేళాలను తలపిస్తున్నాయి. అనంతపురం సెంట్రల్: జిల్లాలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఆర్టీఏ అధికారులను ఎన్నికల పావులుగా వాడుకుంటున్నారా? లెసెన్స్ పేరుతో ఓట్ల రాజకీయానికి తెరలేపారా? మధ్య తరగతి యువతను లక్ష్యం చేసుకుని ప్రణాళిక సిద్ధం చేశారు? ఇటీవల నిర్వహిస్తున్న ఎల్ఎల్ఆర్ మేళాలను చూస్తే అవన్నీ నిజమేననిపిస్తోంది. కరువుకు చిరునామాగా మారిన జిల్లాలో ఉపాధి అవకాశాలు లేక ఎక్కువ మంది యువత మోటారు ఫీల్డ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే ఆటో, ట్యాక్సీ, కారు డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారు. రోడ్డు నిబంధనల ప్రకారం వీరందరికీ లైసెన్స్ కావాలి. మరోవైపు ఇటీవల ద్విచక్రవాహనాల సంఖ్య పెరగడం.. పోలీసుల తనిఖీలు ముమ్మరం కావడంతో లైసెన్స్‌ల ప్రాధాన్యం పెరిగింది. దీన్ని అందిపుచ్చుకున్న అధికారపార్టీ నేతలు తమ నియోజకవర్గాల్లో ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. మేళాలో అన్నీ తామై వ్యవహరించి యువత ఓట్లకు గాలం వేస్తున్నారు. రోజుకు ఆర్టీఏ కార్యాలయంలో 60 మందికి మాత్రమే ఎల్ఎల్ఆర్ టెస్ట్ నిర్వహించే ఆర్టీఏ అధికారులు కూడా ఎమ్మెల్యేల వద్ద మెప్పు పొందేందుకు మేళాలు నిర్వహిస్తూ వందల మందికి లెర్నింగ్ లైసెన్స్‌లు ఇచ్చేస్తున్నారు. నిబంధనలకు భయపడి... ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందడం సామాన్యులకు గగనంగా మారుతోంది. నేరుగా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే సవాలక్ష నిబంధనలు చెబుతున్నారు. అన్నీ దాటుకుని ఎల్ఎల్ఆర్ టెస్ట్‌కు వెళ్లినా అక్కడ పాసవుతామన్న నమ్మకం లేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న అధికారపార్టీ నేతలు తమ ఆధ్వర్యంలో ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఇలా గత నెలలో తాడిపత్రిలో 6 రోజులు ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించి 3,400 మందికి, ఉరవకొండలో ఏకంగా 20 రోజులు నిర్వహించి 10 వేల మంది, ధర్మవరంలో 12 రోజుల పాటు మేళా నిర్వహించి 4వేల మందికి లెర్నింగ్ లైసెన్స్‌లు మంజూరు చేయించారు. ఇవన్నీ ఆర్టీఏ అధికారులు స్వతహాగా చేసినవి కావు. రాజకీయ ప్రయోజనాలకోసమే.. ఆర్టీఏ అధికారులు ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ఎల్ఎల్ఆర్ మేళాలో అధికారపార్టీ చోటా నాయకులు హల్చల్ చేస్తున్నారు. తమ నేత చెప్పారు కాబట్టే మేళా ఏర్పాటు చేశారనీ, ఆయన చెప్పినట్లు వింటే లైసెన్స్‌లు కూడా ఇప్పిస్తామంటూ అక్కడకొచ్చిన యువతకు చెబుతున్నారు. పరోక్షంగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ఆర్టీఏ అధికారుల వింత వైఖరి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే నెలన్నర తర్వాత స్లాట్ బుక్ అవుతోంది. అది కూడా రోజుకు పరిమిత సంఖ్యలో ఎల్ఎల్ఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అయితే రోజుకు 60 మందికి మాత్రమే అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ఫలితంగా వాహనదారుడు దరఖాస్తు చేసుకున్న నెలన్నర, రెండు నెలలకు అవకాశం వస్తోంది. ఆ సమయంలో అధికారులు ఫెయిల్ చేస్తే మరో రెండు నెలలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేస్తున్న మేళాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడైతే ఇదే ఆర్టీఏ అధికారులు రోజులు వందల సంఖ్యలో లెర్నింగ్ లైసెన్స్‌లు మంజూరు చేస్తున్నారు. నేరుగా కార్యాలయానికి వెళ్తే మాత్రం చుక్కలు చూపుతున్నారు. అందువల్లే ఈ మేళాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అందుకే నేతలంతా ఒకటికి రెండు సార్లు తమ నియోజకవర్గాల్లో ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహించాలని ఆర్టీఏ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. డిమాండ్ ఉన్న చోట నిర్వహిస్తున్నాం అందరికీ డ్రైవింగ్ లైసెన్స్‌లు ఉండాలనే ఉద్దేశంతోనే మేళాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రజాప్రతినిధులు అడిగచోట్ల కూడా మేళాలు నిర్వహిస్తున్నాం. ఇందులో రాజకీయాలకు తావు లేదు. ప్రజల నుంచే వ్యక్తిగతంగా చలానా మొత్తాలను స్వీకరిస్తున్నాం. ప్రభుత్వ భవనాల్లోనే నిర్వహిస్తున్నాం. – సుందర్‌వద్దీ, ఉపరవాణా కమిషనర్ -
ప్రమాదాలపై పోలీసుల కీలకనిర్ణయం!
రోడ్డు ప్రమాదాల నివారణకు పంజాబ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలకు కారణమైన వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయించే చర్యలకు ఉపక్రమించారు. పైలట్ ప్రాజెక్టుగా జలంధర్ పట్టణంలో అమలు చేస్తున్న అధికారులు త్వరలో ఆ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నారు. మోటారు వాహన చట్టంతో పాటు ఇండియన్ పీనల్ కోడ్‌లో ఉన్న సెక్షన్లను సైతం పక్కాగా అమలు చేస్తున్నారు. దీనికి అక్కడి ఆర్టీఏ అధికారుల నుంచి పూర్తి సహకారం అందుతోంది. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న వాహన ప్రమాదాల దృష్ట్యా.. ఆ విధానం ఇక్కడా అమలు చేయాలంటున్నారు నిపుణులు. సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాలు, మృతులు, క్షతగాత్రుల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి వాహనచోదకుల్లో బాధ్యత పెంచడమే మార్గంగా భావించిన పంజాబ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలకు కారణమైన వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయించే చర్యలకు ఉపక్రమించారు. పైలెట్ ప్రాజెక్టుగా అక్కడి జలంధర్ పట్టణంలో దీన్ని అమలు చేస్తున్నారు. ఇలాంటి విధానం నగరంలో ఉండాలని నిపుణులు చెబుతుండగా... ఇప్పటికే మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారి విషయంలో దీన్ని అమలు చేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. వాతావరణ కారణాలు, రోడ్డు స్థితిగతుల వల్ల చోటు చేసుకునే ప్రమాదాలను మామూలుగానే పరిగణిస్తున్న పంజాబ్ అధికారులు డ్రైవర్ నిర్లక్ష్యం, అవగాహనా రాహిత్యంతో పాటు మద్యం మత్తులో జరిగిన వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి అక్కడి ఆర్టీఏ అధికారుల నుంచీ పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయి. ఆ ‘రెండు చట్టాలు’ ఏం చెబుతున్నాయంటే.. నిర్లక్ష్యంగా వాహనం నడపడం ద్వారా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడటానికి, మృతి చెందటానికి, అంగవైకల్యం పొందడానికి కారణమైన వాహన చోదకుడి లైసెన్సును రద్దు చేసే అవకాశం అధికారులకు భారత మోటారు వాహనాల చట్టం (ఎంవీ యాక్ట్)తో పాటు ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్లు కూడా కల్పిస్తున్నాయి. ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్ 19 ప్రకారం ఓ వ్యక్తి డ్రైవింగ్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగితే లైసెన్స్ రద్దు చేసే లేదా రెన్యువల్‌కు నిరాకరించే అవకాశం ఉంది. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 304–ఏ (నిర్లక్ష్యంతో మృతికి కారణం కావడం), 279 (బహిరంగ రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనం నడపడం), 337 (నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరుల భద్రతకు ముప్పుగా మారడం), 338 (నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా ఇతరులు తీవ్రంగా గాయపడటానికి కారణం కావడం) సెక్షన్ల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి లైసెన్సును కోల్పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం వీటి ఆధారంగానే జలంధర్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఏళ్లుగా ఈ విధానం అమలులో ఉంది. అక్కడ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ చిక్కితే జరిమానాలు, శిక్షలు భారీ స్థాయిలో ఉండడంతో క్యాన్సిల్ అయిన వ్యక్తి వాహనం తీసే సాహసం చేయడని, ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవని అధికారులు చెబుతున్నారు. సిటీలో అమలుకు సవాళ్లెన్నో.. ఇలాంటి కఠిన విధానాలు కేవలం మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కిన వారి విషయంలోనే కాకుండా ప్రమాదాలకు కారణమైన వారి పైనా ఉండాలని నగర ట్రాఫిక్ పోలీసులు సైతం అంగీకరిస్తున్నారు. అయితే అమలుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయంటున్నారు. ఇలాంటి వ్యవహారాలకు ఆర్టీఏ అధికారుల వద్ద ఉన్న డేటాబేస్ ఎంతో కీలకం. అయితే ఇది అన్ని అవసరాలకు వినియోగించేలా, అన్ని స్థాయిల్లోనూ యాక్సిస్ చేసేందుకు అవసరమైన పరిజ్ఞానం అందుబాటులో రావాలని సూచిస్తున్నారు. మరోపక్క ఓ వ్యక్తి లైసెన్స్‌ను క్యాన్సిల్ చేసినా పేరు లేదా ఇంటి పేరులో కొన్ని అక్షరాలను మార్చడం ద్వారా అదే వ్యక్తి మరోసారి లైసెన్స్ తీసుకునే అవకాశం ఉండకూడదని, ప్రస్తుతం ఆధార్ లింకేజ్‌లో ఇది సాధ్యమవుతుందంటున్నారు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో లైసెన్స్ వివరాలు సైతం సామాజిక భద్రతా కార్డుల్లో నిక్షిప్తమై ఉండడంతో వారు ఇలా తీసుకునే అవకాశం ఉందని, ఇక్కడ అలాంటి వ్యవస్థ లేదని చెబుతున్నారు. డేటాబేస్‌తో పాటు ఇతర సమస్యలను అధిగమించి జలంధర్ విధానాన్ని సిటీలోనూ అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఇక డ్రైవరే టార్గెట్
సాక్షి, హైదరాబాద్: రహదారులపై ఉల్లంఘనలకు పాల్పడే వారిని పట్టుకుంటున్న ట్రాఫిక్ పోలీసులు.. వాహనం నంబర్ ఆధారంగా జరిమానా విధిస్తున్నారు. దీంతో పదేపదే చిక్కుతున్న వాహనాల డేటాబేస్ మాత్రమే రూపొందుతోంది. అసలు తప్పు వాటిని డ్రైవ్ చేసిన వ్యక్తులదని తెలిసినా పదేపదే ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని గుర్తించడం సాధ్యం కావట్లేదు. దీంతో ఎన్నిసార్లు ఉల్లంఘనలకు పాల్పడినా ఒకే తరహాలో జరిమానా విధిస్తున్నారు. ‘డ్రంక్ అండ్ డ్రైవింగ్’లో అనుసరిస్తున్న విధానాలను పరిగణనలోకి తీసుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లంఘనల నమోదును డ్రైవర్ ఆధారంగా చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్నిచోట్ల అమలవుతున్న ఈ విధానం త్వరలో నగరవ్యాప్తంగా అమలులోకి రానుంది. దీని ఆధారంగా రూపొందే డేటాబేస్ ద్వారా తరచూ ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించడం, ఆర్టీఏ, న్యాయస్థానాల సహకారంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. నంబర్ ‘మార్చకుండా’ఓటీపీ.. నగరంలో పెండింగ్‌లో ఉన్న ఈ–చలాన్ల సంఖ్య భారీగానే ఉంటోంది. ఆయా వాహనచోదకులకు పోలీసులు ఎస్సెమ్మెస్‌ల రూపంలో రిమైండర్స్ పంపుతున్నారు. దీనికి అవసరమైన ఫోన్ నంబర్లను వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో ఆర్టీఏ అధికారులకు ఇచ్చింది తీసుకుంటున్నారు. అయితే ఆయా వాహనాలు చేతులు మారిపోవడం, అసలు యజమాని దగ్గరే ఉన్నా అతను ఫోన్ నంబర్లు మార్చేయడంతో ఈ సమాచారం వారికి చేరట్లేదు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనలను డ్రైవర్ కేంద్రంగా నమోదు చేయడంతో పాటు వారి నుంచి ఫోన్ నంబర్లనూ తీసుకోనున్నారు. ట్రాఫిక్ పోలీసులు కోరినప్పుడు ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగానో, అనివార్య కారణాలతోనో తప్పు నంబర్లు చెప్పే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫోన్ నంబర్ల సేకరణలో వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) విధానం అమలు చేయనున్నారు. ఉల్లంఘనుడు తన ఫోన్ నంబర్ చెప్పిన వెంటనే అధికారులు పీడీఏ మిషన్‌లో నమోదు చేస్తారు. వెంటనే పీడీఏలు కనెక్ట్ అయి ఉండే సర్వర్ నుంచి సదరు నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఉల్లంఘనుడు చెప్తేనే అసలు నంబర్ చెప్పినట్లు నిర్ధారిస్తారు. ఈ విధానంతో పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించడం తేలికవుతుందని ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు. అలా రూపొందే డేటాబేస్ ఆధారంగా ఆర్టీఏ ద్వారా లైసెన్స్ సస్పెండ్ చేయించడం, కొన్ని రకాలైన ఉల్లంఘనుల్ని కోర్టు ద్వారా జైలుకు తరలించడం తదితర కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. పీడీఏ మిషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పుస్తకాలను వాడట్లేదు. ఉల్లంఘనులకు జరిమానా విధించడం, వారి నుంచి క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా ఆ మొత్తాన్ని వసూలు చేయడం తదితరాలన్నీ పీడీఏ మిషన్ల ద్వారానే నిర్వహిస్తున్నారు. తాజాగా తీసుకున్న ‘డ్రైవర్’నిర్ణయంతో ఈ పీడీఏ మిషన్లలో కొన్ని అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. వాహనచోదకుడి వద్ద ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దాన్ని రీడ్ చేసే పరిజ్ఞానం జోడించారు. ఉల్లంఘనుడి వద్ద ఉన్నది జిరాక్సు ప్రతి అయితే ఆ వివరాలు మాన్యువల్‌గా ఫీడ్ చేయనున్నారు. ప్రతి ఉల్లంఘనుడు తన డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మరో గుర్తింపు కార్డును చూపడం కచ్చితం చేయనున్నారు. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ తదితరాల్లో ఏదో ఒకటి అదనంగా చూపించాల్సిన విధానం అమలులోకి తీసుకువస్తున్నారు. ఈ వివరాలనూ పీడీఏ మిషన్లలో ఫీడ్ చేయడం ద్వారా ఉల్లంఘనులకు సంబంధించిన డేటాబేస్ రూపొందించనున్నారు. -
ఏసీబీ వలలో ఆర్టీఏ అధికారి
సాక్షి, హైదరాబాద్/వరంగల్ క్రైం: రవాణాశాఖలో మరో అవినీతి అధికారి బాగోతం బయటపడింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేస్తున్న పైడిపాల రవీందర్, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్ల పై ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ నేతృత్వంలో అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. హైదరాబాద్, వరంగల్ సహా ఐదు చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టి రూ. 7 కోట్లకుపైగా విలువైన ఆస్తుల పత్రాలు, నగ దు, బంగారు అభరణాలు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రవీందర్‌పై పీసీ యాక్ట్ 13 (1), రెడ్ విత్ 13 (2) కింద కేసులు నమోదు చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 1981లో రోజువారీ వేతనంపై పనికి చేరిన రవీందర్ 1986లో ఇరిగేషన్‌శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సంపాదిం చారు. అయితే ఆ శాఖలో పరిమితికి మించి వర్క్ ఇన్స్పెక్టర్లు ఉండటంతో ప్రభుత్వం ఆయన్ను 1999లో రవాణాశాఖకు బదిలీ చేసి జూనియర్ అసిస్టెంట్‌గా నియమించింది. నాటి నుంచి పదోన్నతులు పొందుతూ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేస్తున్నారు. ఏసీబీ గుర్తించిన అక్రమాస్తుల వివరాలు... ⇒హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ హైదర్‌గూడలో రూ. 1.35 కోట్ల విలువైన నాలుగంతస్తుల భవనం. ⇒హన్మకొండలో రూ. 11.26 లక్షలు, రూ. 12.56 లక్షల విలువైన రెండు జీ ప్లస్ వన్ ఇళ్లు. ⇒హన్మకొండలోని పోచమ్మకుంటలో రూ. 8.7 లక్షల విలువైన 424 గజాల ఇంటి స్థలం. ⇒హన్మకొండలోని మరో ప్రాంతంలో రూ. 2.4 లక్షల విలువైన 200 గజాల ఇంటి స్థలం. ⇒హన్మకొండలోని ఆటోనగర్‌లో రూ. 3.5 లక్షల విలువైన 119 గజాల ఇంటి స్థలం. ⇒రూ. 5.5 లక్షల విలువైన మారుతీ ఎస్‌క్రాస్, ఆల్టో కార్లు. ⇒రూ. 1.5 లక్షల విలువైన రెండు ద్విచక్ర వాహనాలు. ⇒రూ. 15 లక్షల విలువైన బంగారం, ఇంట్లో రూ. 6 లక్షల నగదు. ⇒బ్యాంకు ఖాతాలో రూ. 3 లక్షల నగదు, రూ. లక్ష విలువైన ఇన్సూరెన్స్ బాండ్. రూ. 5 లక్షల విలువైన గృహోపకరణాలు. -
విందు కోసం..
వారంతా ఉన్నత విద్యావంతులు. మంచి స్నేహితులు. అందరూ కలిసి విందు చేసుకున్నారు. అయితే డబ్బు తక్కువపడడంతో హైవేపైకి వచ్చి ఆర్టీఏ అధికారులమంటూ వాహనదారులను బెదిరించి డబ్బు వసూలు చేశారు. చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు. కల్లూరు: నగర శివారు గోశాల వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులమంటూ వాహన డ్రైవర్లను బెదిరించి డబ్బు వసూలు చేసిన ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఉలిందకొండ ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. మద్దూర్‌నగర్‌కు చెందిన చాకలి ఇనుకొండ వంశీ మహేష్, గురుబ్రహ్మ నగర్‌కు చెందిన పెండేకల్ రమణాచారి, లక్ష్మీటౌన్‌షిప్ వాసి కొండేటి సందీప్, బాబాబృందావన్‌నగర్ వాసి కవడపు నరహరి, గణేష్‌నగర్–2 నివాసి జి. అరుణ్‌కుమార్ యాదవ్, శకుంతలా కళ్యాణమంటపం వెనకనున్న రాజేశ్వరినగర్ వాసి వడ్డె వెంకటేష్‌ప్రసాద్ మంచి స్నేహితులు. ఈనెల 21న అందరూ కలిసి విందు ఏర్పాటు చేసుకున్నారు. పార్టీకి డబ్బు తక్కువ రావడంతో గోశాల వద్ద జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులమని, డబ్బివ్వాలంటూ ట్యాంకర్ డ్రైవర్ పుల్ల మాబాషాపై దాడి చేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చామని ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా సందీప్ ట్రాన్స్‌కోలో జూనియర్ లైన్మెన్, నరహరి ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఏవియేషన్ ఆఫీసర్‌గా హైదరాబాద్‌లో పని చేస్తుండగా, జి. అరుణ్‌కుమార్ పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ ఫైనలియర్ చదుతున్నాడు. వంశీ మహేష్, వడ్డె వెంకటేష్‌ప్రసాద్ బీటెక్ ఫెయిలయ్యారు. -
అక్రమంగా ఇసుక తరలిస్తూ పట్టుబడ్డ తహసీల్దార్
జగ్గయ్యపేట: సీజ్ చేసిన ఇసుక లారీలకు రిలీజ్ ఆర్డర్ వచ్చినప్పటికీ కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట తహసీల్దార్ వాటిని వదలకుండా, తన సొంత అవసరాల కోసం తెలంగాణ తరలిస్తుండగా గరికపాడు చెక్‌పోస్ట్ ఆర్టీఏ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 13న గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం చింతపల్లిలోని కస్తాల సమీపంలోని కృష్ణానది నుంచి మూడు లారీల్లో అక్రమంగా ఇసుకను తెలంగాణ తరలిస్తుండగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు లారీలు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన లారీలకు శుక్రవారం కోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ క్రమంలో జగ్గయ్యపేట తహసీల్దార్ బి.చంద్రశేఖర్ స్వయంగా స్టేషన్‌కు వచ్చి రిలీజ్ ఆర్డర్ కాపీలను తీసుకొని లారీల్లో ఉన్న ఇసుకను తన కార్యాలయంలో అన్లోడ్ చేస్తానని చెప్పి వాహనాలను తీసుకెళ్లారు. అయితే ఆ ఇసుకను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటలోని తన ఇంటి నిర్మాణానికి చిల్లకల్లు మీదుగా అనుమంచిపల్లికి జానకిరామయ్య అనే ట్రాన్స్పోర్ట్ ఏజెంట్ ద్వారా పంపించారు. అనుమంచిపల్లి గ్రామానికి 50 మీటర్ల దూరంలో ఆర్టీఏ చెక్‌పోస్టు ఉండడంతో లారీలను నిలిపివేసి తహసీల్దార్‌కు సమాచారమిచ్చారు. అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ చెల్లారావు ఆ లారీలను గమనించి డ్రైవర్లను వివరాలు అడిగారు. తెలంగాణ తీసుకెళ్తున్నామని డ్రైవర్లు సమాచారమివ్వడంతో వాటిని స్వాధీనం చేసుకుని చిల్లకల్లు పోలీసులకు అప్పగించారు. తహసీల్దార్ ప్రమేయంతోనే.. మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాల్సిన లారీలను తహసీల్దార్ ప్రమేయంతో తెలంగాణలోని సూర్యాపేట తరలించేందుకు ప్రయత్నించారని జగ్గయ్యపేట సీఐ వైవీఎల్ నాయుడు తెలిపారు. కృష్ణా జిల్లా చిల్లకల్లు స్టేషన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2 లారీలకు రిలీజ్ ఆర్డర్ వచ్చిందని తహసీల్దార్ చంద్రశేఖర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తీసుకెళ్లారన్నారు. తహసీల్దార్‌తో పాటు డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ ఏజెంట్‌పై కేసు నమోదు చేశామన్నారు. దీనిపై తహసీల్దార్ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా.. తెలంగాణ రాష్ట్రంలో ఇసుకకు కొరత లేదని ఇక్కడ నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని సమాధానమిచ్చారు. తహసీల్దార్‌కు చార్జిమెమో జారీ తహసీల్దార్ చంద్రశేఖర్‌కు చార్జిమెమో జారీ చేస్తూ కలెక్టర్ లక్ష్మీకాంతం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు తహసీల్దార్‌పై చిల్లకల్లు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. -
వాహనాల రిజిస్ట్రేషన్లలో స్తబ్దత
- ‘రెండో వాహనం’పై కొనసాగుతున్న గందరగోళం - ఒకే తరహా పేర్లతో చిక్కులు... విచారణలో జాప్యం సాక్షి, హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్ ఆర్టీయేకు తలనొప్పిగా మారింది. ఒకే తరహా పేర్లుండటం... రెండో వాహనానికి రెండు శాతం అదనపు పన్ను చెల్లించాల్సి రావడం... వెరసి అటు ఆర్టీఏ... ఇటు వాహనదారులను గందరగోళంలోకి నెట్టేసింది. నిబంధనల ప్రకారం రెండో వాహనం కొంటే 12 శాతం లైఫ్ టాక్స్‌కు 2 శాతం పన్ను అదనంగా కట్టాలి. ఇందుకు ఆర్టీఏ అధికారులు ఆన్లైన్ డేటా ఆధారంగా రిజిస్ట్రేషన్ సమయంలో వాహన దారుల వివరాలు బయటకు తీస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఒకే తరహా పేర్లతో గతంలో వాహనాలు రిజిస్టర్ అయినట్టు చూపిస్తోంది. దీంతో సదరు వాహనదారుడుకి ఉన్నది ఒకటే వాహనం అయినా... తమ వద్దనున్న డేటా ప్రకారం అతడికి రెండో వాహనం ఉన్నట్టు అధికారులు పరిగణిస్తున్నారు. రెండు శాతం అదనపు పన్ను కట్టాలని చెబుతున్నారు. దీంతో వాహనదారులు కంగుతింటున్నారు. తమకిదే తొలి వాహనమని, తమ పేరున్న ఆ వ్యక్తెవరో తెలియదని మొత్తుకుంటే... ఆ వ్యక్తి వివరాలు తెమ్మని తిప్పి పంపుతున్నారు. లేదంటే అఫిడవిట్ ఇవ్వమని అడుగుతున్నారు. తమకు సంబంధం లేని వివరాలు తామెక్కడి నుంచి తెస్తామని కొత్త వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు డీలర్లు, వాహనదారులు 2 శాతం అదనపు పన్ను ఎగవేతకు తప్పుడు పేర్లు, అడ్రస్‌లతో రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం కూడా ఈ చిక్కులకు కారణమవుతోంది. ఈ గందరగోళం మధ్య రిజిస్ట్రేషన్లు మందగిం చి... ఆర్టీఏ ఆదాయానికి గండి పడింది. 25 శాతానికి పైగా బ్రేక్... గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కేంద్రాల పరిధిలో రోజూ 1,000 నుంచి 1,200 కొత్త వాహనాలు నమోదవుతాయి. ఒకే తరహా పేర్లున్న వ్యక్తులపైన విచారణ కారణంగా రిజిస్ట్రేషన్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వాహనదారులు ఒకటికి నాలుగుసార్లు ఆర్టీఏ చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో రిజిస్ట్రేషన్లు 25 శాతానికి పైగా పడిపోయినట్లు సమాచారం. రెండో వాహనంపైన చెల్లించవ లసిన అదనపు పన్ను వసూలు చేయకుండా వాహనదారులకు సహకరించారనే కారణంపై ప్రభుత్వం ఇటీవల 10 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసి, మరి కొందరికి షోకాజ్ నోటీస్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీఏ సిబ్బంది రిజిస్ట్రేషన్లంటేనే జంకుతున్నారు. కంప్యూటర్, డీలర్ల వద్ద జరిగే పొరపాట్లకు తాము బలవుతున్నా మంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం లేదా... మొత్తంగా ఈ రెండో వాహనం వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు 6 నెలల క్రితమే ఒక ప్రతిపాదన చేశారు. డీజిల్ వాహనాలపైన ఇప్పుడున్న 12 శాతం పన్ను ను 13 శాతానికి పెంచి, రెండో వాహనంపై అదనపు పన్ను నిబంధనను తొలగించాలని ప్రతిపాదించారు. దీనిపై సీఎం కేసీఆర్ సైతం సంతకం చేశారు. దీని అమలు ఆరు నెలలకు పైగా పెండింగ్‌లోనే ఉంది. -
14 ట్రావెల్స్ బస్సుల సీజ్
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించారు. నగరంలోని పెద్దఅంబర్‌పేట్ వద్ద బుధవారం ఉదయం తనిఖీలు చేపట్టిన ఆర్టీఏ అధికారులు నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 14 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. -
30 ఓవర్ లోడ్ వాహనాలు సీజ్
వరంగల్: అనుమతులు లేని వాహనాలపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. ఓవర్‌లోడుతో పాటు అనుమతి పత్రాలు లేకుండా సరుకులు రవాణా చేస్తున్న వాహనాలను తనిఖీలు చేపట్టారు. వరంగల్ అర్బన్ జిల్లా ఖిల్లావరంగల్ మండల పరిధిలో శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆర్టీఏ, విజిలెన్స్ అధికారులు పరిమితికి మించి లోడును తీసుకెళ్తున్న 30 లారీలను సీజ్ చేసి ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు. -
ఆర్టీఏ తనిఖీలు : ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు
హైదరాబాద్ : రాజేంద్రనగర్ గగన్‌పహాడ్ వద్ద మంగళవారం ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 14 ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు చేశారు. ఆర్టీఏ అధికారుల తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. -
ఆర్టీఏ దాడులు: 10 స్కూల్ బస్సులు సీజ్
తిరుపతి: నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. తిరుపతిలో శనివారం ఉదయం అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఫిట్నెస్ లేని 10 బస్సులను సీజ్ చేశారు. ఫిట్ నెస్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు. -
అధికారుల తనిఖీలు.. స్కూలు బస్సులు సీజ్
మెదక్: పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజున ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులపై కొరడా జులిపించారు. మెదక్ జిల్లాలో ఆర్టీఏ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫిట్‌నెస్‌లేని 8 స్కూలు బస్సులను సీజ్ చేశారు. సంగారెడ్డిలో 3, ఇస్నాపూర్‌లో 3, మెదక్‌లో 2 బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో సైతం ప్రైవేటు స్కూల్, కాలేజీ బస్సులపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 5 బస్సులను సీజ్ చేశారు. -
ఆటో యూనియన్లతో చర్చలు విఫలం
హైదరాబాద్: ఆటో యూనియన్లతో ఆర్టీఏ అధికారులు జరిపిన చర్చలు విఫలమైయ్యాయి. దీంతో ఆదివారం అర్థరాత్రి నుంచి ఆటో యూనియన్లు సమ్మె బాటపట్టనున్నాయి. హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వాధికారులతో ఆటో యూనియన్ నాయకులు జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో యూనియన్ నాయకులు నిరవధిక ఆటోబంద్‌కు పిలుపినిచ్చారు. రవాణా, పోలీసు అధికారుల స్పెషల్‌డ్రైవ్‌కు వ్యతిరేకంగా తమపై కొనసాగుతున్న వేధింపులను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని సుమారు లక్షా 30 వేల ఆటోలు ఆదివారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. ఆటోమీటర్ ట్యాంపరింగ్, పరిమితికి మించిన ప్రయాణికుల తరలింపు, డ్రైవింగ్ లెసైన్సు లేకుండా ఆటోలు నడపడం, ప్రయాణికులపై దౌర్జన్యం, నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేయడం వంటి వివిధ రకాల ఉల్లంఘనలపై ఈ నెల 16 నుంచి పోలీసులు, ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టిన సంగతి విదితమే. -
ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ ఆకస్మిక దాడులు
-
మెస్సేజ్ వచ్చింది.. లారీ వదిలేయ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రవాణా శాఖ మంత్రి కనుసన్నల్లో కొందరు తెలుగు తమ్ముళ్లు జోరుగా అధికలోడుతో గ్రానైట్ అక్రమ రవాణా సాగిస్తున్నారు. దీనికి ‘కేరాఫ్ టీఆర్ మినిస్టర్’ అని ఆర్టీఏ అధికారుల సెల్ఫోన్లకు మంత్రి అనుచరుల వాహనాల నంబర్ల మెసేజ్ రావటమే నిదర్శనం. ఆ మెసేజ్‌ను నెల్లూరు, ప్రకాశం జిల్లా ఉపరవాణా కమిషనర్ మొబైల్‌కు పంపినట్లు తెలిసింది. మెసేజ్‌తో అలర్ట్ అయిన డీటీసీ.. ఆలస్యం చేయకుండా కిందిస్థాయి అధికారుల సెల్ఫోన్లకు వాహనాల నంబర్ల మెసేజ్ ను పంపినట్లు తెలుస్తోంది. సాధారణంగా మామూళ్ల మత్తులో చూసీచూడకుండా వ్యవహరించే అధికారులు.. మంత్రి నుంచి మెసేజ్ వచ్చిందని ప్రచారం జరగటంతో మిన్నకుండిపోతున్నారు. ప్రకాశం, గుంటూరుతో పాటు ఇతర తెలంగాణ జిల్లాల నుంచి చెన్నై, కృష్ణపట్నం, కర్ణాటక రాష్ట్రాలకు గ్రానైట్ రవాణా అవుతోంది. ఈ ప్రాంతాల నుంచి నిత్యం 300 వాహనాలకుపైగా నెల్లూరు మీదుగా వెళ్తున్నాయి. అయితే వాటిలో పరిమితికి మించి అధికలోడుతో గ్రానైట్‌ను తరలిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి, బల్లికురవ, గురిజేపల్లి నుంచి గ్రానైట్‌ను తరలించే తమ వాహనాలపై కేసులు రాయకుండా ఉండేం దుకు కొందరు తమ్ముళ్లు రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావును ఆశ్రయించినట్లు తెలిసిం ది. ఈ నేపథ్యంలో కొన్ని నంబర్లను రవాణా అధికారులకు ఫోనులో మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. -
ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారుల కొరడా
ఎల్బీనగర్ (హైదరాబాద్): ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు మరోసారి కొరడా ఝుళిపించారు. బుధవారం తెల్లవారుజామున ఎల్బీనగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఐదు ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేయగా, మరో ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. -
ఆర్టీఏ దాడులు.. 20 బస్సులు స్వాధీనం
కడప: సరైన స్థితిలో లేని పాఠశాల బస్సులను నడిపి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న విద్యాసంస్థల ఆటకట్టించడానికి రవాణ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సులపై గురువారం ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 20 బస్సులను సీజ్ చేశారు. -
ఆర్టీఏ దాడులు: 9 బస్సులు సీజ్
విజయవాడ : నిబంధనలు పాటించని బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. కృష్ణా జిల్లాలో మంగళవారం ఉదయం అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఫిట్నెస్ లేని, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 9 బస్సులను సీజ్ చేశారు. అదేవిధంగా విజయనగరం జిల్లాలో ముడిగామ్ సమీపంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమతి లేకుండా నడుస్తున్న నాలుగు స్కూల్ వ్యాన్లతో పాటు, 11 బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అర్టీఏ అధికారులు హెచ్చరించారు. -
ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరడా
హైదరాబాద్: ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. ఎల్బీనగర్ లో శుక్రవారం ప్రైవేటు ట్రావెల్స్ పై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. ఇందులో దివాకర్, కేశినేని, మార్నింగ్ స్టార్, శ్రీకృష్ణ ట్రావెల్స్ కు చెందిన 8 బస్సులను సీజ్ చేశారు. పండగ నేపధ్యంలో అనుమతి లేకుండా ప్రైవేటు ట్రావె ల్స్ బస్సులను నడుపుతుండటంతో ఆర్టీఏ అధికారులు రంగంలో దిగారు. -
ప్రైవేట్ ట్రావెల్స్‌పై కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు
-
ప్రైవేట్ ట్రావెల్స్‌పై కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు
విజయవాడ: రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారుల దాడులు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్న బస్సులపై కేసులు నమోదు చేశారు. కృష్ణా జిల్లాలో 6, పశ్చిమగోదావరి జిల్లాలో 6, ప్రకాశంలో 2, కడపలో ఒక బస్సును ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకుని జప్తు చేశారు. అలాగే మరో 9 బస్సులను కూడా స్వాధీనం చేసుకుని రవాణశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. -
ప్రైవేటు దందాపై ఆర్టీఏ కొరడా
విజయవాడ: ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు మరోసారి కొరడా ఝళిపించార. ఆంధ్రప్రదేశ్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ బస్సులపై దాడులు నిర్వహించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణ చార్జీలు రెండింతలు, మూడింతలుగా వసూళ్లు చేయడంతో పాటు రవాణాశాఖ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని ప్రైవేట్ ట్రావెల్స్‌లపై ఆర్టీఏ అధికారులు మళ్లీ దాడులు చేశారు. విజయవాడ, గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేసిన 6 ప్రైవేటు బస్సులను అధికారులు సీజ్ చేశారు. -
కొనసాగుతున్న ఆర్టీఏ తనిఖీలు
హైదరాబాద్: ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు మరోసారి కొరడా ఝళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ బస్సులపై దాడులు నిర్వహించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణ చార్జీలు అధికంగా వసూళ్లు చేయడంతో పాటు రవాణాశాఖ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని ప్రైవేట్ ట్రావెల్స్‌లపై ఆర్టీఏ అధికారులు మళ్లీ దాడులు ప్రారంభించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగర శివార్లలో ఆర్టీఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 11 బస్సులపై కేసు నమోదు చేయగా, మరో 4 బస్సులను అధికారులు సీజ్ చేశారు. కేశినేని, ఎస్వీఆర్, కావేరి, మేఘన ట్రావెల్స్ బస్సులు సీజ్ చేశారు. -
రాకాసి బస్సు
కాసేపట్లో బస్సు దిగాలి.. బెంగళూరు వచ్చేస్తోందని ప్రయాణికులు అప్పుడప్పుడే నిద్రలోంచి మేల్కొంటున్నారు. ఇంతలో ఉన్నట్లుండి ఒక్క సారిగా.. ధడేల్ మంటూ పెద్ద శబ్దం.. బస్సు డివైడర్‌ను ఢీకొందంటూ ప్రయాణికుల కేకలు.. అయ్యో.. బస్సు.. ఆపండి అంటూ ఆర్తనాదాలు.. అంతలోనే బస్సు డివైడర్‌పై నుంచి ఎడమ వైపు తిరిగి బోల్తా.. దేవుడా.. కాపాడు అంటూ గావు కేకలు.. అరుపులు, ఆర్తనాదాలు, ఏడుపులు, పెడబొబ్బలు... హోస్కోట వద్ద సోమవారం తెల్లవారు జామున నెల్లూరు నుంచి బెంగళూరుకు వస్తూ ప్రమాదానికి గురైన వోల్వో బస్సు వద్ద దృశ్యమిది.. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం, కర్ణాటకలోని హావేరిల్లో రెండు వోల్వో బస్సులు దగ్ధమైన ఘటనలు ప్రజల స్మృతి పథం నుంచి చెరిగిపోక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడం అందరినీ నిశ్చేష్టులను చేసింది. ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికుల భద్రతపై కలుగుతున్న అనుమానాలకు బలం చేకూర్చింది. సాక్షి, నెల్లూరు: ‘పాలెం’ ఘటన కళ్ల ముందు మెదలుతుండగానే మరో ప్రైవేటు బస్సు మృత్యు శకటంగా మారింది. ఐదుగురి ప్రాణాలను బలితీసుకుని జిల్లాలో విషాదం నిం పింది. తనిఖీలు చేస్తున్నామని ఓ వైపు ఆర్టీఏ అధికారులు చెబుతున్నా, మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిరుగుతూ ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నాయి. రాజేష్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఆదివారం రాత్రి 10 గంటలకు 52 మంది ప్రయాణికులతో నెల్లూరు నుంచి బెంగళూరుకు బయలుదేరింది. విజయవాడ నుంచి ఈ బస్సు బయలుదేరాల్సి ఉన్నా, నెల్లూరులోనే టికెట్లన్నీ రిజర్వ్ కావడంతో ఇక్కడ నుంచే పంపారు. సోమవారం తెల్లవారుజామున 5.15 గంటలకు కర్ణాటకలోని హోస్కోట వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని మూడు ఫల్టీలు కొట్టింది. అనంతరం కొద్దిదూరం బస్సు వేగంగా ఈడ్చుకుపోవడంతో సంఘటన స్థలంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 8 మందికి తీవ్రంగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. ఎక్కువ మందికి చేతులు, కాళ్లు విరిగాయి. మృతుల్లో నెల్లూరుకు చెందిన అనూష్(25), విజయకుమార్(32), మానస్‌కుమార్(7), గూడూరుకు చెందిన ప్రదీప్(25), పొదలకూరు మండటం వావింటపర్తికి చెందిన చిన్నం ప్రసాద్(28) ఉన్నారు. వీరిలో ప్రదీప్, ప్రసాద్, విజయకుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అనూష నిండు గర్భిణి. పత్తాలేని ట్రావెల్స్ నిర్వాహకులు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ప్రయాణికుల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో, తమ వారు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు హుటాహుటిన రాజేష్ ట్రావెల్స్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఏజెన్సీ నిర్వాహకులు కార్యాలయానికి తాళం వేసి పత్తా లేకుండా పోయారు. ఆర్టీఏ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు కరువయ్యారు. తమవారి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు వచ్చిన వారంతా నానా తంటాలు పడ్డారు. నిర్లక్ష్యమే కారణమా రాజేష్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి యాజ మాన్యం నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొట్టినట్లు తెలిసింది. ఘటన జరిగేందుకు అరగంట ముందు డ్రైవర్ బస్సు ఆపి టీ తాగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. మరోవైపు ప్రయాణికుల జాబితా రూపకల్పనలోనూ యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిం చింది. తిరుపాల్ పేరు మీద ఎల్-11 ఎస్టీ, ఎల్-13 ఎస్టీ, ఎల్-14 ఎస్టీ సీట్లు రిజర్వయ్యాయి. ఈ పేర్లపై వయస్సు కాలంలో 0 అని ఉంది. ఎల్-23, ఎల్-24 నంబర్లలో చూపినట్లు మల్లికార్జున, పంకజ్‌జైన్ అసలు ప్రయాణమే చేయలేదు. ఆర్-11 పేరున శ్రీకాంత్ శనివారం ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. ఆ వివరాలను జాబితాలో తెలపలేదు. ఈ తప్పుల తడక జాబితాను అధికారికంగా ఆర్టీఏ అధికారులు విడుదల చేయడం గమనార్హం. ఇంత జరిగినా ఆయా ట్రావెల్స్ సంస్థలపై చర్యలు తీసుకోవడానికి అటు పాలకులకు, ఇటు అధికారులకు ధైర్యం కరువైంది. -
నిబంధనలు పాటించని మూడు బస్సులు సీజ్
-
ప్రయివేట్ ట్రావెల్స్ కార్యాలయాలపై ఆర్టీఏ దాడులు
విజయవాడ: ప్రయివేట్ ట్రావెల్స్ పై దాడులను ఆర్టీఏ అధికారులు ముమ్మరం చేశారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్న ప్రయివేట్ బస్సు యాజమాన్యాలపై ఆర్టీఏ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ బస్సులను సీజ్ చేసిన అధికారులు తాజాగా తమ పంథాను మార్చారు. నగరంలోని ప్రయివేట్ ట్రావెల్స్ ఆన్ లైన్ బుకింగ్ సెంటర్లపై దాడులకు దిగారు. బస్సు టికెట్లు రిజర్వేషన్లు చేస్తున్నఆయా సెంటర్ల ఏజెంట్ల లైసెన్సు లపై ఆరా తీశారు. వారి వద్ద నుంచి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ అధికారుల అకస్మిక దాడులతో ప్రైవేటు ట్రావెల్స్ ఏజెంట్లు బుకింగ్ మూసివేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా ట్రావెల్స్ ఏజెంట్లు దౌర్జన్యం చేశారు. 'సాక్షి' కెమెరాను ట్రావెల్స్ సిబ్బంది లాక్కున్నారు. -
39 ప్రైవేట్ బస్సులు సీజ్ చేసిన ఆర్టీఏ
మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలెం సమీపంలో ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ అగ్నికి ఆహుతి అయిన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమైయ్యారు.దాంతో రాష్ట్రంలో తిరిగే ప్రైవేట్ ట్రావెల్స్‌పై తనిఖీలు ముమ్మరం చేసింది. అందులోభాగంగా ఈ రోజు తెల్లవారుజామున శంషాబాద్ సమీపంలోని షాపూర్ చెక్‌పోస్ట్ వద్ద ఆర్టీఏ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 13 బస్సులను సీజ్ చేశారు. అలాగే హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై 7, హైదరాబాద్ - ముంబై జాతీయ రహదారిలో 3 బస్సులను సీజ్ చేశారు. విజయవాడలో 16 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అర్టీఏ అధికారులు సీజ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం వద్ద ఇటీవల బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ఆహుతి అయింది. ఆ ఘటనలో 45 మంది మరణించారు. ఆ ఘటనతో నిద్రలో జోగుతున్న రాష్ట్ర రవాణ శాఖ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది.దాంతో ప్రైవేట్ ట్రావెల్స్‌పై తనిఖీల కొరడా ఝుళిపించింది. ఈ నేపథ్యంలో ఆ ఘటన జరిగిన నాటి నుంచి నేటి వరకు రవాణా శాఖ నిబంధనలను తుంగలోకి తొక్కి నడుపుతున్న దాదాపు వెయ్యి బస్సులను ఆ శాఖ అధికారులు సీజ్ చేశారు.