
అధికారుల తనిఖీలు.. స్కూలు బస్సులు సీజ్
మెదక్: పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజున ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులపై కొరడా జులిపించారు. మెదక్ జిల్లాలో ఆర్టీఏ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫిట్‌నెస్‌లేని 8 స్కూలు బస్సులను సీజ్ చేశారు. సంగారెడ్డిలో 3, ఇస్నాపూర్‌లో 3, మెదక్‌లో 2 బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్లోని ఎల్‌బీనగర్‌లో సైతం ప్రైవేటు స్కూల్, కాలేజీ బస్సులపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 5 బస్సులను సీజ్ చేశారు.