
సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి రవాణా శాఖ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 23 బస్సులను ఆర్టీఏ అధికారులు గురువారం సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడస్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ కమిషనర్ సీతారామాంజనేయులు, జాయింట్ కమిషనర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలోని అధికారులు పలు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారంగా టికెట్ ధరలు వసూలు చేస్తున్న 23 బస్సులను అధికారులు గుర్తించి సీజ్ చేశారు.
అంతేకాకుండా దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 23 ఇంటర్ స్టేట్ క్యారియల్ బస్సుల పర్మిట్లను కూడా రద్దు చేశారు. అదేవిధంగా నిబంధనలను అతిక్రమించినందుకు పలు కేసులు నమోదు చేశారు. అయితే దివాకర్ ట్రావెల్స్‌పై అనేక ఫిర్యాదులు వచ్చాయని అందులో భాగంగానే తనిఖీలు చేశామని, దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని జాయింట్ కమిషనర్ ప్రసాద్ రావు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment