
ఆర్టీఏ దాడులు: 10 స్కూల్ బస్సులు సీజ్
తిరుపతి: నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. తిరుపతిలో శనివారం ఉదయం అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు.
ఫిట్నెస్ లేని 10 బస్సులను సీజ్ చేశారు. ఫిట్ నెస్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు.