ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ దాడులు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్: ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. ఎల్బీనగర్ లో శుక్రవారం ప్రైవేటు ట్రావెల్స్ పై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. ఇందులో దివాకర్, కేశినేని, మార్నింగ్ స్టార్, శ్రీకృష్ణ ట్రావెల్స్ కు చెందిన 8 బస్సులను సీజ్ చేశారు. పండగ నేపధ్యంలో అనుమతి లేకుండా ప్రైవేటు ట్రావె ల్స్ బస్సులను నడుపుతుండటంతో ఆర్టీఏ అధికారులు రంగంలో దిగారు.