సంక్రాంతి వేళ.. సినిమా పోస్టర్ల కళకళ! | Sankranthi Festival Special Posters Released In Tollywood | Sakshi
Sakshi News home page

Sankranthi Special Movie Updates: సంక్రాంతి వేళ.. సినిమాల అప్‌డేట్స్‌ చూశారా!

Published Mon, Jan 15 2024 1:04 PM | Last Updated on Mon, Jan 15 2024 1:29 PM

Sankranthi Festival Special Posters Released In Tollywood - Sakshi

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఆ సందడే వేరు. కొత్త ఏడాదిలో అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే పండగ ఇదొక్కటే. అంతలా ప్రాముఖ్యత ఉన్న ఈ ఫెస్టివల్‌ కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. మరీ ముఖ్యంగా సినిమా వాళ్లకు సంక్రాంతి పండుగ ఓవరం లాంటిదనే చెప్పాలి. అగ్ర హీరోలంతా ఈ పండుగకు సినిమాలు రిలీజ్‌ చేసేందుకే మొగ్గు చూపుతారు. అలానే ఈ ఏడాది కూడా తెలుగులో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వాటి మహేశ్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నాసామిరంగ చిత్రాలు ఇప్పటికే థియేటర్లలో సందడి చేస్తున్నాయి.

వీటి సంగతి అలా ఉంచితే మరికొందరు హీరోలు ఈ ఫెస్టివల్‌కే అప్‌డేట్స్‌ సిద్ధమయ్యారు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా సినిమా హీరోలంతా క్రేజీ అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చేశారు. మెగాస్టార్, ప్రభాస్, సూర్య, విజయ్‌, వరుణ్ తేజ్ లాంటి స్టార్‌ హీరోలు తమ మూవీ పోస్టర్స్‌తో అలరించారు. అంతే కాకుండా అలా ఈ ఏడాది పొంగల్‌కు మన ముందుకు వచ్చిన కొత్త సినిమాల పోస్టర్స్‌పై ఓ లుక్కేద్దాం. 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 156వ చిత్రం టైటిల్‌ను సంక్రాంతి రోజే మేకర్స్ రివీల్ చేయనున్నారు. ఇప్పటికే ప్రభాస్- మారుతి డైరెక్షన్‌లో మూవీ టైటిల్‌ను వెల్లడించారు మేకర్స్. ది రాజాసాబ్ అంటూ యంగ్ రెబల్‌ స్టార్‌ వచ్చేస్తున్నారు. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ చేస్తూ వీడియోను విడుదల చేశారు. వీటితో పాటు శర్వానంద.. శతమానంభవతి పార్ట్‌-2 రానుందని పోస్టర్ విడుదలైంది. మరోవైపు కోలీవుడ్ స్టార్స్ విజయ్‌, సూర్య సినిమాలకు సంబంధింటిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మీరు కూడా మీ అభిమాను హీరోల చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ చూసేయండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement