
‘స్పిరిట్’(spirit) సినిమా కోసం స్పెషల్ అప్లికేషన్ పెట్టుకున్నారు హీరో మంచు విష్ణు(Manchu Vishnu). ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న మూవీ ‘స్పిరిట్’. ఈ చిత్రంలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు ప్రభాస్(Prabhas). ఈ వేసవిలో ‘స్పిరిట్’ సినిమా చిత్రీకరణను ప్రారంభించనుంది యూనిట్. దీంతో నటీనటుల కోసం ‘ఎక్స్’లో ఓ నోట్‌ను షేర్ చేసింది.
‘‘ఫిల్మ్ అండ్ థియేటర్ బ్యాక్‌గ్రౌండ్‌లో అనుభవం ఉన్న నటీనటులు మా సినిమాలో యాక్ట్ చేసేందుకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటూ కొన్ని షరతులతో ‘స్పిరిట్’ టీమ్ ఓ నోట్‌ను షేర్ చేసింది. ఈ నోట్‌ను ‘ఎక్స్’లో షేర్ చేసి, తాను ‘స్పిరిట్’ సినిమా కోసం అప్లికేషన్ పెట్టుకున్నానని, ఏం జరుగుతుందో చూడాలన్నట్లుగా విష్ణు మంచు పేర్కొన్నారు.
మరోవైపు విష్ణు మంచు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’లో రుద్రగా ప్రభాస్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. మరి... ప్రభాస్ ‘స్పిరిట్’ లో నటించే చాన్స్ విష్ణు మంచుకు దక్కుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక టీ–సిరీస్, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్ ‘స్పిరిట్’ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment