విజయవాడ: ప్రయివేట్ ట్రావెల్స్ పై దాడులను ఆర్టీఏ అధికారులు ముమ్మరం చేశారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్న ప్రయివేట్ బస్సు యాజమాన్యాలపై ఆర్టీఏ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ బస్సులను సీజ్ చేసిన అధికారులు తాజాగా తమ పంథాను మార్చారు. నగరంలోని ప్రయివేట్ ట్రావెల్స్ ఆన్ లైన్ బుకింగ్ సెంటర్లపై దాడులకు దిగారు. బస్సు టికెట్లు రిజర్వేషన్లు చేస్తున్నఆయా సెంటర్ల ఏజెంట్ల లైసెన్సు లపై ఆరా తీశారు. వారి వద్ద నుంచి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ అధికారుల అకస్మిక దాడులతో ప్రైవేటు ట్రావెల్స్ ఏజెంట్లు బుకింగ్ మూసివేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా ట్రావెల్స్ ఏజెంట్లు దౌర్జన్యం చేశారు. 'సాక్షి' కెమెరాను ట్రావెల్స్ సిబ్బంది లాక్కున్నారు.