సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాతంగా జరిగిందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయను శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 35,500 పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత 13 నియోజకవర్గాల్లో 4 గంటలకు పోలింగ్ ముగిసిందన్నారు. ఈవీఎంలన్నింటినీ భారీ భద్రతతో స్ట్రాంగ్ రూమ్‌లో పెడుతున్నామని చెప్పారు.
ఎన్నికలకు మూడు నెలల ముందే తెలంగాణ పోలీసులు టీమ్ వర్క్ చేసినట్టు వెల్లడించారు. ఎన్నికల సంఘం నిబంధనలు ప్రకారం ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. కౌటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ప్రశాంతంగా పోలింగ్: సీపీ అంజనీ కుమార్
హైదరాబాద్‌లో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగినట్టు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఆయన సాక్షితో మాట్లాడుతూ... సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. చివరి గంట కొద్దిగా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో.. దాన్ని దృష్టిలో పెట్టుకుని డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులను అలర్ట్ చేశామని అన్నారు. నగరంలో లక్షకు పైగా కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి పర్యవేక్షించినట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment