
నితిన్ గడ్కరీ
హైదరాబాద్: ఏపీ వాహనాలపై పన్ను వేయడం అనేది తెలంగాణ రాష్ట్ర పరిధిలోనిదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. తెలంగాణ రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి గడ్కరీతో ఈ ఉదయం సమావేశమై ఆర్టీసి విభజనపై చర్చించారు. అనంతరం మంత్రులు ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు డ్రై పోర్టు కోసం కేంద్ర కృషి చేస్తుందని గడ్కరీ చెప్పారు. భారత్లో జల రవాణా మెరుగుపడటానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు.
నిబంధనల ప్రకారమే ఏపీ వాహనాలపై రోడ్ టాక్స్ విధించినట్లు మహేందర్ రెడ్డి చెప్పారు. ఏపీ అధికారుల వల్లే ఆలస్యమైందన్నారు. రాష్ట్రం విడిపోయినందువల్లే అక్కడి వాహనాలపై పన్ను విధిస్తున్నట్లు ఆయన తెలిపారు.