ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సమస్యాత్మక కేంద్రాల్లో కాంగ్రెస్ నేతలకు భద్రత కల్పించాలని మాజీ ఎంపీ మధుయాష్కీ డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు. డిసెంబర్ 6న తనపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారని, మరోనేత గూడూరు నారాయణరెడ్డిపై కూడా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కొందరు టార్గెట్ చేశారని కౌంటింగ్ రోజున కూడా భౌతిక దాడి జరిగే అవకాశం ఉందని వెంటనే గన్‌మెన్లను కేటాయించాలని ఆయన కోరారు.