madhu yashki
-
టీపీసీసీ అధ్యక్ష పదవి బీసీకీ దక్కే అవకాశం
-
‘కవిత కోసం బీఆర్ఎస్ మంతనాలు.. బండి సంజయ్ వ్యాఖ్యల మర్మమదే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంపై ఆ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏఐసీసీ డైరక్షన్ మేరకే రాష్ట్రంలో చేరికలు జరుగుతున్నాయన్నారు. అలాగే, లిక్కర్ స్కాంలో కవితను విడిపించేందుకు ఢిల్లీ పెద్దలతో బీఆర్ఎస్ నేతలు మంతనాలు జరుపుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు.కాగా, మధుయాష్కీ తాజాగా మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌లో చేరికలు ఏఐసీసీ డైరెక్షన్ మేరకే జరుగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన మూడు రోజులకే సర్కార్ పడిపోతుందన్నారు. దళిత నేత భట్టి విక్రమార్క సీఎల్పీగా ఉన్నప్పుడు ఆ హోదా పోయేలా బీఆర్ఎస్ పనిచేయలేదా?. దళితుల వ్యతిరేకంగా ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్ పనిచేశారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో చేర్చుకున్న నేతలకు మంత్రి పదవులు ఇస్తుంది. ప్రజా గాయకుడు గద్దర్‌ను గేటు వద్దనే గంటల తరబడి నిలబెట్టింది కేసీఆర్ కాదా?. ప్రజా పాలనలో అందరికీ మాట్లాడే స్వేచ్చ ఉంది. సీఎం రేవంత్ ఎవరైనా కలవొచ్చు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చొరబడి తానే ఉద్యమం చేసినట్లు కలరింగ్ ఇచ్చాడు. కేంద్రంలో అధికారంలోకి వస్తాం అనుకున్నాం. మంత్రి పదవులు ఇస్తాం అని ఎవరికీ చెప్పడం లేదు.రైతు కుటుంబం నుండి వచ్చిన రేవంత్ సీఎం అయితే కేసీఆర్ ఓర్వడం లేదు. పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్, నేను చాలా కష్టపడ్డాం. నేను నేరుగా అమెరికా నుండి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో 50 ఏళ్లకు పైగా ఉన్నాను. నేను ఏ పార్టీ మారలేదు, మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్ట్‌పైనే ప్రస్తుతం బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. కల్వకుంట్ల కవిత విడుదల కోసం బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలని కేసీఆర్, కేటీఆర్ చూస్తున్నారు. ఈ అంశంపై ఢిల్లీలో మంతనాలు చేస్తున్నారు. హరీష్‌రావుపై బండి సంజయ్ ప్రేమ కురిపించడానికి కారణం అదే’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుపై నిన్న(ఆదివారం)బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో ఉన్న ఒకే ఒక మంచి నాయకుడు, వివాదరహితుడు హరీష్ రావు ఒక్కడే అని అన్నారు. అలాగే, హరీష్ ఒకవేళ బీజేపీలో చేరాలనుకుంటే రాజీనామా చేశాకే చేరాలని కామెంట్స్ చేశారు.కాగా, నిజంగా ఉద్యోగం కోసం రాసే వారు ఎవరు ఉద్యోగాలను వాయిదా వేయాలని అడగరు. ఉద్యోగాలు వాయిదా వేయడం వలన 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది. శిక్షణ తరగతులు చెప్పే కోచింగ్ సెంటర్లలో కేసీఆర్ కుటుంబానికి వాటాలు ఉన్నాయి. అందుకే పరీక్షలు వాయిదా వేయాలని అంటున్నారు. నారాయణ, చైతన్య కాలేజీలలో హరీష్, కవితకు 17 శాతం వాటాలు ఉన్నాయి.ఇక, పీసీసీ చీఫ్ ఎంపికపై ఢిల్లీలో అసలు చర్చే లేదు. మంత్రివర్గ విస్తరణపై జరిగింది. ఎవరెవరికి మంత్రి పదవులివ్వాలి. ఏయే శాఖలు ఇవ్వాలి అనే దానిపై చర్చ జరిగింది. అదే రోజు పీసీసీపై ఐదు నిమిషాలు చర్చించి పక్కకు పెట్టారు. కొందరు మంత్రులు కూడా తమకు సరైన శాఖలు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. మంత్రులపై సమన్వయం చేసే దానిపై చర్చ జరిగింది. కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకంలో ఇంఛార్జి దీపాదాస్ మున్షి పాత్ర ఏమీ లేదు. సీఎం రేవంత్, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. -
కేంద్రంలో కాంగ్రెస్ రావడం అనివార్యం
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అనివార్యమని, జనాభాలో అధిక శాతం ఉన్న పేద వర్గాలకు సామాజిక న్యాయం కలి్పంచేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పోరాటం కొనసాగిస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో స్థాపించిన సంస్థలను అమ్మడమే తప్ప.. మోదీ సర్కార్ కొత్తగా ఏర్పాటుచేసిన సంస్థలేమీ లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’లో మధుయాష్కీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేసి, రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు పన్నిన కుట్రలో భాగంగానే తమకు 400 సీట్లు ఇవ్వాలంటూ మోదీ ప్రజలను కోరుతున్నారన్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మధుయాష్కీ ధ్వజమెత్తారు. విదేశాలనుంచి నల్లదనం తెస్తానని, ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తానన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తాను ఓబీసీ అని చెప్పుకునే మోదీ.. ఓబీసీలకు ఒక్క మేలు కూడా చేయలేదన్నారు. కేసీఆర్ అప్పుల్లో ముంచారు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని, అవినీతి.. అక్రమాలతో తెలంగాణను సర్వనాశనం చేశారని మధుయాష్కీ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చేస్తాం, పడగొడతామంటూ ఒకదిక్కు బీఆర్ఎస్, మరోదిక్కు బీజేపీ అవాకులు చవాకులు పేలుతున్నాయని, అందుకే తాము ఇతర పార్టీలనుంచి వచ్చే వారిని ఆహ్వానిస్తున్నామని ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చా రు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
హైదరాబాద్ వనస్థలిపురంలో పోలీసులతో మధుయాష్కీ వాగ్వాదం
-
అర్ధరాత్రి హైడ్రామా.. పోలీసులతో మధుయాష్కీ వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ మరోసారి రాజకీయం హీటెక్కింది. ఎన్నికల వేళ ఐటీ దాడులు, పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసి దాడులు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక, తాజాగా మంగళవారం అర్ధరాత్రి కాంగ్రెస్ ఎల్బీ నగర్ అభ్యర్థి మధు యాష్కీ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కీ నివాసంలో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి సోదాలు చేశారు. మధుయాష్కీ నివాసంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు సోదాలు చేశారు. ఈ సందర్బంగా మధుయాష్కీ ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉంచి డబ్బులు పంచుతున్నాడని ఫిర్యాదు రావడంతో తనిఖీ చేసేందుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో, పోలీసులు, ఆయన మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మధుయాష్కీ మద్దతుదారులు పోలీసులతో కాసేపు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్బంగా మధు యాష్కీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితోనే పోలీసులు సోదాల పేరుతో ఇంట్లోకి ప్రవేశించారని అన్నారు. పోలీసులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీ ఎలా నిర్వహిస్తారని మధుయాస్కీ వారిని ప్రశ్నించారు. అర్ధరాత్రి సోదాల పేరుతో పోలీసులు తన కుటుంబ సభ్యులను, కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతామన్న భయంతోనే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోలీసులను పంపారని ఆరోపించారు. కాగా, పోలీసుల సోదాలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. విచారణ పేరుతో మధుయాష్కీ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఈ సోదాలపై పోలీసులు స్పందించారు. డయల్ 100కి డబ్బు పంపిణీపై ఫిర్యాదు అందడంతో విచారణకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. చివరకు ఆయన ఇంట్లో ఎలాంటి నగదు లభించకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. దీంతో, ఎల్బీ నగర్లో అర్ధరాత్రి హైడ్రామా క్రియేట్ అయ్యింది. ఇది కూడా చదవండి: ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో భారీగా నగదు స్వాధీనం -
పక్కా వ్యూహంతో వెళ్తే గెలుపు ఖాయం
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పక్కా ప్రచార వ్యూహంతో ముందుకెళితే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అన్నారు. ఎన్నికల ప్రచార నిర్వహణలో, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపడంలో టీపీసీసీ ప్రచార కమిటీ చురుకుగా వ్యవహరించాలని సూచించారు. శుక్రవారం గాందీభవన్‌లో టీపీసీసీ ప్రచార కమిటీ తొలి సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కన్వినర్ అజ్మతుల్లా హుస్సేనీలతో పాటు పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌చౌదరి, మన్సూర్ అలీఖాన్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్‌కుమార్ యాదవ్, అజారుద్దీన్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక మాదిరే ఇక్కడా.. ఠాక్రే మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ ప్రజల మ ధ్య యాత్ర చేసిన కర్ణాటకలో పార్టీ విజయం సాధించిందని, తెలంగాణలో కూడా ఘన విజ యం సాధిస్తామని చెప్పారు. ఖమ్మంలో రాహుల్‌గాంధీ పాల్గొన్న బహిరంగ సభ రాష్ట్ర రాజకీ యాలను మార్చి వేసిందని అన్నారు. మధు యాష్కీ, పొంగులేటిల నేతృత్వంలో మంచి ప్ర చార వ్యూహంతో ముందుకెళితే తప్పక విజ యం సాధిస్తామని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని, ఆ రెండు పార్టీలు లోపాయికారీగా పనిచేస్తున్నాయన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అసెంబ్లీ నియోజకవర్గా ల వారీగా సమస్యలను గుర్తించి ప్రత్యేక ప్రణాళికతో పోరాడాలని సూచించారు. రాహుల్‌గాంధీ చేసిన రైతు డిక్లరేషన్, ప్రియాంకాగాంధీ చేసిన యూత్ డిక్లరేషన్లను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ విషయంలో పార్టీ అనుబంధ సంఘాలు గట్టిగా పనిచేయాలని కోరారు. మాఫీ అయింది మిత్తి మాత్రమే: మధుయాష్కీ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీల తోడుదొంగల సినిమాను ప్రజల మధ్య బయటపెడతామని మధుయాష్కీ చెప్పారు. కేసీఆర్, మోదీలు తెరవెనుక ఏం చేశారో, తెర ముందు ఏం చేశారో వివరిస్తామన్నారు. రుణమాఫీని ఐదేళ్లుగా చేయకుండా ఇప్పుడు చేయడంతో ఐదేళ్ల మిత్తి మాత్రమే మాఫీ అయిందని, దీనిపై పోస్టుకార్డు ఉద్యమం చేస్తామని చెప్పారు. ఈ నెల 6న గాంధీ ఐడియాలజీ సెంటర్లో నిర్వహించే సమావేశంలో ప్రచార వ్యూహాలపై మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామన్నారు. -
ధర్నాలు చేస్తే రైతులను ఆదుకునేదెవరు?
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా ధర్నాలు చేస్తే రైతుల ధాన్యం కొనేదెవరని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ప్రశ్నించారు. ‘కొండంత రాగం తీసి పనికిరాని పాట పాడినట్టు’ఢిల్లీలో సీఎం కేసీఆర్ ధర్నా సాగిందని, అది దొంగదీక్ష అని, రైతులను దగా చేసే కుట్రతో కేసీఆర్ క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ఫిషర్మెన్ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌తో కలసి వారు విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ ధర్నాలో సీఎం కేసీఆర్ హిందీలో మాట్లాడితే రైతుల ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారమవుతుందా అని మధుయాష్కీ ప్రశ్నించారు. పన్ను నొప్పి పేరుతో వారం రోజులు ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్ మొక్కుబడి దీక్ష చేశారని, ఢిల్లీలోని స్టార్ హోటళ్లలో టీఆర్ఎస్ నేతలు కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి 24 గంటల సమయం ఇస్తున్నామని, వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
ఎప్పటికి బీజేపీతో పోత్తు ఉండదు
-
‘తమ్ముడు కేటీఆర్ నీ బండారం బయట పెడతాం’
సాక్షి, నిజామాబాద్: పసుపు రైతుల కోసం పార్లమెంట్లో నిలదీస్తా.. పసుపు బోర్డు, మద్దతు ధరల కోసం ఎంతవరకైనా పోరాడుతా అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. అర్వింద్‌ను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తాం అని.. రామ్ మాధవ్ ఆర్మూర్‌లో హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు. అర్వింద్ పసుపు బోర్డు సాధిస్తారా లేదా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. కేంద్రం మెడలు వంచుతాం అని చెప్పే సీఎం కేసీఆర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత ఏం చేశారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. (చదవండి: ‘కేటీఆర్ సీఎం అయితే హరీశ్‌కే సమస్య’) మా ఇద్దరికి మీ బాగోతం బాగా తెలుసు: మధుయాష్కి అప్పుడు కవిత చెరకు రైతులను, ఇప్పుడు అర్వింద్ పసుపు రైతులను మోసం చేశారని మధుయాష్కి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు భిక్ష పెట్టింది సోనియాగాంధీ. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. రైతులను అటు మోదీ, ఇటు చోటా మోదీ మోసం చేస్తున్నారు. రైతు వ్యతిరేక చట్టాలకు, విధానాలకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేస్తాంతమ్ముడు తారక రామారావు.. త్వరలోనే నీ బండారం బయట పెడతాం. నాకు, రేవంత్‌కు మీ అందరి బాగోతం బాగా తెలుసు’’ అని హెచ్చరించారు. -
‘దాడి జరిగింది.. భద్రత కల్పించండి’
-
‘దాడి జరిగింది.. భద్రత కల్పించండి’
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సమస్యాత్మక కేంద్రాల్లో కాంగ్రెస్ నేతలకు భద్రత కల్పించాలని మాజీ ఎంపీ మధుయాష్కీ డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు. డిసెంబర్ 6న తనపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారని, మరోనేత గూడూరు నారాయణరెడ్డిపై కూడా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కొందరు టార్గెట్ చేశారని కౌంటింగ్ రోజున కూడా భౌతిక దాడి జరిగే అవకాశం ఉందని వెంటనే గన్మెన్లను కేటాయించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ నేతలు విజయశాంతి, పొన్నం ప్రభాకర్, గూడూరు నారాయణ రెడ్డి, మధుయాష్కీలకు భద్రత కల్పించాలని డీజీపీకి వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన మహేందర్ రెడ్డి బాధ్యులపై చర్యలు తీసుకుని, వారికి భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీలను ఆదేశించారు. -
‘ఆ కుటుంబం అక్రమాస్తుల్ని బయటపెడతాం’
సాక్షి, నిజామాబాద్ : ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబం అక్రమాస్తులను బయటపెడతామని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ అన్నారు. బినామీ కంపెనీలతో కేసీఆర్ కుటంబ సభ్యులు కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మధుయాష్కి శనివారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఉరఫ్ దుబాయ్ శేఖర్‌కు నకిలీ పాస్‌పోర్టు, దొంగనోట్ల స్కామ్‌ల చరిత్ర ఉందని వ్యాఖ్యానించారు. 2009లో కేటీఆర్‌కు కోటిన్నర ఆస్తి ఉండగా.. ఆ మొత్తం 2014లో ఏడుకోట్ల తొంభై లక్షలకు, 2018లో 41 కోట్ల రూపాయలకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు కొడుకు హర్షవర్ధన్ నాయుడు, సత్యం రామలింగరాజు కొడుకు తేజారాజులు కేటీఆర్ వ్యాపార భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. రూ.1500 కోట్ల కాంట్రాక్టును కేటీఆర్ తేజారాజు కంపెనీకి దోచిపెట్టారని ఆరోపించారు. ‘కాల్ హెల్త్’ కేటీఆర్ బినామీ కంపెనీ అనీ, ఆ కంపెనీకి తేజారాజు భర్య చీఫ్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఎంపీ కల్వకుంట్ల కవిత బెంగుళూరులోని డాలర్స్ కాలనీలో నిర్మించిన బంగ్లా వివరాలు రేపు బయటపెడతామని మధుయాష్కి పేర్కొన్నారు. వ్యాట్ ఎత్తేయాలి కదా..!! రాష్ట్ర ప్రజల్ని ఉద్ధరిస్తానని చెప్పుకుంటున్న కేసీఆర్ తెలంగాణలో డీజిల్, పెట్రోల్‌పై వ్యాట్‌ను ఎందుకు ఎత్తేయడం లేదని కేంద్రమంత్రి జితిన్ ప్రసాద్ ప్రశ్నించారు. పక్కనున్న కర్ణాటక ప్రభుత్వం వ్యాట్ తగ్గించిందని గుర్తు చేశారు. నరేంద్ర మోదీతో టీఆర్ఎస్ కుమ్మక్కైందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని అన్నారు. -
కేసీఆర్‌కు ఢిల్లీలో కంటిపరీక్షలా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ఇక్కడ కంటివెలుగు పరీక్షలు నిర్వహించి, కేసీఆర్ తన కళ్లను పరీక్షించుకునేందుకు మాత్రం ఢిల్లీ వెళ్లారని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ ఎద్దేవా చేశారు. కంటి పరీక్షల కోసం ఢిల్లీ పెద్దలంతా హైదరాబాద్ వస్తుంటే, కేసీఆర్ మాత్రం ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్లాడని ఆయన విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాష్కీ మాట్లాడుతూ మోదీ ప్రేమలో గుడ్డివాడయిన కేసీఆర్‌కు సీమాంధ్రులంటే నచ్చదని, ఎల్వీప్రసాద్ ఆసుపత్రి ఆంధ్ర వాళ్లది అయినందునే ఢిల్లీ వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారని ఆరోపించారు. అధికారం కోసం గడ్డితినే కేసీఆర్ కుటుంబాన్ని సీమాంధ్రులు నమ్మవద్దని, టీఆర్ఎస్ నేతల బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదని అన్నారు. సీమాంధ్రులకు తాము అండగా ఉంటామని, టీఆర్ఎస్ బెదిరింపులు, దాడులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. -
‘ఆంధ్రోళ్లతో నువ్వు వ్యాపారాలు చేయడం లేదా’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్, టీడీపీల పొత్తుపై విమర్శలు చేస్తున్న కేటీఆర్‌పై ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ ధ్వజమెత్తారు. కేటీఆర్ ఆంధ్రావాళ్లతో వ్యాపారం చేస్తే తప్పులేదు గానీ తాము టీడీపీతో పొత్తుపెట్టుకుంటే తప్పా అని ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు కొడుకు వ్యాపారాలలో కేటీఆర్ భాగస్వామిగా ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కేసీఆర్ 9 నెలల ముందే అసెంబ్లీని రద్దుచేసి తన అసమర్థతను చాటుకున్నారని ఎద్దేవా చేశారు. వందల కోట్ల రూపాయలతో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు విలాసవంతమైన ఇళ్లు కుట్టుకున్నారనీ, పేదలకు ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మాత్రం స్థలం దొరకడం లేదా అని విమర్శలు గుప్పించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీచేస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబానికి గల ఆస్తులను బయటపెడతామని స్పష్టం చేశారు. -
‘హరీష్ వ్యాఖ్యలు డ్రామాలో భాగమే’
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాం గ్రెస్ పాత్ర లేదని అంటే టీఆర్ఎస్ నేతలు పురుగులు పడి చస్తారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీ వ్యాఖ్యానించారు. వినోద్ అనే పేరు పెట్టుకుని విజ్ఞత లేకుండా, సొల్లు కబుర్లు చెపుతున్న ఎంపీ వినోద్‌కుమార్‌కు దమ్ముంటే తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ఎంపీల పాత్ర గురించి చర్చించేందుకు ముందుకు రావాలని సవాల్ చేశారు. స్థలం, సమయం చెబితే చర్చ కు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ఆకాం క్ష, అమరవీరు ల త్యాగాలను గుర్తించి ప్రత్యేక రాష్ట్రం ఇస్తానని సోనియా 2009లో భువనగిరి సభలో చెప్పిన మేరకే తెలంగాణను ఇచ్చారన్నారు. టీఆర్ఎస్ను ప్రజలు రాజకీయంగా బొందపెట్టబోతున్నారన్నారు. పాతరోజులు మరిచిపోయారు తెలంగాణ పేరుతో ఆజాద్, జైరాం రమేశ్‌ల ఇళ్ల చుట్టూ టీఆర్ఎస్ నేతలు తిరిగిన పాతరోజుల్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని మధుయాష్కీ అన్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కేటీఆర్, కవిత తన ఇంటికి వచ్చి బతిమిలాడారని గుర్తుచేశారు. ఎంపీ వినోద్, తన తమ్ముడు, సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌ల ఆస్తులు 2001లో ఎంతో, ఇప్పుడు ఎంతో తెలిస్తేనే వీళ్లు రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో అర్థమవుతుందన్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నాననే హరీశ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ అది మామాఅల్లుళ్ల డ్రామా అని యాష్కీ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవినీతిని బయటపెట్టి జైల్లో పెడుతుందనే భయంతోనే కూడగట్టుకుంది తీసుకుని వెళ్లిపోదామని హరీశ్ అలా మాట్లాడి ఉంటారని అభిప్రాయపడ్డారు. -
ఎవరిది తెలంగాణం??
-
ముదస్తు : తెలంగాణలో మాటల యుద్ధం
-
‘టైం, ప్లేస్ చెప్పు.. వచ్చేందుకు నేను రెడీ’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రపై బహిరంగ చర్చకు సిద్ధామా అని టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కి ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కి సవాల్ విసిరారు. టైమ్ ,ప్లైస్ చెప్పు ఎక్కడికైనా వచ్చేందుకు రెడీ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆజాద్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ సోయిలేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంటుందన్న సోయి కూడా వినోద్‌కు లేదని ఎద్దేవా చేశారు. ప్రజల త్యాగాలను గుర్తించే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు. రెండు ఎంపీ స్థానాలతో తెలంగాణ తెచ్చామంటే.. ఇప్పుడు ఇంత మంది ఎంపీలు ఉండి మైనార్టీ రిజర్వేషన్లు ఎందుకు సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలేదంటే టీఆర్ఎస్ నేతలు పురుగులు పడి చస్తారన్నారు. వినోద్, అతని తమ్ముడు, కేసీఆర్ కుటుంబ ఆస్తుల వివరాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చెప్పిన అబద్దాలకు మోసపోయి ప్రజలు టీఆర్ఎస్కు అధికారం ఇచ్చారన్నారు. 2019లో సైలెంట్ విప్లవం రాబోతుందని, టీఆర్ఎస్ను బొందపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని మధుయాష్కి ధీమా వ్యక్తం చేశారు. -
‘అందుకే సురేశ్ రెడ్డి పార్టీ వీడారు’
హైదరాబాద్: మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరడం వల్లే వచ్చే నష్టం ఏమీ లేదని మాజీ ఎంపీ మధుయాష్కీ విమర్శించారు. ఈ క్రమంలోనే సురేశ్ రెడ్డి పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో మధుయాష్కీ స్పష్టం చేశారు. సురేష్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని ఆలోచిస్తున్నామని, అందుకే ఆయన పార్టీ మారాడన్నారు. మురికి నీరు కొట్టుకుపోతే, కొత్త నీరు వస్తుందంటూ సురేష్ రెడ్డి పార్టీ మారడాన్ని ఎద్దేవా చేశారు. తమ పార్టీలో చేరడానికి అనేకమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారన్నారు. అసలు టీఆర్ఎస్ వంద సీట్లు గెలిచే ధైర్యం ఉంటే ఇతర పార్టీ నేతల కాళ్ల మీద ఎందుకు పడుతున్నారంటూ మధుయాష్కీ మండిపడ్డారు. మరొకవైపు మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్‌వి పచ్చి అబద్ధాలని, దళితుడ్ని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ ...ఎస్సీలను మోసం చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.. ఈ ఎన్నికల్లో కేసీఆర్ పతన ఖాయమని గీతారెడ్డి అభిప్రాయపడ్డారు. తనపై పోటీకి టీఆర్ఎస్ అభ్యర్థులే లేరన్న గీతారెడ్డి.. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపు తనదేని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కారెక్కిన కాంగ్రెస్ నేత సురేశ్ రెడ్డి -
గౌడ కులస్తులు ఆత్మన్యూనత వీడాలి: కేఈ
సాక్షి, హైదరాబాద్: గౌడ కులస్తులు ఆత్మన్యూనతాభావం వీడాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆకాశం నుంచి తీసుకువచ్చే అమృతంగా నీరాను భావించాలని సూచించారు. గౌడ్లు మరుగునపడిన బంగారమని, సానబెట్టినకొద్దీ రాటుదేలుతారని తెలి పారు. సర్దార్ సర్వాయి పాపన్న త్యాగధనుడు, అభిమానధనుడని కొనియాడారు. సర్వమత రక్షకుడిగా పాపన్న తన కాలంలో పనిచేశారని చెప్పారు. ‘జై గౌడ్’ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ మహారాజ్ 368 జయంతి వారోత్సవాలను ఆదివారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. కృష్ణమూర్తి మాట్లాడు తూ లండన్ మ్యూజియంలో పాపన్న ప్రతిమ ఉందని, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పాపన్న చరిత్ర పదిలంగా ఉందన్నారు. పాపన్న స్ఫూర్తితో గౌడ కులస్తులు ముందుకు సాగాలన్నారు.‘కేంద్ర కేబినెట్ సెక్రటరీ స్థాయిలో గతంలో గౌడ కులస్తులైన ప్రసాద్ లాంటివారు పని చేశారు. మనం ఎవరికీ ఎందులోనూ తక్కువ కాదు’అని పేర్కొన్నారు. రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, బడుగు, బలహీన వర్గాలే తనకు అండగా నిలిచారని అన్నారు. ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డ సర్దార్ పాపన్న అని అన్నారు. ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహం పెట్టడమే ధ్యేయంగా జైగౌడ్ ఉద్యమం ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో రాబోయే కాలం మనదే. మళ్లీ నేను, మధుయాష్కీ గౌడ్ ఎంపీలుగా గెలుస్తాం’అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ గౌడ సామాజికవర్గానికి చెందిన సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం సముచిత పోస్టులు కల్పించడంలేదని విమర్శించారు. ఈ నెల 16న గౌతు లచ్చన్న జయంతి ఉత్సవాలను గుంటూరులో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావు, జైగౌడ్ ఉద్యమం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వి. రామారావు, నేతలు బూర మల్సూర్, బొమ్మగాని శ్రీనివాస్, ఎం.ఏడుకొండలు, తెలుగు యువత అధ్యక్షుడు తూళ్ల వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఈడీ నోటీసులే కారణమా?
హైదరాబాద్: ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని మొదట వ్యతిరేకించిన సీఎం కేసీఆర్, ఆ తర్వాత సమర్ధించడానికి ఈడీ నోటీసులే కారణమని మాజీ ఎంపీ మధుయాష్కి ఆరోపించారు. దొంగ కంపెనీలతో కేసీఆర్ కుటుంబ సభ్యులు మనీ ల్యాండరింగ్ కు పాల్పడుతున్నారని ఈడీ నోటీసులు ఇచ్చింది వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని ఎంపీ కవిత కమీషన్ల కోసం గాయత్రీ షుగర్స్ కి కట్టబెట్టారన్నారు. -
‘ఆ ఫ్యామిలీ అవినీతిలో ఏనుగులా బలిసింది’
-
‘ఆ ఫ్యామిలీ అవినీతిలో ఏనుగులా బలిసింది’
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అవినీతిలో ఏనుగులా బలిసిందని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఎద్దేవా చేశారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు కాపలా కుక్కల్లా అవినీతి ఏనుగు వెనకాల వెంటపడతాయన్నారు. అనినీతి, రైతుల ఆత్మహత్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం నెం 1 గా ఉందన్నారు. గ్రేటర్లో జరిగిన అవినీతిపై కేసీఆర్, కేటీఆర్‌లు ఎందుకు స్పందించలేదన్నారు. రూ.337 కోట్ల రోడ్ల నిర్మాణంలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. జీహెచ్ఎంసీ కుంభకోణంపై లోకాయుక్తలో కేసు వేయబోతున్నామన్నారు. అవినీతిలో కూరుకుపోయిన టీఆర్ఎస్ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు తొందరలో ఉన్నాయన్నారు. ‘కేటీఆర్ మంత్రి అయ్యాక తెలంగాణ బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? కేటీఆర్ కేమాన్ ఐలాండ్ వెళ్లింది అవినీతి సొమ్మును దాచుకోవడానికేనా? జూబ్లీ 800 పబ్ నిర్వాహకులకు మీకు సంబంధం ఏంటి ?అన్ని బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి మిషన్ భగీరథ లో ఎందుకు ఖర్చు చేస్తోంది..కమీషన్ల కోసమేనా?’ అని ప్రశ్నించారు. పేదల డబుల్ బెడ్రూంలకు డబ్బుల్లేవు కానీ..రూ. 50 కోట్లతో కేసీఆర్ ఇల్లు మాత్రం కట్టుకున్నారని అన్నారు. -
కేటీఆర్ రాజీనామా చేయాలి: మధుయాష్కీ
-
కేటీఆర్ రాజీనామా చేయాలి: మధుయాష్కీ
జీహెచ్ఎంసీ కుంభకోణంలో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ డిమాండ్ చేశారు. అక్కడ జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన అన్నారు. తన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసమే.. వాస్తు పేరుతో సచివాలయాన్ని కూల్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని మధుయాష్కీ మండిపడ్డారు. దోచుకోవడంలో ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలూ నెంబర్ వన్ స్థానాల్లో నిలిచాయని విమర్శించారు. -
'తాగడానికి నీరివ్వకుండా.. బీరు కంపెనీలకు ధారపోత'
భీమ్‌గల్ (నిజామాబాద్) : ప్రజలు తాగేందుకు నీరు ఇవ్వకుండా తెలంగాణ సర్కారు బీరు కంపెనీలకు మాత్రం నీటిని సరఫరా చేస్తోందని ఏఐసీసీ నాయకుడు మధుయాష్కీ మండిపడ్డారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, తీవ్ర నీటి కరువుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తగిన చర్యలు తీసుకోవడంలో సర్కారు విఫలమైందని విమర్శించారు. -
మోదీ, కేసీఆర్‌పై మధుయాష్కీ ఫైర్
హైదరాబాద్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ మధు యాష్కీ మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లో మధు యాష్కీ మాట్లాడుతూ... హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మృతికి కారుకులైన వారే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తూ దళితులను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. అలాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా మోసం చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌పై మధు యాష్కీ నిప్పులు చెరిగారు. -
పుర్రె గుర్తుపై స్పందించడం లేదేంటి?
ఎంపీ కవితపై మధుయాష్కీ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: బీడీ కట్టలపై పుర్రె గుర్తు పరిమాణాన్ని తగ్గించడానికి పార్లమెంటులో ప్రయత్నాలేమీ చేయకుండా కార్మికులను మోసం చేయడానికి ఎంపీ కవిత ప్రయత్నిస్తున్నారని మాజీ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ ఆరోపించారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ బీడీ కట్టలపై పుర్రె గుర్తును తొలగించడానికి, సైజును తగ్గించడానికి కవిత చేసిన ప్రయత్నాలేమిటో ప్రజలకు చెప్పాలన్నారు. పార్లమెంటులో దీనిపై ఏమీ మాట్లాడకుండా, రాష్ట్రంలో మాత్రం అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రధాని మోదీని కలిసి దీనిపై మాట్లాడాలని సూచించారు. -
'దత్తాత్రేయను కవిత కలవడం ఓ డ్రామా'
హైదరాబాద్ : బీడీ, సిగరెట్ ప్యాకెట్లపై పుర్రె గుర్తు శాతం తగ్గించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ గురువారం హైదరాబాద్‌లో ఆరోపించారు. ఈ అంశాన్ని టీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తలేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే పుర్రె గుర్తు శాతం తగ్గించడంపై ప్రధాని, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కలవాలని టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఇప్పటికే ఈ అంశంపై నిజామాబాద్ ఎంపీ కవిత కేంద్ర మంత్రి దత్తాత్రేయను కలవడం ఓ డ్రామా అని మధుయాష్కీ అభివర్ణించారు. -
'అందుకే మోదీని విమర్శిస్తున్నారు'
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి రాలేదనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కి అన్నారు. త్వరలో జరుగునున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరుపై టీఆర్ఎస్ పార్టీ ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ఎన్నికల వ్యయం లెక్కలు తప్పుగా చూపిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవితపై ఈసీ అనర్హత వేటు వేయాలని ఆయన కోరారు. -
'అందుకే కేసీఆర్.. బాబును అన్న అంటున్నారు'
-
'అందుకే కేసీఆర్.. బాబును అన్న అంటున్నారు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్ కేసులను పరస్పరం నీరుగార్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కే చంద్రశేఖర్ రావులు ఒప్పందం కుదుర్చుకున్నారని కాంగ్రెస్ నాయకుడు, నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కీ ఆరోపించారు. కేసీఆర్ అందుకే చంద్రబాబును అన్న అని పిలుస్తున్నారని చెప్పారు. ఇద్దరు చంద్రులు వెన్నెల పొందుతూ, ప్రజలకు చీకటి పంచుతున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు వెన్నుపొటు పొడిచి రాజకీయంగా ఎదిగిన ఇద్దరు చంద్రులు సొంత ప్రయోజనాల కోసం రాజకీయాల్లో నటిస్తున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్దిపొందడం కోసమే కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు వెళ్తున్నారని మధు యాష్కీ విమర్శించారు. వాటర్‌గ్రిడ్ పథకానికి 4 వేల కోట్లు రూపాయలు చాలని, 40 వేల కోట్లు అవసరం లేదని అన్నారు. ఎర్రవెల్లి గ్రామానికి ఉత్తమ సర్పంచ్.. తెలంగాణకు దరిద్రపు సీఎం కేసీఆర్ అని మధు యాష్కీ విమర్శించారు. కేసీఆర్ కొడుకు మంత్రి కేటీఆర్‌కు అక్రమ విల్లాలు ఉన్నాయని, ప్రత్యేక విమానాల్లో విహారయాత్రలు చేస్తున్నారని, ఆయన అవినీతికి ఇవే నిదర్శనమని ఆరోపించారు. -
పరిహారం పేరుతో కలెక్షన్లు
కవితపై మధుయాష్కీ ఆరోపణ సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు నష్ట పరిహారం పేరుతో ఎంపీ కవిత ఉద్యమ సమయంలో చేసిన కలెక్షన్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. పార్టీ నేతలు డి.శ్రవణ్, బి.బిక్షమయ్య గౌడ్‌తో కలిసి గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యతను నెరవేర్చడం చేతకాని ముఖ్యమంత్రిగా తన తండ్రి కేసీఆర్ ఉన్నాడన్న విషయాన్ని కవిత అంగీకరిస్తున్నారా? ఒక రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాని పని కవిత నేతృత్వంలో పనిచేస్తున్న జాగృతి అనే స్వచ్ఛంద సంస్థకు ఎలా సాధ్యం అవుతుంది? ఆ సంస్థకు నిధులెలా వస్తున్నాయి’’ అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని పాలించడం చేతకాని కేసీఆర్ కేవలం ఎర్రవల్లి, నర్సన్నపేటకు సర్పంచ్‌గా తిరుగుతున్నారన్నారు. రైతులను ఆదుకోవడం చేతకాని ప్రభుత్వం కవిత ప్రచారం కోసం రూ.10 కోట్లు ఖర్చుచేయడం దారుణమన్నారు. భూ దళారిగా ప్రభుత్వం: దాసోజు సర్కారు భూములను అమ్ముతూ ప్రభుత్వమే భూముల దళారిగా మారిందని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. నాడు భూముల అమ్మకాలను అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలే ఇప్పుడు అధికారంలోకి వచ్చి అదే పని చేయడం దుర్మార్గమన్నారు. పద్మాలయా, అన్నపూర్ణ స్టూడియోలలో అక్రమ భూములు ఉన్నాయని కేసులు పెట్టిన టీఆర్ఎస్ నేతలు... మహేష్‌బాబు, నాగార్జునతో రాజీ చేసుకున్నారన్నారు. కవితవి స్థాయికి మించిన మాటలు: సంపత్, ఆకుల లలిత సాక్షి, హైదరాబాద్: ఎంపీ కవిత కాంగ్రెస్ నేతలపై తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ ఆకుల లలిత సోమవారం విమర్శించారు. ఆమె సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు. అధికార అహంకారంతో మాట్లాడటం మానుకోవాలంటూ హెచ్చరించారు. బతుకమ్మ పేరుతో కవిత రాజకీయ లబ్ధి పొందారని విమర్శించారు. రైతుల రుణమాపీపై ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను విరమింపజేసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని కాంగ్రెస్ నేత, నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కీ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని మధు యాష్కీ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ ఎంపీలు లోక్‌సభను స్తంభింపజేసినపుడు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతిచ్చారని మధు యాష్కీ చెప్పారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదని, 10 ఏళ్లు కావాలని కోరిన బీజేపీ పెద్దలు.. ఇప్పుడు ఆ అంశాన్ని విస్మరించడం సరికాదని అన్నారు. -
కేసీఆర్.. మీ చైనా పర్యటన ఖర్చు ఎంత!
- తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు అధికారంగా జరపడం లేదు: మధుయాష్కి ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్లి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలియాలని నిజామాబాద్ మాజీ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కి డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారకంగా ఎందుకు జరపడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా సీఎంలను విమర్శించిన కేసీఆర్ తెలంగాణలో ఎందుకు జరపడం లేదని మధుయాష్కి మండిపడ్డారు. -
'అవన్నీ టీఆర్ఎస్ హత్యలే'
హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వ హత్యలేనని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మధుయాష్కీ అన్నారు. హత్యానేర చట్టం కింద ప్రభుత్వ పెద్దలపై కేసులు పెట్టాలని మండిపడ్డారు. నిజామాబాద్ రైతు లింబయ్య ఆత్మహత్యను వక్రీకరించడం దారుణమన్నారు. ఎంపీ కవిత ఇసుక మాఫీయాను ప్రోత్సహిస్తున్నారని, వందల కోట్ల అవినీతి జరుగుతుందని ధ్వజమెత్తారు. జాగృతి సంస్థ ద్వారా రైతులను ఆదుకుంటామన్న కవితకు నిధులు ఎక్కడనుంచి వచ్చాయో చెప్పాలని కాంగ్రెస్ నేత అనిల్ డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యలపై కవిత రౌండ్ టేబుల్ సమావేశాలు పెడితే ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. రైతులను ఆదుకునేలా కేసీఆర్‌ను కవిత ఒప్పించాలి, లేదా రాజీనామా చేయాలని అనిల్ అన్నారు. -
'మానసిక వికలాంగుడిలా మధుయాష్కీ వ్యవహారం'
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిప్పులు చెరిగారు. శనివారం గంగుల కమలాకర్ మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే స్థాయి మధుయాష్కీకి లేదని అన్నారు. కేసీఆర్‌ను తుగ్లక్ అనే దమ్ము, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చాయని మధును కమలాకర్ ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అనే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆ పథకాలపై కూడా మధుయాష్కీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలల్లో ఓడిపోయి మధుయాష్కీ మానసికంగా కుంగిపోయినట్లు ఉన్నారని... అందుకే ఆయన మానసిక వికలాంగుడిలా వ్యవహరిస్తున్నారని కమలాకర్ ఎద్దేవా చేశారు. -
కాంగ్రెస్‌లో ముసలం!
ఘోర పరాజయంపై పార్టీ నేతల పరస్పర ఆరోపణలు పొన్నాల, దిగ్విజయ్, జానారెడ్డి లక్ష్యంగా విమర్శలు దిగ్విజయ్‌సింగ్, పొన్నాలా.. పార్టీ వదిలి వెళ్లిపోండి: పాల్వాయి పొన్నాలే బాధ్యుడు: మధుయాష్కీ పొన్నాల ను తప్పించాల్సిందే: శంకర్రావు హైదరాబాద్: టీ కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. తెలంగాణలో ఘోర పరాజయం పాలై 24 గంటలు కూడా గడవక ముందే ఆ పార్టీ నేతలు రోడ్డున పడ్డా రు. ఓటమికి మీరంటే మీరే కారణమంటూ దూషణల పర్వానికి దిగుతున్నారు. తమ ఓటమికి స్థానిక నేతలే కారణమంటూ అసెంబ్లీ అభ్యర్థులు వాపోతోంటే... టీపీసీసీ నాయకత్వమే ప్రధాన కారణమంటూ ఎంపీ అభ్యర్థులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు సీనియర్ నేతలైతే ఏకంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, కేంద్ర మంత్రి జైరాం రమేశ్, ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యల వల్లే పార్టీ ఇంత ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందంటూ మండిపడుతున్నారు. పలువురు నేతలు దీనిపై నేరుగా సోనియాగాంధీకి ఫిర్యాదు చేసే పనిలో పడ్డారు. పొన్నాలే లక్ష్యం.. ముఖ్యంగా పొన్నాల లక్ష్మయ్యకు విమర్శల తాకిడి ఎక్కువగా ఉంది. తక్షణమే ఆయనను టీ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలనే డిమాండ్లు పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. సీమాంధ్రలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతింటుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా... ఇక్కడ కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైందంటే దానికి టీపీసీసీ నాయకత్వ వైఫల్యమే కారణమని పార్టీ సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సోనియావల్లే తెలంగాణ వచ్చిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, అందుకు తగిన కార్యక్రమాలు రూపొందించి జనాన్ని పార్టీవైపు ఆకర్షించడంలో పొన్నాల దారుణంగా విఫలమయ్యారని వారు మండిపడుతున్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదించిననాటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఒక్క బహిరంగ సభ కూడా నిర్వహించలేకపోయారంటే తెలంగాణ పార్టీ నాయకత్వ వైఫల్యం ఏమేరకు ఉందో అర్థమవుతోందని చెబుతున్నారు. మరికొందరు నేతలైతే ఏకంగా మాజీ మంత్రి జానారెడ్డితోపాటు తెలంగాణ సీఎం రేసులో ఉన్న నాయకులూ పార్టీ పరాభవానికి కారణమని మండిపడుతున్నారు. పీసీసీ చీఫ్‌గా పనిచేసిన సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఓటమికి సోనియాను బాధ్యురాలిని చేయడం ఏమాత్రం సరికాదు. పార్టీ రాష్ట్ర ఇన్చార్జి చెప్పే మాటలు, ఇచ్చే నివేదికలపైనే ఆమె ఆధారపడతారు. దీనికంతటికీ దిగ్విజయ్‌సింగ్ కారణం. పొన్నాలను టీపీసీసీ సారథిగా నియమించాలనే ఆలోచన కూడా దిగ్విజయ్‌దే. సీమాంధ్రకు చెందిన ఒక రాజ్యసభ ఎంపీ చెప్పినట్లే దిగ్విజయ్ నడిచారు. తెలంగాణలో ఈ పరిస్థితిని తెచ్చారు..’’అని వాపోయారు. పొన్నాల ఓ బేవకూఫ్: పాల్వాయి కాంగ్రెస్ ఓటమికి దిగ్విజయ్‌సింగ్, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డిలే ప్రధాన కారణమని ఆ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌తో పొత్తు పెట్టుకోవాలని, తెలంగాణ బిల్లులో ఆయనను భాగస్వామిని చేయాలని చెప్పినా వారు వినలేదని, కేసీఆర్ వస్తే వాళ్లకు సీఎం పదవి దక్కదనే దురాశతో వ్యతిరేకించారన్నారు. అధికారాన్ని అనుభవించి డబ్బులు దండుకున్న మంత్రులు కూడా దీనికి ఒప్పుకోలేదని పేర్కొన్నారు. ‘‘అసలు పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించడమే బుద్ధి తక్కువ పని. పొన్నాల ముఖం చూస్తే ఎవరైనా ఓట్లేస్తరా? పార్టీని నడిపే శక్తి లేనోడు. సభలు నిర్వహించడం చేతకానోడు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ ఎవడైనా 30 వేల ఓట్లతో ఓడిపోతడా? అట్లాంటోడ్ని ఏమనాలి? అసలు పొన్నాలకు పార్టీ నాయకత్వం ఎట్లా అప్పగించిండ్రు? దీనికంతటికీ దిగ్విజయ్‌సింగే ప్రధాన కారణం. ఆయన కేవీపీ చెప్పినట్లే నడిచిండు. ఎమ్మెల్యే టికెట్లను కూడా అమ్ముకున్నరు. నా దగ్గర ఆధారాలున్నయి. సమయం వచ్చినప్పుడు బయటపెడతా. నెహ్రూతో కలిసి పనిచేసిన నాకు షోకాజ్ ఇస్తడా? ఇట్లాంటి బేవకూఫ్గాళ్లను గాంధీభవన్‌లో కూర్చోబెడితే పార్టీ ఓడిపోక ఏం జేస్తది? పొన్నాలను వెంటనే పార్టీ నుంచి తప్పించాలి. అట్లాగే దిగ్విజయ్‌సింగ్.. నువ్వు కూడా పార్టీని వదిలి పో.. నేను సోనియాగాంధీని కలిసి ఈ విషయాలన్నీ చెబుతా’’ అని పేర్కొన్నారు. పాల్వాయికి మతి చలించింది: టీపీసీసీ ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి.. లేకుంటే బహిష్కరణే రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పెద్ద బ్లాక్‌మెయిలర్ అని, ఆయనకు మతి చలించిందని టీపీసీసీ మండిపడింది. దిగ్విజయ్, పొన్నాల లక్ష్మయ్యలపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, దీనిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేనిపక్షంలో పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. శనివారం పాల్వాయి చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న పొన్నాల వెంటనే ప్రెస్‌మీట్ నిర్వహించాలని అధికార ప్రతినిధులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధులు కొనగాల మహేష్, జిట్టా సురేందర్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పాల్వాయి వ్యాఖ్యలను ఖండించారు. ఆయనకు మతి పూర్తిగా చలించిందని ఎద్దేవా చేశారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పాల్వాయిని అధిష్టానం రాజ్యసభకు పంపించిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నుంచి షోకాజ్ అందుకున్న పాల్వాయికి దిగ్విజయ్, పొన్నాల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని పేర్కొన్నారు. పొన్నాలను టీపీసీసీ చీఫ్‌గా నియమించడం హైకమాండ్ నిర్ణయమని, దాన్ని వ్యతిరేకించడమంటే హైకమాండ్‌ను ధిక్కరించినట్లేనని వ్యాఖ్యానించారు. నియామకమే ఓటమికి సంకేతం: మధుయాష్కీ ‘‘టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించడమే కాంగ్రెస్ ఓటమికి తొలి మెట్టు. ఎన్నికల్లో పార్టీ నేతలెవరినీ కలుపుకొనిపోలేదు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ తెలంగాణ నాయకత్వం పూర్తిగా విఫలమైంది. ఎన్నికల్లో ఓటమికి పొన్నాల బాధ్యత వహించాల్సిందే.’’ ఆయన వల్లే పార్టీ నాశనమైంది: పి.శంకర్రావు ‘‘తెలంగాణలో పార్టీ ఓటమికి పొన్నాల లక్ష్మయ్య నైతిక బాధ్యత వహించి తప్పుకోవాల్సిందే. ఆయనవల్లనే పార్టీ నాశనమైంది. ఎంతో కష్టపడి సోనియా తెలంగాణ ఇచ్చినా ప్రజలకు ఆ విషయాన్ని చెప్పలేకపోయిండు. సీనియర్లను ఏకతాటిపైకి నడిపించడంలో ఫెయిలైండు. పార్టీ అధికారంలోకి రాకపోయినా ఫరవాలేదన్నట్లు వ్యవహరించిండు. ఎన్నికల్లో సొంత నియోజకవర్గం దాట లేదు.’’ -
నిజామాబాద్ - ముగ్గురు టీ వాదుల ముక్కోణపు పోటీ
తెలంగాణ జిల్లాల్లో అత్యంత ఆసక్తికరమైన పోటీ ఏది అని అడిగితే ఎవరైనా చూపించేది నిజామాబాద్ వైపే. ఎందుకంటే అక్కడ నుంచి తెలంగాణ రాజకీయాల్లో నవతార కల్వకుంట్ల కవిత తొలిసారి బ్యాలెట్ పోటీలోకి దిగారు. ఇప్పటి వరకూ ఎన్నికల్లో పోటీ చేయని ఆమెపై రెండు సార్లు ఎంపీగా గెలిచిన మధు యాష్కి గౌడ్, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎండల లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. కవిత టీఆర్ ఎస్ నుంచి, మధు యాష్కి కాంగ్రెస్ నుంచి, ఎండల బిజెపి నుంచి పోటీ పడుతున్నారు. అటు మహారాష్ట్ర, ఇటు కర్నాటకలతో సరిహద్దు షేర్ చేసుకునే నిజామాబాద్ లో అంకాపూర్ లాంటి అత్యంత ధనిక ఊర్లు, అతి వెనుకబాటుతనంలో బాధపడే గాంధారి లాంటి ఊర్లు కలగలిసి ఉన్నాయి. ముస్లిం, మరాఠీ, లంబాడీ వర్గాలతో పాటు, కొన్ని ప్రాంతాల్లో మున్నూరు కాపులు పుష్కలంగా ఉన్నారు. ముగ్గురూ తెలంగాణవాదులేః తెలంగాణ వాదం అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో నిజామాబాద్ ఒకటి. ముగ్గురు అభ్యర్థులూ వీరతెలంగాణ వాదులే. కవిత తెలంగాణ జాగృతిని స్థాపించి బతుకమ్మ, తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించారు. కేసీఆర్ కుమార్తెగా ఆమెకు తెలంగాణ వాదం వారసత్వ ఆస్తిగా సంక్రమించింది. ఇక మధుయాష్కీ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర వహించిన కాంగ్రెస్ నేతల్లో ఒకరని ప్రచారం. బిజెపి అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ తెలంగాణ వాదం కోసం ఎమ్మెల్యే సీటును త్యాగం చేశారు. గత చరిత్ర ఏం చెబుతోందిః గత చరిత్రను చూస్తే కాంగ్రెస్ కి సానుకూలాలు చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకూ కాంగ్రెస్ నిజామాబాద్ నుంచి 11 సార్లు గెలిచింది. టీడీపీ మూడు సార్లు గెలిచింది. టీఆర్ ఎస్ 2009 లో తొలిసారి పోటీ చేసింది. ఓడిపోయింది. అయితే టీఆర్ ఎస్ తొలినాళ్లలోనే నిజామాబాద్ జిల్లాపరిషత్ ను గెలుచుకుంది. ఇక 2009 లో టీడీపీకి మూడు, బిజెపికి ఒక అసెంబ్లీ నియోజవర్గాలు వచ్చాయి. కాంగ్రెస్ ఒక సీటు, పీఆర్ పీ ఒక సీటు గెలుచుకున్నాయి. పీఆర్ పీ తరువాత కాంగ్రెస్ లో కలిసిపోయింది. ఈ లెక్కన బిజెపి అభ్యర్థికి అనుకూలంగా ఉండాలి. అయితే తెలంగాణ ఏర్పాటు తరువాత ఈ లెక్కలు పనికిరావు. కవిత కరిష్మా, మధుయాష్కీ పాత పరిచయాలకు, మోడీ మోత మోగిస్తున్న ఎండలకు మధ్యే ప్రధానంగా పోటీ. తెలంగాణ తెచ్చింది మేమేనని మధు యాష్కీ అంటే, తెస్తే చాలదు. అభివృద్ధి చేయాలి. అది టీఆర్ ఎస్ చేస్తుందని కవిత అంటున్నారు. వచ్చేది మోడీ ప్రభుత్వం కాబట్టి మాకే ఓటేయండి అని ఎండల అంటున్నారు. ప్రధాన సమస్యలుః నిజామాబాద్ గోదావరి ముఖద్వారం లాంటిది. మన రాష్ట్రంలోకి గోదారమ్మ ఇక్కడి నుంచే వస్తుంది. పోచంపాడు, అలీసాగర్, నిజాంసాగర్ వంటి ప్రాజెక్టులు కొంత ఏరియాని సస్యశ్యామలం చేసిన మాట ఎంత నిజమో, లెండి, గుత్ప, కౌలాస్ నాలా వంటి ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండటం వల్ల వస్తున్న సమస్యలూ అంతే వాస్తవం. నియోజకవర్గంలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాల్కండ, ఆర్మూర్, కొరాటియాలతో పాటు కరీంనగర్ లోని జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఏప్రిల్ 30 కి నిజామాబాద్ ఎవరి ఖాతాలోకి వెళ్తుందో తేలిపోతుంది. -
కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రకే సీఎం: మధుయాష్కీ
యాదగిరికొండ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రకే ముఖ్యమంత్రి అని, తెలంగాణకు కాదని ఎంపీ మధుయాష్కీ అన్నారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో ఆదివారం జరిగిన శాంతిర్యాలీలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర నాయకులు ఎంత మంది వెన్నుపోటు పొడిచినా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సీమాంధ్ర నేలత పదవులు సోనియా పెట్టిన భిక్ష అన్నారు. ముఖ్యమంత్రి, సీమాంధ్ర నేతలు ఆ పదవులకు అర్హులు కాదని అన్నారు. అగ్రకులాల వారంతా కలిసి తెలంగాణను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎంతమంది ఎన్ని అడ్డుంకులు కల్పించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే ఈ తరుణంలో ఎవరూ ఆవేశాలకు లోనూ కావద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమైక్యాధ్ర సభకు ప్రధాన పాత్రధారి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డేనని, సభకు అయిన ఖర్చంతా ఆయనే భరించారని అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం 40 రోజులు కాదు 4 సంవత్సరాలు నడిచినా కేంద్ర నాయకత్వం తెలంగాణా ఇచ్చి తీరుతుందని అన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని పడగొడతామన్నా, రాష్ట్రపతి పాలన వస్తుందని బెదిరించినా కేంద్రం వద్ద ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని చెప్పారు. -
రాష్ట్రపతి పాలన విధించైనా తెలంగాణ
కిరణ్ మొండికేస్తే సీఎంని మార్చి అయినా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు టీజేఎఫ్ మీట్ ది ప్రెస్‌లో ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ ‘ప్లాన్ బీ’ని సిద్ధం చేసిన కేంద్ర హోంశాఖ తెలంగాణ వారిపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు అక్రమాస్తులు కాపాడుకునేందుకే సమైక్యవాదం ఉద్యోగులకు, ఉద్యమకారులకు డబ్బులిచ్చి ఆందోళనలు చేయిస్తున్నారు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ధిక్కరిస్తే ఆయనను మార్చైనా సరే, అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించైనా సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం ఖాయమని లోక్‌సభలో డిప్యుటీ చీఫ్ విప్ మధుయాష్కీగౌడ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ఎంపీల ఫోరం మాజీ కన్వీనర్ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ‘ప్లాన్ బీ’ని సిద్ధం చేసిందని వారు వివరించారు. కిరణ్, చంద్రబాబు, వెంకయ్యనాయుడు, జగన్ తెలంగాణను అడ్డుకోవడానికి తెరవెనుక ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాదన్నారు. సీమాంధ్రలో జరుగుతున్నది సమైక్య ఉద్యమం కాదని, కొంతమంది అగ్రవర్ణాల వారి అధికార దాహంతో సాగుతున్నదని ఆరోపించారు. బుధవారం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువరించిన 70 గంటల వరకు సీమాంధ్రలో ఉద్యమమే లేదని, ఆ తర్వాత కూడా అంతంత మాత్రంగానే సాగినా చివరకు సీఎం కిరణ్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసి ఉద్యమకారులను రెచ్చగొట్టారని ఆరోపించారు. తన తండ్రి అమర్నాథ్ రెడ్డి విగ్రహాలను కూల్చకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయించిన ముఖ్యమంత్రి.. రాజీవ్‌గాంధీ, ఇందిరల విగ్రహాలను కూల్చేస్తున్నా మౌనం వహించారని మండిపడ్డారు. సమైక్య ఉద్యమంలో హింస రేగుతున్నా కేసులు కూడా నమోదు చేయలేని దుస్థితిలో సీమాంధ్రలో పోలీసు శాఖ ఉందని, హోం శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం కిరణ్, డీజీపీలు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల అధికారిని డీజీపీగా నియమించడంతోపాటు నాయకత్వ మార్పుపైనా పార్టీ అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణ బిల్లు ప్రస్తుత లోక్‌సభ సమావేశాల్లో కాకపోయినా వచ్చే సమావేశాల్లో తప్పనిసరిగా వస్తుందని తెలిపారు. సమైక్య ఉద్యమంలో హైదరాబాద్ గురించే తప్ప మరో అంశమే లేదంటే అది కేవలం కొందరు పెట్టుబడిదారులు చేయిస్తున్నదేననే విషయం స్పష్టమవుతోందని చెప్పారు. టీడీపీ, బీజేపీ తెరవెనుక చెట్టపట్టాలు వేసుకుని నడుస్తున్నాయని, త్వరలోనే అవి రెండూ కలిసికట్టుగా తిరిగే పరిస్థితి కూడా ఉందన్నారు. సీమాంధ్రలో తెలంగాణ వారిపై దాడులు సరికాదని, ఇలాంటి దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తమ సహనాన్ని అసమర్థతగా భావించరాదని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాల నేతలకు, ఉద్యమకారులకు డబ్బులు ఇచ్చి సమ్మెలు, ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై కేంద్రం ఆరా తీయిస్తోందన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం నచ్చని కాంగ్రెస్ నేతలు పార్టీ నుంచి బయటకు పోవచ్చని ప్రభాకర్ పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని సమీక్షించే అధికారం ఆంటోనీ కమిటీకి లే దని, సీమాంధ్రుల అపోహలు తీర్చడానికే ఆ కమిటీ ఏర్పాటైందని చెప్పారు. రేణుకా చౌదరి సీమాంధ్రనేతేనని, ఆమెను తమ సమావేశాలకు పిలవడంపై అభ్యంతరం చెప్పి మరీ ఆపించామని చెప్పారు. తెలంగాణపై ప్రకటనే వచ్చిందని, ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రమాదం అంచులు దాటినట్లు కాదన్నారు. తెలంగాణ వచ్చాక రెండు ప్రాంతాల్లోనూ బడుగు బలహీన వర్గాల వారిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నిస్తామని, తాము మాత్రం రేసులో లేమని వివరించారు. ఈ సమావేశంలో టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ, నేతలు క్రాంతికుమార్, పీవీ శ్రీనివాస్, పల్లె రవికుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
'తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే యత్నాలు'
హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతల యత్నిస్తున్నారని ఎంపీ మధుయాష్కి విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన సీమాంధ్ర నేతల వైఖరిపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా, ఆ ప్రక్రియ పూర్తి కాకుండా అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతలు చూస్తున్నారన్నారు. ఈ విషయంలో తెలంగాణ వాదులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రం విడిపోయినా తెలంగాణలో సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని యాష్కి తెలిపారు. రాజ్యాంగ ప్రజలకు ఇచ్చిన హక్కులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం ఏర్పడదన్నారు. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని ఆయన తెలిపారు.