కేసీఆర్.. మీ చైనా పర్యటన ఖర్చు ఎంత!
- తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు అధికారంగా జరపడం లేదు: మధుయాష్కి
ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్లి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలియాలని నిజామాబాద్ మాజీ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కి డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారకంగా ఎందుకు జరపడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా సీఎంలను విమర్శించిన కేసీఆర్ తెలంగాణలో ఎందుకు జరపడం లేదని మధుయాష్కి మండిపడ్డారు.