'సీఎంకు చరిత్రపై అవగాహన లేనట్టే'
హైదరాబాద్: సమైక్యరాష్ట్రంలో తెలంగాణ విమోచన దినం జరపాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు సీఎం అయ్యాక మాట మార్చడం దారుణమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు.
విమోచన దినం కాదంటే కేసీఆర్కు చరిత్రపై అవగాహన లేనట్టేనని విమర్శించారు. పక్కరాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా విమోచన దినం నిర్వహిస్తుంటే తెలంగాణలో ఎందుకు నిర్వహించడం లేదని దత్తాత్రేయ ప్రశ్నించారు.