సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ఇప్పుడే కొత్తగా సీఎం అయి నట్లుగా మాట్లాడుతున్నారని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. వచ్చేనెల 15 తర్వాత అసలు పాలన ఉంటుంది అంటే మరి ఐదేళ్ల 6 నెలల పాలన నకిలీ పరిపాలనా? అని ప్రశ్నించారు. మున్సిపల్ చట్టంలో రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా బిల్లులో చాలా అంశాలున్నాయన్నారు. ‘మున్సిపల్ శాఖలో అవినీతి పెరిగి పోయిందని సీఎం అన్నారు. ఒక్క మున్సిపల్ శాఖలో కాదు అన్నింటిలోనూ అవి నీతి ఉంది’ అని శనివారం విలేకరులతో మాట్లాడు తూ స్పష్టంచేశారు. ఈఎస్‌ఐలోనూ అవినీతి జరిగిం దని మండిపడ్డారు. వీటన్నింటిపైన సీఎం ఎందుకు నోరు విప్పడం లేదని, ఏసీబీకి పూర్తి అధికారాలు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించా రు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించే ధైర్యం సీఎంకి ఉందా అని సవాలు విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment