మంచిర్యాల సిటీ: కేసీఆర్ ఫ్రంట్‌తో బీజేపీకి ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ వ్యాఖ్యా నించారు. శనివారం మంచిర్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎన్ని ఫ్రంట్‌లు, టెంట్‌లు వచ్చినా బీజేపీని ఎదుర్కొనే శక్తి వాటికి లేదన్నారు.
ప్రధాని మోదీ పరిపాలన అద్భుతం, తనకు మంచి స్నేహితుడు అని ప్రకటిం చిన కేసీఆర్.. నేడు కించపరిచే విధంగా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రిజర్వేషన్‌లు రాజ్యాంగం పరిధిలోనివని, విపక్షాలు అనవసరంగా తమపై బురదజల్లడం మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు మూడువేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.
కేసీఆర్ ఫ్రంట్‌తో బీజేపీకి నష్టం లేదు
Published Sun, Mar 11 2018 3:51 AM | Last Updated on Mon, Aug 20 2018 8:47 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment