సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పక్కా ప్రచార వ్యూహంతో ముందుకెళితే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అన్నారు. ఎన్నికల ప్రచార నిర్వహణలో, బీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపడంలో టీపీసీసీ ప్రచార కమిటీ చురుకుగా వ్యవహరించాలని సూచించారు. శుక్రవారం గాందీభవన్‌లో టీపీసీసీ ప్రచార కమిటీ తొలి సమావేశం జరిగింది.
కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కన్వినర్ అజ్మతుల్లా హుస్సేనీలతో పాటు పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌చౌదరి, మన్సూర్ అలీఖాన్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్‌కుమార్ యాదవ్, అజారుద్దీన్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి తదితరులు పాల్గొన్నారు.
కర్ణాటక మాదిరే ఇక్కడా..
ఠాక్రే మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ ప్రజల మ ధ్య యాత్ర చేసిన కర్ణాటకలో పార్టీ విజయం సాధించిందని, తెలంగాణలో కూడా ఘన విజ యం సాధిస్తామని చెప్పారు. ఖమ్మంలో రాహుల్‌గాంధీ పాల్గొన్న బహిరంగ సభ రాష్ట్ర రాజకీ యాలను మార్చి వేసిందని అన్నారు. మధు యాష్కీ, పొంగులేటిల నేతృత్వంలో మంచి ప్ర చార వ్యూహంతో ముందుకెళితే తప్పక విజ యం సాధిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కటేనని, ఆ రెండు పార్టీలు లోపాయికారీగా పనిచేస్తున్నాయన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అసెంబ్లీ నియోజకవర్గా ల వారీగా సమస్యలను గుర్తించి ప్రత్యేక ప్రణాళికతో పోరాడాలని సూచించారు. రాహుల్‌గాంధీ చేసిన రైతు డిక్లరేషన్, ప్రియాంకాగాంధీ చేసిన యూత్ డిక్లరేషన్‌లను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ విషయంలో పార్టీ అనుబంధ సంఘాలు గట్టిగా పనిచేయాలని కోరారు.
మాఫీ అయింది మిత్తి మాత్రమే: మధుయాష్కీ
రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీల తోడుదొంగల సినిమాను ప్రజల మధ్య బయటపెడతామని మధుయాష్కీ చెప్పారు. కేసీఆర్, మోదీలు తెరవెనుక ఏం చేశారో, తెర ముందు ఏం చేశారో వివరిస్తామన్నారు. రుణమాఫీని ఐదేళ్లుగా చేయకుండా ఇప్పుడు చేయడంతో ఐదేళ్ల మిత్తి మాత్రమే మాఫీ అయిందని, దీనిపై పోస్టుకార్డు ఉద్యమం చేస్తామని చెప్పారు. ఈ నెల 6న గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో నిర్వహించే సమావేశంలో ప్రచార వ్యూహాలపై మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment