
'అవన్నీ టీఆర్ఎస్ హత్యలే'
హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వ హత్యలేనని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మధుయాష్కీ అన్నారు. హత్యానేర చట్టం కింద ప్రభుత్వ పెద్దలపై కేసులు పెట్టాలని మండిపడ్డారు. నిజామాబాద్ రైతు లింబయ్య ఆత్మహత్యను వక్రీకరించడం దారుణమన్నారు. ఎంపీ కవిత ఇసుక మాఫీయాను ప్రోత్సహిస్తున్నారని, వందల కోట్ల అవినీతి జరుగుతుందని ధ్వజమెత్తారు.
జాగృతి సంస్థ ద్వారా రైతులను ఆదుకుంటామన్న కవితకు నిధులు ఎక్కడనుంచి వచ్చాయో చెప్పాలని కాంగ్రెస్ నేత అనిల్ డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యలపై కవిత రౌండ్ టేబుల్ సమావేశాలు పెడితే ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. రైతులను ఆదుకునేలా కేసీఆర్ను కవిత ఒప్పించాలి, లేదా రాజీనామా చేయాలని అనిల్ అన్నారు.