పుర్రె గుర్తుపై స్పందించడం లేదేంటి? | mp kavitha fires on madhu yashki | Sakshi
Sakshi News home page

పుర్రె గుర్తుపై స్పందించడం లేదేంటి?

Published Fri, Apr 8 2016 5:13 AM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM

పుర్రె గుర్తుపై స్పందించడం లేదేంటి? - Sakshi

పుర్రె గుర్తుపై స్పందించడం లేదేంటి?

ఎంపీ కవితపై మధుయాష్కీ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: బీడీ కట్టలపై పుర్రె గుర్తు పరిమాణాన్ని తగ్గించడానికి పార్లమెంటులో ప్రయత్నాలేమీ చేయకుండా కార్మికులను మోసం చేయడానికి ఎంపీ కవిత ప్రయత్నిస్తున్నారని మాజీ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ ఆరోపించారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ బీడీ కట్టలపై పుర్రె గుర్తును తొలగించడానికి, సైజును తగ్గించడానికి కవిత చేసిన ప్రయత్నాలేమిటో ప్రజలకు చెప్పాలన్నారు. పార్లమెంటులో దీనిపై ఏమీ మాట్లాడకుండా, రాష్ట్రంలో మాత్రం అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రధాని మోదీని కలిసి దీనిపై మాట్లాడాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement