ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ (ఫైల్ ఫొటో)
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాం గ్రెస్ పాత్ర లేదని అంటే టీఆర్‌ఎస్ నేతలు పురుగులు పడి చస్తారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీ వ్యాఖ్యానించారు. వినోద్ అనే పేరు పెట్టుకుని విజ్ఞత లేకుండా, సొల్లు కబుర్లు చెపుతున్న ఎంపీ వినోద్‌కుమార్‌కు దమ్ముంటే తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ఎంపీల పాత్ర గురించి చర్చించేందుకు ముందుకు రావాలని సవాల్ చేశారు. స్థలం, సమయం చెబితే చర్చ కు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ఆకాం క్ష, అమరవీరు ల త్యాగాలను గుర్తించి ప్రత్యేక రాష్ట్రం ఇస్తానని సోనియా 2009లో భువనగిరి సభలో చెప్పిన మేరకే తెలంగాణను ఇచ్చారన్నారు. టీఆర్‌ఎస్‌ను ప్రజలు రాజకీయంగా బొందపెట్టబోతున్నారన్నారు.
పాతరోజులు మరిచిపోయారు
తెలంగాణ పేరుతో ఆజాద్, జైరాం రమేశ్‌ల ఇళ్ల చుట్టూ టీఆర్‌ఎస్ నేతలు తిరిగిన పాతరోజుల్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని మధుయాష్కీ అన్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కేటీఆర్, కవిత తన ఇంటికి వచ్చి బతిమిలాడారని గుర్తుచేశారు. ఎంపీ వినోద్, తన తమ్ముడు, సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌ల ఆస్తులు 2001లో ఎంతో, ఇప్పుడు ఎంతో తెలిస్తేనే వీళ్లు రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో అర్థమవుతుందన్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నాననే హరీశ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ అది మామాఅల్లుళ్ల డ్రామా అని యాష్కీ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవినీతిని బయటపెట్టి జైల్లో పెడుతుందనే భయంతోనే కూడగట్టుకుంది తీసుకుని వెళ్లిపోదామని హరీశ్ అలా మాట్లాడి ఉంటారని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment