
తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. ‘దళపతి 69’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకుడు. కేవీఎన్ ప్రోడక్షన్స్‌పై ఎన్‌కే, వెంకట్ కె. నారాయణ ఆధ్వర్యంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ‘‘విజయ్‌తో మా మొదటి చిత్రం ‘దళపతి 69’. ఈ సినిమా కోసం హెచ్. వినోద్ అద్భుతమైన కథని సిద్ధం చేశారు.
మూడు దశాబ్దాల సినిమా ప్రయాణంలో తిరుగులేని స్టార్‌డమ్‌తో కథానాయకుడిగా రాణించారు విజయ్. ఆయన హీరోగా రూపొందుతోన్న చివరి చిత్రం ‘దళపతి 69’ కానుండటంతో భారతీయ సినీ చరిత్రలో నిలిచేపోయేలా తెరకెక్కిస్తాం. సరికొత్త రికార్డులను సృష్టించేలా ఈ సినిమాని రూపొందించనున్నాం. ఈ చితాన్ని 2025 అక్టోబర్‌లో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్.
Comments
Please login to add a commentAdd a comment