కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి రాలేదనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కి అన్నారు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి రాలేదనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కి అన్నారు. త్వరలో జరుగునున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరుపై టీఆర్‌ఎస్ పార్టీ ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ఎన్నికల వ్యయం లెక్కలు తప్పుగా చూపిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవితపై ఈసీ అనర్హత వేటు వేయాలని ఆయన కోరారు.