సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రపై బహిరంగ చర్చకు సిద్ధామా అని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కి ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కి సవాల్ విసిరారు. టైమ్ ,ప్లైస్ చెప్పు ఎక్కడికైనా వచ్చేందుకు రెడీ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆజాద్ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ సోయిలేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంటుందన్న సోయి కూడా వినోద్‌కు లేదని ఎద్దేవా చేశారు. ప్రజల త్యాగాలను గుర్తించే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు.
రెండు ఎంపీ స్థానాలతో తెలంగాణ తెచ్చామంటే.. ఇప్పుడు ఇంత మంది ఎంపీలు ఉండి మైనార్టీ రిజర్వేషన్‌లు ఎందుకు సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలేదంటే టీఆర్‌ఎస్ నేతలు పురుగులు పడి చస్తారన్నారు. వినోద్, అతని తమ్ముడు, కేసీఆర్ కుటుంబ ఆస్తుల వివరాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చెప్పిన అబద్దాలకు మోసపోయి ప్రజలు టీఆర్‌ఎస్‌కు అధికారం ఇచ్చారన్నారు. 2019లో సైలెంట్ విప్లవం రాబోతుందని, టీఆర్‌ఎస్‌ను బొందపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని మధుయాష్కి ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment