సాక్షి, నిజామాబాద్: పసుపు రైతుల కోసం పార్లమెంట్‌లో నిలదీస్తా.. పసుపు బోర్డు, మద్దతు ధరల కోసం ఎంతవరకైనా పోరాడుతా అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. అర్వింద్‌ను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తాం అని.. రామ్ మాధవ్ ఆర్మూర్‌లో హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు. అర్వింద్ పసుపు బోర్డు సాధిస్తారా లేదా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. కేంద్రం మెడలు వంచుతాం అని చెప్పే సీఎం కేసీఆర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత ఏం చేశారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
(చదవండి: ‘కేటీఆర్ సీఎం అయితే హరీశ్‌కే సమస్య’)
మా ఇద్దరికి మీ బాగోతం బాగా తెలుసు: మధుయాష్కి
అప్పుడు కవిత చెరకు రైతులను, ఇప్పుడు అర్వింద్ పసుపు రైతులను మోసం చేశారని మధుయాష్కి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు భిక్ష పెట్టింది సోనియాగాంధీ. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. రైతులను అటు మోదీ, ఇటు చోటా మోదీ మోసం చేస్తున్నారు. రైతు వ్యతిరేక చట్టాలకు, విధానాలకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేస్తాంతమ్ముడు తారక రామారావు.. త్వరలోనే నీ బండారం బయట పెడతాం. నాకు, రేవంత్‌కు మీ అందరి బాగోతం బాగా తెలుసు’’ అని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment