తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతల యత్నిస్తున్నారని ఎంపీ మధుయాష్కి విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతల యత్నిస్తున్నారని ఎంపీ మధుయాష్కి విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన సీమాంధ్ర నేతల వైఖరిపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా, ఆ ప్రక్రియ పూర్తి కాకుండా అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతలు చూస్తున్నారన్నారు. ఈ విషయంలో తెలంగాణ వాదులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రం విడిపోయినా తెలంగాణలో సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని యాష్కి తెలిపారు. రాజ్యాంగ ప్రజలకు ఇచ్చిన హక్కులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం ఏర్పడదన్నారు. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని ఆయన తెలిపారు.