ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అవినీతిలో ఏనుగులా బలిసిందని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఎద్దేవా చేశారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు కాపలా కుక్కల్లా అవినీతి ఏనుగు వెనకాల వెంటపడతాయన్నారు. అనినీతి, రైతుల ఆత్మహత్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం నెం 1 గా ఉందన్నారు. గ్రేటర్‌లో జరిగిన అవినీతిపై కేసీఆర్, కేటీఆర్‌లు ఎందుకు స్పందించలేదన్నారు. రూ.337 కోట్ల రోడ్ల నిర్మాణంలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. జీహెచ్‌ఎంసీ కుంభకోణంపై లోకాయుక్తలో కేసు వేయబోతున్నామన్నారు.
Published Fri, Nov 4 2016 7:22 AM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement