హైదరాబాద్: మైనార్టీ బాలికలకు ఉత్తమ విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ మండలం చింతల్మెట్లో మైనార్టీ బాలికల వసతి గృహాన్ని మంత్రి బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, కార్పొరేటర్ విజయ ఉన్నారు.