
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర మంత్రులు ముందుకు వచ్చారు. తమ వంతు సహాయంగా నెల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కె.తారక రామారావు, టి.హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి ప్రకటించారు. నెల జీతాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా పంపనున్నట్లు మంత్రులు తెలిపారు.
పెన్షనర్లు సైతం...
కేరళ బాధితులకు తమ వంతు సహాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పెన్షన్‌దారుల సంయుక్త కార్యచరణ సమితి ముందుకు వచ్చింది. రాష్ట్రంలోని 2.56 లక్షల మంది పెన్షర్‌లు ప్రతి ఒక్కరు రూ.100 చోప్పున కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పెన్షన్‌దారుల సంయుక్త కార్యచరణ సమితి అధ్యక్షుడు రమణాచారి ఒక ప్రకటనలో తెలిపారు.