
పి. మహేందర్‌రెడ్డి
అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన అంబేడ్కర్ స్ఫూర్తితో బడుగులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి చెప్పారు.
హైదరాబాద్ సిటీ: అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన అంబేడ్కర్ స్ఫూర్తితో బడుగులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి చెప్పారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆర్టీసీ ఉద్యోగులు కళాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాతకు పుష్పాంజలి ఘటించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ ఉద్యమ ఫలితంగానే నేడు రిజర్వేషన్లు అమలవుతున్నాయని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచే ప్రభుత్వానికి అధినేతగా సీఎం కేసీఆర్ బడుగుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కోసం బడ్జెట్‌లో రూ.8 వేల కోట్లు, దళితులు, గిరిజనులకు మూడెకరాల భూమి పంపిణీకి రూ. 1,000 కోట్లు, కల్యాణలక్ష్మి పథకం కోసం రూ. 157 కోట్లు కేటాయించినట్లు మహేందర్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో హొం మంత్రి నాయిని నరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు.