గణేష్‌ చందాలంటూ దౌర్జన్యం చేస్తే.. | will take seviour actions for illegal ganesh chandas | Sakshi
Sakshi News home page

గణేష్‌ చందాలంటూ దౌర్జన్యం చేస్తే..

Published Fri, Aug 26 2016 9:48 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

will take seviour actions for illegal ganesh chandas

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఎవరైనా గణేష్‌ ఉత్సవాల నిర్వహణకు చందాల పేరుతో దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.

మరోపక్క గణేష్‌ ఉత్సవాల నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడాన్ని కమిషనర్‌ నిషేధించారు.అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని, వచ్చే నెల 5వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉండే ఈ నిషేధాజ్ఞలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement