వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: డీజీపీ | Mahender reddy about rains | Sakshi
Sakshi News home page

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: డీజీపీ

Published Tue, Aug 21 2018 1:48 AM | Last Updated on Tue, Aug 21 2018 1:48 AM

Mahender reddy about rains - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

రెవెన్యూ, ఎన్డీఆర్‌ఎఫ్, ఇరిగేషన్, అగ్నిమాపక శాఖ, ఇతర విభాగాలతో సంయుక్తంగా పనిచేయాలని అన్నారు. అవసరమైనచోట గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందివ్వాలని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ముందుగానే అక్కడి నుంచి ప్రజలను తరలించే ప్రయత్నం చేయాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement