పోయిన వాహనాలను గుర్తించే యాప్
చోరీకి గురైన వాహనాలను గుర్తించేందుకు ఓ యాప్ రూపొందించారు. స్టోలెన్ వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్ అనే ఈ యాప్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు అందుబాటులో ఉంటుందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. ఈ యాప్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
నేరస్తులను అదుపులోకి తీసుకునేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని మహేందర్ రెడ్డి చెప్పారు. ఇంజన్ నెంబరు, ఛాసిస్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు.. ఇలా వీటిలో ఏ ఒక్క వివరం ఆధారంగా సెర్చ్ చేసినా కూడా ఈ యాప్ ద్వారా వాహన యజమాని వివరాలు తెలుస్తాయని ఆయన తెలిపారు.