కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్‌లో మమతాబెనర్జీ ప్రభుత్వం, గవర్నర్ ఆనంద బోస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కోల్‌కతా నగర పోలీసు కమిషనర్ వినీత్‌కుమార్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని గవర్నర్ బోస్ సీఎం మమతకు లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గవర్నర్ డిమాండ్‌ను మమత ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం.
రాజ్‌భవన్‌ను ఆనుకోని పోలీసులు ఓ కంటట్రోల్‌ను నిర్మించి తన కదలికలపై నిఘా ఉంచినట్లు గవర్నర్ భావిస్తున్నరని తెలుస్తోంది. దీంతో ఆయన కోల్‌కతా నగర పోలీసు కమిషనర్‌ను తప్పించాలని కోరుతున్నట్లు చెబుతున్నారు.
అయితే కంట్రోల్ రూమ్ కొత్తగా నిర్మించి కాదని, రాజ్‌భవన్ భద్రత కోసం గత ప్రభుత్వాల హయాం నుంచే అక్కడ ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, రాజ్‌భవన్‌లో మహిళలకు రక్షణ లేదని సీఎం మమత చేసిన ఆరోపణలపై గవర్నర్ ఇప్పటికే కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment