కలకత్తా: పశ్చిమబెంగాల్ మేదినీపూర్‌లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) పోలీసులపై శుక్రవారం(ఏప్రిల్ 5) అర్ధరాత్రి స్థానికులు ఇటుకలు, రాళ్లతో దాడి చేసిన ఘటనపై సీఎం మమతాబెనర్జీ స్పందించారు. ‘అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పాపెట్టకుండా వస్తే ఏం చేయాలో మేదినిపూర్ భూపతినగర్ వాసులు కూడా అదే చేశారు. అసలు అర్ధరాత్రి అక్కడికి వెళ్లేందుకు ఎన్‌ఐకు అనుమతి ఉందా. ఎన్‌ఐఏకు ఏం అధికారం ఉందని ఇలాంటివి చేస్తున్నారు.
బీజేపీకి మేలు చేసేందుకే ఇదంతా చేస్తున్నారు. బీజేపీ నీచ రాజకీయాలపై అందరూ కలిసి పోరాడాలి’ అని మమత పిలుపునిచ్చారు. కాగా,2022 బాంబు పేలుడు కేసు దర్యాప్తు నిమిత్తం భూపతినగర్ వెళ్లిన ఎన్‌ఐఏ పోలీసులపై స్థానికులు మూకుమ్మడిగా దాడికి దిగారు. బాంబు పేలుడు కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కలకత్తా వెళుతుండగా ఈ దాడి జరిగిందని ఎన్‌ఐఏ అధికారి ఒకరు తెలిపారు.
స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చిన తర్వాతే తాము అక్కడికి వెళ్లామని చెప్పారు. ఎన్‌ఐఏ పోలీసులపై దాడి అత్యంత దారుణ ఘటన అని బెంగాల్ బీజేపీ ఖండించింది. ఇది తృణమూల్ కాంగ్రెస్ గూండాల పనేనని బీజేపీ నేతలు ఆరోపించారు. బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తును తృణమూల్ అడ్డుకోవాలని చూస్తోందన్నారు.
ఇదీ చదవండి.. తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీకి కాపీ
Comments
Please login to add a commentAdd a comment