కోల్‌కతా: సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీని పశ్చిమబెంగాల్‌లో మమత సర్కారు నిలబెట్టుకుంది. డాక్టర్ల డిమాండ్ మేరకు ఇప్పటిదాకా కోల్‌కతా నగర పోలీస్‌కమిషనర్‌గా ఉన్న వినీత్‌కుమార్ గోయెల్‌ను ప్రభుత్వం బదిలీ చేస్తూ మంగళవారం(సెప్టెంబర్17) ఉత్తర్వులు జారీ చేసింది.
గోయెల్ స్థానంలో మనోజ్‌కుమార్ వర్మను కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా నియమించారు.కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో నగర పోలీస్ కమిషనర్ గోయెల్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ను జూనియర్ డాక్టర్లు సీఎం మమత ముందుంచారు. దీంతో ప్రభుత్వం కమిషనర్‌ను బదిలీచేసింది.
పోలీస్‌కమిషనర్‌తో పాటు ఆరోగ్య శాఖలోని పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేయాలని డాక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. వీరి కోరిక మేరకు హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు.
ఇదీ చదవండి.. కోల్‌కతా బాధితురాలి ఫొటో..పేరు తొలగించండి: సుప్రీంకోర్టు
Comments
Please login to add a commentAdd a comment