Doctor Murder
-
‘ఆర్జీకర్’ ఘటన ఎఫెక్ట్: కోల్‌కతా ‘సీపీ’ బదిలీ
కోల్‌కతా: సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీని పశ్చిమబెంగాల్లో మమత సర్కారు నిలబెట్టుకుంది. డాక్టర్ల డిమాండ్ మేరకు ఇప్పటిదాకా కోల్‌కతా నగర పోలీస్‌కమిషనర్‌గా ఉన్న వినీత్‌కుమార్ గోయెల్‌ను ప్రభుత్వం బదిలీ చేస్తూ మంగళవారం(సెప్టెంబర్17) ఉత్తర్వులు జారీ చేసింది.గోయెల్ స్థానంలో మనోజ్‌కుమార్ వర్మను కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా నియమించారు.కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో నగర పోలీస్ కమిషనర్ గోయెల్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ను జూనియర్ డాక్టర్లు సీఎం మమత ముందుంచారు. దీంతో ప్రభుత్వం కమిషనర్‌ను బదిలీచేసింది. పోలీస్కమిషనర్తో పాటు ఆరోగ్య శాఖలోని పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేయాలని డాక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. వీరి కోరిక మేరకు హెల్త్ డిపార్ట్మెంట్లో ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఇదీ చదవండి.. కోల్‌కతా బాధితురాలి ఫొటో..పేరు తొలగించండి: సుప్రీంకోర్టు -
ఆస్పత్రిలో అవినీతి జలగ
కోల్‌కతా: కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యోదంతం వేళ ఆ ఆస్పత్రి తాజా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. గతంలో ఆయన పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని అదే ఆస్పత్రి మాజీ డెప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ ఒక జాతీయ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘సందీప్ సెక్యూరిటీ సిబ్బందిలో నిందితుడు సంజయ్ రాయ్ కూడా ఉన్నాడు. ఆస్పత్రి, వైద్యకళాశాలలోని అనాథ మృతదేహాలను సందీప్ అమ్ముకునేవాడు. దీనిపై కేసు నమోదైంది. తనకు సెక్యూరిటీగా ఉండే బంగ్లాదేశీలతో కలిసి సిరంజీలు, గ్లౌజులు, బయో వ్యర్థ్యాలను రీసైకిల్ చేసి బంగ్లాదేశ్‌కు తరలించి సొమ్మ చేసుకునేవారు. నేను గతేడాది వరకు ఆస్పత్రిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఉండగా సందీప్ అక్రమాలపై విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదుచేశా. దీనిపై ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిటీలో నేనూ ఉన్నా. సందీప్‌ను దోషిగా తేల్చినా చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర ఆరోగ్య శాఖకు నివేదిక పంపిన రోజు నన్ను, కమిటీలోని ఇద్దరు సభ్యులను బదిలీచేశారు. ఈయన నుంచి విద్యార్థులను కాపాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యా’’ అని అఖ్తర్ అన్నారు.ప్రతి టెండర్లో 20 శాతం కమిషన్‘‘ ఆస్పత్రి, వైద్యకళాశాల పరిధిలో చేపట్టే ప్రతి టెండర్ ప్రక్రియలో సందీప్ 20 శాతం కమిషన్ తీసుకునేవాడు. తనకు అనుకూలమైన సుమన్ హజ్రా, బిప్లబ్ సింఘాలకు ఈ టెండర్లు దక్కేలా చూసేవాడు. సుమన్, సింఘాలకు 12 కంపెనీలు ఉన్నాయి. ఏ టెండర్ అయినా వారికి రావాల్సిందే. డబ్బులు ఇచ్చిన వైద్య విద్యార్థులనే పాస్ చేసేవాడు. లేకుంటే ఫెయిలే. తర్వాత డబ్బులు తీసుకుని మళ్లీ పాస్ చేయించేవాడు. ‘శక్తివంతమైన’ వ్యక్తులతో సందీప్‌కు సత్సంబంధాలున్నాయి. అందుకే రెండు సార్లు బదిలీచేసినా మళ్లీ ఇక్కడే తిష్టవేశాడు’’ అని అఖ్తర్ చెప్పారు.కొత్త ప్రిన్సిపల్ తొలగింపుకోల్కతా: వైద్య విద్యార్థుల డిమాండ్ మేరకు ఆర్జి కర్ మెడికల్ కాలేజీ కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్‌ను బెంగాల్ ప్రభుత్వం తొలగించింది. వైస్–ప్రిన్సిపల్ బుల్బుల్, మరో ఇద్దరిని కూడా తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ‘‘మా కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్ పత్తా లేరు. మాకు సంరక్షకురాలి వ్యవహరించాల్సిన ఆమె ఆర్జి కర్ ఆసుపత్రిలో విధ్వంసం జరిగిన రాత్రి నుంచి ఆసుపత్రి ప్రాంగణంలో కనిపించలేదు. ఆమె స్వాస్థ్య భవన్ నుంచి పనిచేస్తున్నారని విన్నాం. అందుకే ఇక్కడకు వచ్చాం’ అని ఒక జూనియర్ డాక్టర్ బుధవారం ఉదయం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్పత్రిపై దుండగులు దాడి చేస్తుంటే అడ్డుకోకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు, ఒక ఇన్స్పెక్టర్ను కూడా కోల్‌కతా పోలీసు శాఖ బుధవారం సస్పెండ్ చేసింది. మంగళవారం నాటి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ ఆస్పత్రి, వైద్యకళాశాల వద్ద దాదాపు 150 మంది పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందితో కట్టుదిట్టమైన రక్షణ కల్పించారు. మరోవైపు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద డాక్టర్ల ఆందోళనలు పదోరోజు కూడా కొనసాగాయి. విధుల్లో చేరాలని రెసిడెంట్ డాక్టర్స్‌కు ఎయిమ్స్ విజ్ఞప్తి చేసింది. -
డాక్టర్ హత్య కేసులో ఏడుగురికి ఉరిశిక్ష
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ నరాల వైద్యనిపుణుడు సుబ్బయ్యను చెన్నైలో హతమార్చిన కేసులో ఏడుగురికి ఉరిశిక్ష, ఇద్దరికి యావజ్జీవ విధిస్తూ చెన్నై సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. శిక్ష పడినవారిలో ప్రొఫెసర్ దంపతులు, వారి కుమారులు ఉండడం గమనార్హం. వివరాలు..తమిళనాడు, కన్యాకుమారి జిల్లా సామితోప్పునకు చెందిన ప్రభుత్వ డాక్టర్ సుబ్బయ్య 2013 సెప్టెంబర్ 9న చెన్నై రాజాఅన్నామలైçపురంలోని తన క్లినిక్ బయట దాడికి గురై 23న ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. హతుడు సుబ్బయ్య మేనమామ పెరుమాళ్ తన సోదరికి (సుబ్బయ్య తల్లికి) కన్యాకుమారీ జిల్లా అంజుగ్రామంలోని స్థలాన్ని ఇచ్చారు. దీన్ని సమీప బంధువులు ఆక్రమించుకున్నారు. కొన్ని కోట్లు విలువచేసే ఈ స్థలాన్ని దక్కించుకోవాలని ఇరువర్గాలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాయి. స్థల వివాదం మూడు తరాలుగా నడుస్తూ తీవ్రస్థాయికి చేరుకుంది. 2013లో ఉద్యోగవిరమణ పొందిన డాక్టర్ సుబ్బయ్య న్యాయస్థానం ద్వారా బంధువులపై పోరాడి ఆ స్థలాన్ని దక్కించుకున్నాడు. ఇందుకు కక్షకట్టిన బంధువులు కిరాయి గూండాల సహకారంతో చెన్నైలోని క్లినిక్ వద్ద డాక్టర్ సుబ్బయ్యను దారుణంగా హత్యచేశారు. ఈ కేసులో మేనమామ రెండో భార్య కుమారుడైన ప్రొఫెసర్ పొన్నుస్వామి, అతని భార్య ప్రొఫెసర్ మేరీ పుష్పం, వీరి కుమారులైన న్యాయవాది ఫాసిల్, ఇంజినీర్ బోరిస్‌తోపాటూ న్యాయవాది విల్సన్, ప్రభుత్వ డాక్టర్ జేమ్స్ సతీష్‌కుమార్, కబడ్డీ క్రీడాకారుడు ఏసురాజన్, మురుగన్, సెల్వప్రకాష్, అయ్యప్పన్.. ఈ పదిమందిని నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణ సమయంలో అయ్యప్పన్ అప్రూవర్‌గా మారిపోయాడు. మొత్తం పది మంది నిందితుల్లో 9 మంది దోషులని నిర్ధారణైనట్లు చెన్నై సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. పొన్నుస్వామి, న్యాయవాది ఫాజిల్, విలియం, డాక్టర్ జేమ్స్ సతీష్‌కుమార్, ఇంజనీర్ బేరిస్, మురుగన్, సెల్వప్రకాష్‌లకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మేరి పుష్పం, కిరాయి గూండాల్లోని కబడ్డీ క్రీడాకారుడు ఏసురాజన్‌కు యావజ్జీవ శిక్ష పడింది. ఈ హత్య కేసుకు సంబంధించి ఒకే కుటుంబానికి చెందిన పొన్నుస్వామి, అతని కుమారులు ఫాజిల్, బోరిస్‌లకు ఉరిశిక్ష పడడం గమనార్హం. అప్రూవర్‌గా మారి కేసు విచారణకు సహకరించిన అయ్యప్పన్‌ను కోర్టు విడిచిపెట్టింది. -
సిడ్నీలో దారుణం..డాక్టర్ హత్య
-
ఆర్ఎంపీ దారుణ హత్య
సాగర్‌కాల్వ వద్ద మృతదేహం లభ్యం ఖమ్మం రూరల్: గ్రామీణ వైద్యుడు హత్యకు గురైన సంఘటన ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి పంచాయతీ పరిధిలోని సాగర్ ప్రధాన కాల్వ వద్ద గురువారం వెలుగు చూసింది. గుర్తుతెలియని దండగులు బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేశారు. పోలీసులు, మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం త్రిపూరారం గ్రామానికి చెందిన సూడి రాజశేఖరరెడ్డి(21) అదే మండలానికి చెందిన స్వాతితో ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. తొమ్మిది నెలలుగా కూసుమంచి మండలం గట్టుసింగారంలో భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇదే గ్రామంలో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ నిర్వహిస్తున్నాడు. నెల రోజుల క్రితం అఖిల్ అనే వ్యక్తితోపాటు మరో ఇద్దరు రాజశేఖర్ వద్దకు వచ్చి తాము వరి కోత మిషన్‌పై పనిచేస్తున్నామని, జ్వరం వచ్చిందని ఇంజెక్షన్ చేయించుకుని వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అదే ముగ్గురు రాజశేఖర్ వద్దకు వచ్చి వరి కోతల పని పూర్తికావడంతో తాము తిరిగి వెళ్లిపోతున్నామని చెప్పారు. వీడ్కోలు సందర్భంగా పార్టీ చేసుకుందామని అన్నారు. ఈ ప్రతిపాదనను రాజశేఖర్ నిరాకరించాడు. తనకు పని ఉందని, పార్టీ చేసుకునేందుకు రాలేనని చెప్పాడు. దీంతో వెళ్లిపోయిన ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు బుధవారం సాయంత్రం ఫోన్ చేసి తనకు ఆరోగ్యం బాగా లేదని, ఖమ్మంలో తెలిసిన ఆస్పత్రిలో వైద్యం చేయించేందుకు రావాలని రాజశేఖర్‌కు చెప్పాడు. దీంతో రాజశేఖర్ బయల్దేరి వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత భార్య ఫోన్ చేసి అడగగా తాను ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్నానని చెప్పాడు. తాను తీసుకెళ్లిన పేషేంట్‌కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, కొద్ది సేపట్లోనే బస్సు ఎక్కి ఇంటికి వచ్చేస్తానని అన్నాడు. అయితే రాత్రి తొమ్మిది దాటినా రాజశేఖర్ ఇంటికి రాకపోవడంతో భార్య ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో స్వాతి కంగారుపడిపోయింది. మృతదేహాన్ని గుర్తించారిలా.. సాగర్‌కాల్వ పక్కన గుర్తు తెలియని యువకుడి మృతదేహం పడి ఉందంటూ కొందరు ఖమ్మం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలాన్ని చేరుకున్న సీఐ తిరుపతిరెడ్డి, ఎస్సై లక్ష్మీనారాయణ అక్కడికి చేరుకున్నారు. మృతదేహం పక్కన బీరుసీసాలతోపాటు తినుబండారాలు ఉన్నాయి. మృతదేహాన్ని ఖమ్మం మార్చురీకి తరలించారు. కాల్వ క ట్ట పక్కన ఓ యువకుడి మృతదేహం ఉందని, మృతుడు గడ్డంతో ఉండి టీషర్టు ధరించి ఉన్నాడని గట్టుసింగారం గ్రామస్తులకు తెలిసింది. ఈ నేపథ్యంలో హుటాహుటిన స్వాతి ఖమ్మం ఆస్పత్రికి చేరుకుంది. మృతదేహం తన భర్త రాజశేఖర్‌దేనని గుర్తుపట్టి భోరున విలపించింది. ఈ మేరకు సీఐ తిరుపతిరెడ్డి కేసు నమోదుచేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.