సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా మార్చే ప్రక్రియలో భాగంగా పోలీసుశాఖ నడుం బిగించింది. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచి వారికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించేవరకు ప్రతీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం ఆదేశాలు జారీచేశారు. ఇందుకోసం వైద్యారోగ్య, రెవెన్యూ, మున్సిపల్ ఇతర అన్ని శాఖల సాయం తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ప్రతీ పోలీసుస్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. తమ తమ ఠాణాల పరిధిలో ‘కరోనా’వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారిని వెంటనే గుర్తించాలని, వారి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందకముందే క్వారంటైన్‌కు తరలించాలని సూ చించారు. ప్రతీ ఎస్‌హెచ్‌వో ఈ పనిని పూర్తి బాధ్యతతో చేపట్టాలన్నారు.
ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు జాబితా!
ఇందుకోసం ‘కరోనా వైరస్’పాజిటివ్ ఉన్న వారి జాబితాలను ఇప్పటికే ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు అందజేశారు. ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో ప్రతీ ఎస్‌హెచ్‌వో ఈ జాబితాను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తారు. పాజిటివ్‌గా తేలిన వారి పరిసర ప్రాంతాల్లో వైద్య తనిఖీలు, పారిశుద్ధ్య కార్యక్రమా లు, వారెవరిని కలిశారో, ఎక్కడెక్కడ తిరిగారో వంటి వివరాలు తెలుసుకునేందుకు మున్సి పల్, రెవెన్యూ ఇతర శాఖల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు. ప్రతీ పోలీస్‌తమ స్టేషన్ పరిధిలో కరోనా వైరస్ కేసులు లే కుండా చేయడం తద్వారా రాష్ట్రాన్ని కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేయాలని డీజీపీ స్పష్టం చేశారు.
‘కరోనా వైరస్’ రహిత తెలంగాణే లక్ష్యం
Published Thu, Apr 2 2020 1:55 AM | Last Updated on Thu, Apr 2 2020 1:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment