కౌన్సెలింగ్పై సుప్రీం తీర్పును అమలుచేస్తాం: టీ సర్కారు
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీం తీర్పును అమలుచేస్తామని తెలంగాణ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. కౌన్సెలింగ్‌లో ఏ విద్యార్ధులైనా పాల్గొనవచ్చని, ఫీజులు మాత్రం తెలంగాణ విద్యార్ధులకే చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపీ విద్యార్ధులకు అక్కడి ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకనే చంద్రబాబు తమపై అనవసర విమర్శలు చేస్తున్నారని, తెలంగాణలో జరిగే సర్వే గురించి టీడీపీ నేతలకెందుకని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పోటీ పడలేకనే టీడీపీ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని మహేందర్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను విమర్శించే హక్కు లేదని అన్నారు. ఆంధ్రా మంత్రులు హైదరాబాద్‌లోనే ఉండి పాలనను ఎందుకు కొనసాగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.