Rachakonda CP Mahesh Bhagwat Appreciated Constable Kavitha In TS MLC Election Duty - Sakshi
Sakshi News home page

శభాష్‌ కవిత.. చంటిబిడ్డను ఎత్తుకొని విధులు

Published Mon, Mar 15 2021 8:42 AM | Last Updated on Mon, Mar 15 2021 10:33 AM

PC Mohan Bhavath  Appreciates On Constable Kavitha For MLC Election Duty - Sakshi

బీబీనగర్‌: చేతుల్లో చిన్నారితో ఉన్న ఈ మహిళా కానిస్టేబుల్‌ పేరు కవిత. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఈమె  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం బీబీనగర్‌లోని పోలింగ్‌ బూత్‌ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా.. ఓటేయడానికి వచ్చిన ఓ మహిళ.. పోలింగ్‌బూత్‌లోకి వెళ్తూ అక్కడ విధులు నిర్వహిస్తున్న కవితకు తన చేతుల్లోని చంటిబిడ్డను అప్పగించింది.

తల్లి ఓటు వేసి వచ్చేవరకు కవిత ఆ చిన్నారిని ఏడవకుండా ఆడిస్తూ కనిపించింది. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యిం ది. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌.. ‘శభాష్‌ కవిత’ అంటూ అభినందించడంతో పాటు ఆమెకు రివార్డు ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement