Rachakonda Commissioner Mahesh Bhagwat
-
శభాష్ కవిత.. చంటిబిడ్డను ఎత్తుకొని విధులు
బీబీనగర్: చేతుల్లో చిన్నారితో ఉన్న ఈ మహిళా కానిస్టేబుల్ పేరు కవిత. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఈమె పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం బీబీనగర్‌లోని పోలింగ్ బూత్ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా.. ఓటేయడానికి వచ్చిన ఓ మహిళ.. పోలింగ్‌బూత్‌లోకి వెళ్తూ అక్కడ విధులు నిర్వహిస్తున్న కవితకు తన చేతుల్లోని చంటిబిడ్డను అప్పగించింది. తల్లి ఓటు వేసి వచ్చేవరకు కవిత ఆ చిన్నారిని ఏడవకుండా ఆడిస్తూ కనిపించింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిం ది. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్.. ‘శభాష్ కవిత’ అంటూ అభినందించడంతో పాటు ఆమెకు రివార్డు ప్రకటించారు. Beyond call on duty, #WPCO Kavitha of @BibinagarPS taking care of a baby while her mother #Castingvote for TSLC elections at Polling Station 369 #ZPHS_Bibinagar. #CP_Rachakonda appreciated and announced #reward for her devotion towards #duty.@TelanganaDGP @TelanganaCOPs pic.twitter.com/LTp46RF96A — Rachakonda Police (@RachakondaCop) March 14, 2021 -
ట్రాక్‌పై పడుకుని చావుని ఆహ్వానించాడు, కానీ
భువనగిరి: జీవితంపై విరక్తితో ఆత్యహత్య చేసుకోవాలని భావించిన యువకుడిని ఆదివారం భువనగిరి పోలీసులు కాపాడారు. రైల్వే ట్రాక్‌పై పడుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడంటూ 100కి ఫోన్ రావడంతో, సకాలంలో స్పందించిన పెట్రోలింగ్ వాహన సిబ్బంది.. వెంటనే రైల్వే ట్రాక్ వద్దకు చేరుకొని యువకుడిని కాపాడారు. ఆతరువాత భువనగిరి పోలీసులు అతనికి కౌన్సిలింగ్‌ను నిర్వహించి,కుటుంబసభ్యులకు అప్పజెప్పారు. కాగా, సకాలంలో స్పందించి ఆగమేఘాల మీద సంఘటన స్థలానికి చేరుకొని నిండు ప్రాణాన్ని కాపాడిన పెట్రోలింగ్ వాహన సిబ్బంది రామారావు, శ్రీనివాస్‌లను రాచకొండ పోలీసు కమీషనర్ మహేశ్ భగవత్ అభినందించారు. ఈ విషయాన్ని రాచకొండ పోలీసులు ట్విటర్లో షేర్ చేయగా, సదరు పెట్రోలింగ్ వాహన సిబ్బందిపై అభినందనల వర్షం కురుస్తోంది. On receipt of #Dial100 call @BhongirTownPS #PatrollingStaff B.Rama Rao PCO, and N. Srinivas HGO #rescued a person who was attempting to commit #suicide by lying on the #Railway track. Later BhongirTown Police given #counseling and handed over to his family. pic.twitter.com/URTh5eRkWS — Rachakonda Police (@RachakondaCop) January 24, 2021 -
తొందరొద్దు.. సరిదిద్దుకుందాం!
నేరేడ్మెట్: వివాహ సంబంధాల్లో తలెత్తే వివాదాలు, పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తలెత్తే వివాదాల పరిష్కారానికి రాచకొండ కమిషనరేట్‌లో ప్రత్యేక ఫ్యామిటీ కౌన్సిలింగ్ కేంద్రం అందుటులోకి వచ్చింది. ఈ కేంద్రానికి భూమిక విమెన్ సెల్ (ఎన్జీఓ) నోడల్ ఏజెన్సీగా వ్యవహారిస్తుంది. గురువారం నేరేడ్మెట్లోని డీసీపీ కార్యాలయం వెనుక ఏర్పాటు చేసిన ‘స్పెషల్ సెల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్స్ ఫ్యామిలీ సపోర్ట్ కౌన్సెలింగ్ సెంటర్’ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ లాంఛనంగా ప్రారంభించారు. గృహహింస నుంచి స్త్రీలకు రక్షణ కల్పించడంతో పాటు బాధిత మహిళలు, చిన్నారులకు అవసరమైన సహాయం అందిస్తూ అండగా నిలుస్తుందీ సెంటర్. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, షీ–టీమ్ అడిషనల్ డీసీపీ సలీమ, అడ్మిన్ డీసీపీ శిల్పవల్లి, ఫ్యామిలీ సపోర్ట్ కౌన్సిలింగ్ సెంటర్ ముఖ్య నిర్వాహకురాలు కొండవీటి సత్యవతి, ఇన్ఫోసిస్ ప్రతినిధి విష్ణుప్రియ, రజిని, సీసీఎండీ శాస్త్రవేత్త లత, ఫ్యామిలీ సపోర్ట్ కౌన్సిలింగ్ కేంద్రం కౌన్సిలర్లు, పలువురు మహిళలు పాల్గొన్నారు. బాధిత మహిళలకు తోడ్పాటు ఇలా.. ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధిలో భువనగిరి, సరూర్‌నగర్ మహిళా ఠాణాల్లో, కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో మొత్తం మూడు కౌన్సిలింగ్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. నేరేడ్మెట్లోని ప్రత్యేక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో కమిషనరేట్ పరిధిలోని అన్ని ఠాణాల్లో నమోదయ్యే పెళ్లి వివాదాలు, గృహహింస కేసులు, బాధితులకు న్యాయ సహాయం, చిన్నారుల సంరక్షణ, ప్రతివాది నుంచి రక్షణ కల్పించడం, వైద్య సహాయం, ఆర్థిక సహకారం వంటివి కల్పిస్తారు. గృహహింస చట్టం ప్రకారం వారిలో మానసిక స్థైర్యాన్ని నింపి భరోసానివ్వడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్ఆర్ఐ కేసులపై ప్రత్యేక దృష్టి.. ఎన్ఆర్ఐ, ఇతర రాష్ట్రాల, పోలీస్ కమిషనరేట్ల, జిల్లాలకు చెందిన గృహహింస కేసుల పరిష్కారం కోసమే స్పెషల్ సెల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్స్ ఫ్యామిలీ సపోర్ట్ కౌన్సిలింగ్ సెంటర్‌ను భూమిక ఎన్జీఓ సంస్థ ద్వారా సీపీ మహేష్ భగవత్ అందుబాటులోకి తెచ్చారు. పెళ్లయిన నెల రోజులకే విడాకుల కోసం బాధిత మహిళలు రాచకొండ సీపీ కార్యాలయానికి వస్తున్నారు. వీటిలో అధికంగా ఎన్ఆర్ఐ కేసులే ఉంటున్నాయి. ప్రత్యేక ఫ్యామిలీ కేంద్రం ద్వారా మొదట వారికి కౌన్సిలింగ్ ఇస్తారు. విడాకుల వరకు వెళ్లకుండా నచ్చజెబుతారు. బాధిత మహిళలకు రక్షణ, ఆర్థిక సాయం, చిన్నారులకు విద్య, సంరక్షణకు తోడ్పాటునందిస్తారు. -
పోలీసుల కస్టడీకి శ్రీనివాస్ రెడ్డి
సాక్షి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న అతడిని బుధవారం ఉదయం రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణాధికారిగా భువనగిరి ఏసీపీ భుజంగరావును రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నియమించిన విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. కేసును లోతుగా విచారించేందుకు నిందితుడిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్‌రెడ్డి ఈ నెల 8 నుంచి 13 వరకు విచారణ కోసం పోలీస్ కస్టడీకీ అను మతి ఇచ్చారు. ఆ సమయంలో పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని ఏ విధమైన శారీరక, మానసిక హింసకు గురి చేయరాదని ఉత్తర్వులో పేర్కొన్నారు. నేర చరిత్రపై కొనసాగనున్న విచారణ.. క్రూరమైన హత్యలకు పాల్పడిన శ్రీనివాస్‌రెడ్డి నేర చరిత్రపై పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నాయి. నిందితుడి స్వగ్రామం హాజీపూర్, బొమ్మలరామాం, హైదరాబాద్, వేములవాడ, కరీంనగర్, కర్నూలు ఇతర ప్రాంతాల్లో జరిగిన మిస్సింగ్ కేసులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారించే అవకాశాలు ఉన్నాయి. నాలుగేళ్లుగా రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలు తెప్పించుకున్న పోలీసులు వాటితో శ్రీనివాస్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారించనున్నారు. ఫేస్బుక్ స్నేహితులపై ఆరా... శ్రీనివాస్‌రెడ్డికి ఉన్న ఫేస్బుక్ అకౌంట్లోని స్నేహితుల వివరాలపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అతడి నేర ప్రవృత్తికి ఎవరైనా బలైపోయారా అన్న కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. కాగా శ్రీనివాస్ రెడ్డి ఫేస్బుక్ ఖాతాలో ఎక్కువమంది మహిళలకు సంబంధించిన స్నేహితులే ఉన్నారు. కస్టడీ విచారణలో ఫేస్బుక్ పరిచయాలు, వారిందరితో గల సంబంధాలు వారి ప్రస్తుత పరిస్థితిని విచారణలో అధ్యయనం చేయనున్నారు. -
తెలంగాణలో తొలిసారి: అరుణారెడ్డిపై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్ : వైట్ కాలర్ మోసాలకు పాల్పడుతూ అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి... తిరిగి వాటిని చెల్లించకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్న మహిళా రియల్టర్ అరుణా రెడ్డి (47)పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. రాచకొండ పోలీస్క మిషనర్ మహేశ్ భగవత్ గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.... తెలంగాణలో మొదటిసారి వైట్ కాలర్ నేరస్తురాలిపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు తెలిపారు. అరుణ అనే మహిళపై ఇదివరకే 10 కేసులు నమోదయ్యాయని, 2009 నుంచి 19 మందిని మోసం రూ.3.23 కోట్లు దోచుకున్నట్లు వెల్లడించారు. ఆమెపై కేసు నమోదు చేసి చంచల్ గూడ మహిళా జైలుకు తరలించినట్లు వెల్లడించారు. 2005లో ఫోర్జరీ డ్యాక్యుమెంట్లు సృష్టించి పీఎస్‌యూ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో సీబీఐ కూడా గతంలో అరుణారెడ్డిని అరెస్ట్ చేసిందన్నారు. పీడీ యాక్ట్ అనేది పదే పదే నేరాలకు పాల్పడే వారిపై నమోదు చేస్తామని మహేశ్ భగవత్ తెలిపారు. -
కుమార్తె హత్యకు పగ తీర్చుకున్నాడు!
-
పగ తీర్చుకున్నారు
► ప్రతీకారంతోనే గుంటి రాజేష్ హత్య ► ఐదుగురు నిందితుల రిమాండ్ ► వివరాలు వెల్లడించిన రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ గచ్చిబౌలి: తుర్క యాంజాల్‌లో జరిగిన గుంటి రాజేశ్ హత్యకు ప్రతీకారమే కారణమని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో కేసు వివరాలు వెల్లడించారు. గత నెల 27న తుర్కయాంజల్‌లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద కారు దిగుతుండగా ఐదుగురు వ్యక్తులు కత్తులు, ఇనుప రాడ్డుతో రాజేష్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయనపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆదిబట్ల సీఐ గోవింద్ రెడ్డి, ఏసీపీ మల్లారెడ్డి మృతుడు గుంటి రాజేష్‌గా గుర్తించారు. అతని శత్రువులపై ఆరా తీయగా శ్యాంసుందర్ రెడ్డిపై రావడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. కుమార్తె మృతికి కారణమైనందుకు శ్యాంసుందర్ రెడ్డి తన భార్యకు కిడ్నీ దానం చేసినందుకు గాను పని మనిషికి ప్లాట్ కానుకగా ఇచ్చాడు. అయితే ఈ ప్లాట్ తన పూర్వీకులదైనందున తనకే అమ్మాలని రాజేష్ పట్టుబట్టాడు. దీంతో ఆమె రూ.3లక్షలకే ఆ స్థలాన్ని రాజేష్‌కు అమ్మింది. ఈ క్రమంలో 2015 ఫిబ్రవరి 27న ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసేందుకు పని మనిషి వెంట తన కూతురు అనుషాను తోడుగా పంపగా, రాజేష్ అదేరోజు అనుషాను తీసుకొని పారిపోయాడు. కొద్ది రోజులకు తీరిగి వచ్చిన అతను అనూషకు చెందిన అసభ్యకరమైన ఫొటోలు తన వద్ద ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ నేపథ్యంలో రాజేష్‌పై చైతన పురి పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైంది. ఈ క్రమంలోనే మార్చి 17న అనూష నాగార్జునసాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సందర్భంగా తన కూతురు మృతికి కారణమైన రాజేష్‌ను హత్య చేస్తానని శ్యాంసుందర్ రెడ్డి ప్రతిన పూనినట్లు ప్రచారం జరిగింది. రాజేష్‌పై హయత్‌నగర్ పీఎస్‌లో 18, చైతన్య పురి పీఎస్‌లో ఒక కేసు ఉంది. పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లిన అతను 3 నెలల క్రితం బయటకు వచ్చాడు. తన కూతురు కిడ్నాప్‌నకు గురైన రోజే శ్యాంసుందర్ రెడ్డి పక్కా ప్రణాళికతో ఫిబ్రవరి 27న హత్య చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. పకడ్బందీగా స్కెచ్ తన కూతురు చావుకు కారణమైన రాజేష్‌ను అంతమొందించేందుకును రెండేళ్లుగా కొత్తపేట గ్రీన్‌హిల్స్ కాలనీకి చెందిన శ్యాంసుందర్ రెడ్డి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన రాజేష్‌పై నిఘా ఏర్పాటు చేశాడు. అందుకు 20 రోజుల క్రితం రియల్ ఎస్టేట్ పార్ట్నర్, స్నేహితుడైన షేక్ మహ్మద్ కలీమొద్ధీన్(46) సహాయం కోరాడు. ఇందుకు అతను తన స్నేహితులైన అనంతపురం జిల్లా నాగప్పగారి పల్లికి చెందిన కుంచెపు రమణ, చిత్తూరు జిల్లా మేళ్లచెరువు,కు చెందిన డ్రైవర్ పొగరి దయాకర్, నల్గొండ జిల్లాకు చెందిన సివిల్ ఇంజనీర్ చింత శ్యాంసుందర్ రావు సహకారం తీసుకున్నాడు. గత ఫిబ్రవరి 27న ఉదయం నుంచి రాజేష్ కదలికలపై నిఘా పెట్టిన శ్యాంసుందర్ రావు రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన రాజేష్ సాగర్ రింగ్ రోడ్డు వైపు వన్నట్లు మిగతా వారికి సమాచారం అందించాడు. సాగర్ రింగ్ రోడ్డులో మాటు వేసి ఉన్న శ్యాసుందర్ రెడ్డి, కలీమొద్ధీన్, రమణ, దయాకర్ కారులో అతడిని వెంబడించారు. తుర్కయంజాల్‌లోని ఓ బార్ వద్ద కారు నుంచి దిగుతుండగా కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రాజేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. పరారీలో ఉన్న నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ఈ కేసులో మూడో నిందితుడైన కుంచెపు రమణపై ఇప్పటికే మూడు హత్య కేసులు ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. కేసును చేదించిన పోలీసులకు రివార్డులు అందజేస్తామన్నారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, ఆదిబట్ల సీఐ గోవింద్‌రెడ్డి పాల్గొన్నారు.