ట్రాక్ వద్ద
భువనగిరి: జీవితంపై విరక్తితో ఆత్యహత్య చేసుకోవాలని భావించిన యువకుడిని ఆదివారం భువనగిరి పోలీసులు కాపాడారు. రైల్వే ట్రాక్‌పై పడుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడంటూ 100కి ఫోన్ రావడంతో, సకాలంలో స్పందించిన పెట్రోలింగ్ వాహన సిబ్బంది.. వెంటనే రైల్వే ట్రాక్ వద్దకు చేరుకొని యువకుడిని కాపాడారు. ఆతరువాత భువనగిరి పోలీసులు అతనికి కౌన్సిలింగ్‌ను నిర్వహించి,కుటుంబసభ్యులకు అప్పజెప్పారు. కాగా, సకాలంలో స్పందించి ఆగమేఘాల మీద సంఘటన స్థలానికి చేరుకొని నిండు ప్రాణాన్ని కాపాడిన పెట్రోలింగ్ వాహన సిబ్బంది రామారావు, శ్రీనివాస్‌లను రాచకొండ పోలీసు కమీషనర్ మహేశ్ భగవత్ అభినందించారు. ఈ విషయాన్ని రాచకొండ పోలీసులు ట్విటర్‌లో షేర్ చేయగా, సదరు పెట్రోలింగ్ వాహన సిబ్బందిపై అభినందనల వర్షం కురుస్తోంది.
On receipt of #Dial100 call @BhongirTownPS #PatrollingStaff B.Rama Rao PCO, and N. Srinivas HGO #rescued a person who was attempting to commit #suicide by lying on the #Railway track. Later BhongirTown Police given #counseling and handed over to his family. pic.twitter.com/URTh5eRkWS
— Rachakonda Police (@RachakondaCop) January 24, 2021
Comments
Please login to add a commentAdd a comment