తుర్క యాంజాల్‌లో జరిగిన గుంటి రాజేశ్ హత్యకు ప్రతీకారమే కారణమని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో కేసు వివరాలు వెల్లడించారు. గత నెల 27న తుర్కయాంజల్‌లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద కారు దిగుతుండగా ఐదుగురు వ్యక్తులు కత్తులు, ఇనుప రాడ్డుతో రాజేష్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయనపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆదిబట్ల సీఐ గోవింద్ రెడ్డి, ఏసీపీ మల్లారెడ్డి మృతుడు గుంటి రాజేష్‌గా గుర్తించారు. అతని శత్రువులపై ఆరా తీయగా శ్యాంసుందర్ రెడ్డిపై రావడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు.