Rajesh murder
-
ఈ రక్తపాతానికి బాధ్యులెవరు?
తిరువనంతపురం: ఇక్కడికి సరిగ్గా 20 కిలోమీటర్ల దూరంలో ఉంది కల్లమ్‌పల్లి. ఊర్లోకి అడుగుపెట్టగానే ఎవరికో నివాళిగా విద్యుత్ స్తంభాలకు నల్ల జెండాలు కనిపిస్తాయి. పక్కనే గోడల మీద 34 ఏళ్ల ఎస్ఎల్ రాజేష్‌కు నివాళి అర్పిస్తూ పోస్టర్లు అతికించి ఉన్నాయి. కల్లమ్‌పల్లి ఆరెస్సెస్ వార్డు శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న రాజేష్‌ను జూలై 29వ తేదీన 12 మంది సభ్యుల బృందం నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపింది. ఆయన ఒంటిపై 83 గాయాలను పోలీసులు గుర్తించారు. అలా నల్లజెండా, ఓ పోస్టర్ అతికించిన గోడకు సమీపంలో తెలుపు, నీలి రంగులో కనిపించే ఓ ఇంటిలో తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలతో రాజేష్ నివసించేవాడు. ఆ ఇంటికి ఓ మూలన విషాధ వదనంతో రాజేష్ తండ్రి సుదర్శన్ కూర్చొని ఉన్నారు. ఆయన్ని మీడియా వెళ్లి పలకరించగా ‘నా కుమారుడి చేతులను హంతకులు ముక్కలు ముక్కలుగా నరికేశారు. ప్రాణాపాయం స్థితిలో ఉన్న నా కుమారుడిని ఆస్పత్రికి తరలించేందుకు, వాడి అవయవాలను పట్టుకెళ్లేందుకు పోలీసులకు దుప్పట్లు కావాల్సి వచ్చింది. ముక్కలు, ముక్కలుగా తెగిన చేతులతో అప్పుడు మా వాడు ఎంత నరకం అనుభవించాడో చెప్పలేను’ అంటూ కన్నీరు మున్నీరయ్యారు. ‘నా కుమారుడు చిన్న వయస్సులో ఇంటి బరువు బాధ్యతలు నెత్తికెత్తుకున్నారు. నేను చాలా ఏళ్లపాటు సౌదీ అరేబియాలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేశాను. కానీ పెద్దగా సంపాదించలేకపోయాను. నా పరిస్థితిని అర్థం చేసుకున్న రాజేష్ తన మాధ్యమిక విద్యాభ్యాసం ముగియగానే ఇంటిల్లి పాదిని పోషించడానికి పనిలో స్థిరపడ్డారు’ అని చెప్పిన ఆ 60 ఏళ్ల వద్ధుడు వెక్కివెక్కి ఏడిస్తూ ఇంకేమీ మాట్లాడలేక పోయారు. ఆ ఇంట్లో మరో గదిలో రాజేష్ భార్య ఇద్దరు చిన్న పిల్లలను పట్టుకొని శూన్యంలోకి చూస్తూ కూర్చొని ఉంది. మీడియా ప్రతినిధులెవరూ ఆమెను పలకరించేందుకు సాహసించలేదు. బయట వేసిన టెంట్ కింద 30 మంది ఆరెస్సెస్ కార్యకర్తలు కూర్చొని ఉన్నారు. వారంతా రాజేష్ హత్య గురించే మాట్లాడుకుంటున్నారని తెలుస్తోంది. బయటకు వినిపించకుండా గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. రాజేష్ హత్యకు దారితీసిన పరిస్థితులు సంఘ్ పరివార్, పాలకపక్షమైన సీపీఎం పార్టీ విద్యార్థి విభాగం మధ్య జూలై 18వ తేదీన తలెత్తిన ఉద్రిక్తతలే రాజేష్ హత్యకు దారితీశాయి. భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న అఖిల భారత విద్యార్థి పరిషద్ విద్యార్థులు సిటీ కాలేజీకి వెళ్లి కాలేజీ ఆవరణలోని ఎస్ఎఫ్ఐ విద్యార్థుల జెండాలను కూల్చేశారు. జూలై 24వ తేదీన ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ర్యాలీగా కాలేజీకి వెళ్లి కొత్తగా మరో పది జెండాలను ఎగురవేశారు. దీంతో రెండు విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సీపీఎం కార్యకర్తలు జూలై 28వ తేదీన బీజేపీ రాష్ట్రపార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఆ సమయంలో కార్యాలయంలోఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మనం రాజశేఖరన్ దాడి నుంచి తప్పించుకొని పారిపోయారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే బీజేపీ, ఏబీవీపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు ఓ బృందంగా ఏర్పడి కేరళ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకష్ణన్ కుమారుడి ఇంటిపై దాడి చేశారు. బీభత్సం సష్టించారు. ఆయన కుమారుడు గాయాలతో బయట పడినట్లు తెల్సింది. ఆ మరుసటి రోజు, అంటే జూలై 29వ తేదీన రాత్రి 8.45 గంటలకు దళితుడైన రాజేష్ శాఖా కార్యక్రమం ముగించుకొని ఇంటికి వస్తుండగా 12 మంది సభ్యులుగల బృందం ఆయనపై దాడి చేసింది. తీవ్ర గాయాలతో ఆయన ఆస్పత్రిలో మరణించారు. సీపీఎం నాయకులే ఈ హత్యకు కుట్రపన్ని అమలు చేశారని సంఘ్ పరివార్ సభ్యులు ఆరోపించారు. ఆ మరుసటి రోజు జూలై 30వ తేదీన సీపీఎం నాయకుడు బాలకృష్ణన్, తిరువనంతపురంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి హత్యను ఖండించారు. ఆ హత్యతో సీపీఎంకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 31వ తేదీన రాజేష్ హత్య కేసులో మొత్తం 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న మణికుట్టన్ ఉన్నారు. ఆయన ఇంతకుముందు రెండుసార్లు జైలుకెళ్లి వచ్చిన రౌడీ షీటర్. మిగిలిన వారిలో ఇద్దరికి మాత్రమే సీపీఎంతో సంబంధాలు ఉన్నాయి. వారిలో ఒకరు సీపీఎంకు అనుబంధమైన సీఐటీయు క్రియాశీలక సభ్యుడుకాగా, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా క్రియాశీలక సభ్యుడు మరొకరు. బీజేపీ, సీపీఎం పార్టీల మధ్య తలెత్తిన ఘర్షణ పరిస్థితులే రాజేష్ హత్యకు దారితీశాయని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. కేరళలో రాజకీయ హింసాకాండ కొనసాగడం ఇప్పుడే కొత్తకాదు. కొన్ని దశాబ్దాలుగా బీజేపీ, వామపక్ష పార్టీలకు మధ్య హత్యలు, ప్రతీకార హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతకుముందు కన్నూర్ జిల్లాలో ఎక్కువగా జరిగేవి. ఉత్తర కేరళాకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఇప్పుడు రాజధాని పరిసర ప్రాంతాలకు కూడా విస్తరించాయి. కేరళలో 9.8 శాతం మంది దళితులు ఉన్నారు. మొదటి నుంచి సీపీఎం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంటూ వస్తోంది. కల్లమ్పల్లిలో కూడా దళితులే ఎక్కువగా నివసిస్తున్నారు. వారిపై సీపీఎం ప్రభావమే ఎక్కువగా ఉంది. వారిపై పట్టు సాధించేందుకు బీజేపీ ఇప్పుడిప్పుడే కషి చేస్తోంది. బీజేపీ ప్రోద్బలంతో రాజీష్ గత ఫిబ్రవరి నెలలోనే అక్కడ ఆరెస్సెస్ శాఖను ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే దళిత యువత ఆరెస్సెస్ శాఖకు ఆకర్షితులవుతున్నారు. ఈ కారణంగానే ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, అవి ఘర్షణలకు దారితీస్తున్నాయని తిరువనంతపురంలో ‘దళిత్ రైట్స్ అకాడమిక్ రీసర్చ్ ఇన్షియేటివ్’ సంస్థ డైరెక్టర్ వీబీ అజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఏ పార్టీ ప్రాబల్యం కోసం ప్రయత్నించినా సామాజిక అభివృద్ధికి నోచుకోని దళితులే బలవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
కుమార్తె హత్యకు పగ తీర్చుకున్నాడు!
-
పగ తీర్చుకున్నారు
► ప్రతీకారంతోనే గుంటి రాజేష్ హత్య ► ఐదుగురు నిందితుల రిమాండ్ ► వివరాలు వెల్లడించిన రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ గచ్చిబౌలి: తుర్క యాంజాల్‌లో జరిగిన గుంటి రాజేశ్ హత్యకు ప్రతీకారమే కారణమని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో కేసు వివరాలు వెల్లడించారు. గత నెల 27న తుర్కయాంజల్‌లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద కారు దిగుతుండగా ఐదుగురు వ్యక్తులు కత్తులు, ఇనుప రాడ్డుతో రాజేష్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయనపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆదిబట్ల సీఐ గోవింద్ రెడ్డి, ఏసీపీ మల్లారెడ్డి మృతుడు గుంటి రాజేష్‌గా గుర్తించారు. అతని శత్రువులపై ఆరా తీయగా శ్యాంసుందర్ రెడ్డిపై రావడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. కుమార్తె మృతికి కారణమైనందుకు శ్యాంసుందర్ రెడ్డి తన భార్యకు కిడ్నీ దానం చేసినందుకు గాను పని మనిషికి ప్లాట్ కానుకగా ఇచ్చాడు. అయితే ఈ ప్లాట్ తన పూర్వీకులదైనందున తనకే అమ్మాలని రాజేష్ పట్టుబట్టాడు. దీంతో ఆమె రూ.3లక్షలకే ఆ స్థలాన్ని రాజేష్‌కు అమ్మింది. ఈ క్రమంలో 2015 ఫిబ్రవరి 27న ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసేందుకు పని మనిషి వెంట తన కూతురు అనుషాను తోడుగా పంపగా, రాజేష్ అదేరోజు అనుషాను తీసుకొని పారిపోయాడు. కొద్ది రోజులకు తీరిగి వచ్చిన అతను అనూషకు చెందిన అసభ్యకరమైన ఫొటోలు తన వద్ద ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ నేపథ్యంలో రాజేష్‌పై చైతన పురి పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైంది. ఈ క్రమంలోనే మార్చి 17న అనూష నాగార్జునసాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సందర్భంగా తన కూతురు మృతికి కారణమైన రాజేష్‌ను హత్య చేస్తానని శ్యాంసుందర్ రెడ్డి ప్రతిన పూనినట్లు ప్రచారం జరిగింది. రాజేష్‌పై హయత్‌నగర్ పీఎస్‌లో 18, చైతన్య పురి పీఎస్‌లో ఒక కేసు ఉంది. పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లిన అతను 3 నెలల క్రితం బయటకు వచ్చాడు. తన కూతురు కిడ్నాప్‌నకు గురైన రోజే శ్యాంసుందర్ రెడ్డి పక్కా ప్రణాళికతో ఫిబ్రవరి 27న హత్య చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. పకడ్బందీగా స్కెచ్ తన కూతురు చావుకు కారణమైన రాజేష్‌ను అంతమొందించేందుకును రెండేళ్లుగా కొత్తపేట గ్రీన్‌హిల్స్ కాలనీకి చెందిన శ్యాంసుందర్ రెడ్డి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన రాజేష్‌పై నిఘా ఏర్పాటు చేశాడు. అందుకు 20 రోజుల క్రితం రియల్ ఎస్టేట్ పార్ట్నర్, స్నేహితుడైన షేక్ మహ్మద్ కలీమొద్ధీన్(46) సహాయం కోరాడు. ఇందుకు అతను తన స్నేహితులైన అనంతపురం జిల్లా నాగప్పగారి పల్లికి చెందిన కుంచెపు రమణ, చిత్తూరు జిల్లా మేళ్లచెరువు,కు చెందిన డ్రైవర్ పొగరి దయాకర్, నల్గొండ జిల్లాకు చెందిన సివిల్ ఇంజనీర్ చింత శ్యాంసుందర్ రావు సహకారం తీసుకున్నాడు. గత ఫిబ్రవరి 27న ఉదయం నుంచి రాజేష్ కదలికలపై నిఘా పెట్టిన శ్యాంసుందర్ రావు రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన రాజేష్ సాగర్ రింగ్ రోడ్డు వైపు వన్నట్లు మిగతా వారికి సమాచారం అందించాడు. సాగర్ రింగ్ రోడ్డులో మాటు వేసి ఉన్న శ్యాసుందర్ రెడ్డి, కలీమొద్ధీన్, రమణ, దయాకర్ కారులో అతడిని వెంబడించారు. తుర్కయంజాల్‌లోని ఓ బార్ వద్ద కారు నుంచి దిగుతుండగా కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రాజేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. పరారీలో ఉన్న నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ఈ కేసులో మూడో నిందితుడైన కుంచెపు రమణపై ఇప్పటికే మూడు హత్య కేసులు ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. కేసును చేదించిన పోలీసులకు రివార్డులు అందజేస్తామన్నారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, ఆదిబట్ల సీఐ గోవింద్‌రెడ్డి పాల్గొన్నారు. -
పక్కా ప్రణాళికతోనే హత్య
► రెండు రోజుల్లో రాజేష్ కేసును ఛేదిస్తాం : ఏసీపీ మల్లారెడ్డి ► నాలుగు బృందాలతో గాలింపు ►శ్యాంసుందర్రెడ్డిపైనే అనుమానం ఇబ్రహీంపట్నంరూరల్: గుంటిరాజేష్ హత్య కేసు ఛేదించి రెండురోజుల్లో నిందుతులను పట్టుకుంటామని ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి అన్నారు. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్కు చెందిన గుంటి రాజేష్ హత్యపై అన్ని కోణాల్లో విచారిస్తున్నామన్నారు. పాత కక్ష్యలే కారణం అని అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే హత్యకు పన్నాగం పన్నారని తెలిపారు. గతంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన విషయంలో అనుషారెడ్డి తల్లిదండ్రులే హత్య చేసి ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు ఏసీపీ తెలిపారు. కొతూ్తర్ గ్రామానికి చెందిన శ్యాం సుందర్‌రెడ్డితో వివాదమే రాజేష్ హత్యకు కారణమయి ఉండొచ్చని అనుమానించారు. మూడు బృందాలతో నిందుతుల కోసం గాలి ంపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హత్య జరిగిన సంఘటన స్థలం వద్ద రాజేష్‌తో పాటు వచ్చిన యుగేందర్ హత్య ఉదంతం, హత్యచేసిన పరిస్థితిని చూసి ముగు్గరులేదా నలుగురు వ్యకు్తలు హత్యలో పాలుపుంచుకున్నట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. రాజేష్‌పై హయత్‌నగర్‌లో 10చీటింగ్ కేసులు, సరూర్‌నగర్ పీఎస్‌లో రెండో భార్య కేసు వీటిన్నంటి పూర్వపరాల ప్రకారం కేసు విచారిస్తున్నామన్నారు. హత్య జరిగిన అరగంటలోపే శ్యాం సుందర్‌రెడ్డి కుటుంబ సభ్యులు పరారీలో ఉండడం, వారి సెల్‌ఫోన్ లొకేషన్లు వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు చూపించడం బట్టి శ్యాంసుందర్రెడ్డే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు. హత్య చేసిన తీరును బట్టి పది పదిహేను రోజులుగా రెక్కీ నిర్వహించి మాటుగాసి హత్య చేసినట్లు అంచనా అన్నారు. ఈ హత్యకు ఎవరెవరు సహకరించారు. దీనితో యుగేంధర్ పాత్ర ఏంటి అనే కోణంలో విచారణ సాగుతుంది. ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని రెండురోజుల్లో నిందుతులను అదుపులోకి తీసుకుని కోరు్టలో హాజరుపరుస్తామన్నారు.