
కమిషనర్‌గా ఇషాన్
సాక్షి, హైదరాబాద్ : బ్లెడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ బాలుడి కోరికను తీర్చి హైదరాబాద్ పోలీసులు తమ సహృదయతను చాటుకున్నారు. మెదక్ జిల్లాకు చెందిన చాంద్ పాషా కుమారుడు ఇషాన్(6) గత కొద్దిరోజులుగా బ్లెడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. రెండో తరగతి చదువుతున్న ఇషాన్‌కి పోలీసులంటే చాలా ఇష్టం. దీంతో భవిష్యత్తులో పోలీస్ ఆఫీసర్ అవ్వాలని లక్ష్యం పెట్టుకున్నాడు. అయితే బ్లెడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఇషాన్ గురించి తెలుసుకున్న రాచకొండ పోలీసులు అతని కోరిక తీర్చేందుకు ముందుకొచ్చారు. ఒక్క రోజు కమిషనర్‌గా వ్యవహరించేందుకు ఏర్పాట్లు చేశారు. బుధవారం కమిషనర్ ఇషాన్‌కి పోలీసులు సెల్యూట్ చేశారు. అంతేకాకుండా రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తన సీటులో కూర్చొబెట్టి మరి ఇషాన్ కోరిక తీర్చారు.

ఇషాన్‌కు బొకే ఇస్తున్న మహేశ్ భగవత్

కమిషనర్ సీట్లో ఇషాన్

ఇషాన్ కుటుంబ సభ్యులతో మహేశ్ భగవత్