
మాట్లాడుతున్న సుధీర్‌బాబు
సాక్షి,మోత్కూరు(తుంగతుర్తి) : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా రాజకీయ ప్రచారం, స్వేచ్ఛగా ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాచకొండ జాయింట్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు తెలిపారు. సోమవారం సాయంత్రం మోత్కూరు పోలీస్‌స్టేషన్‌ను భువనగిరి డీసీపీతో కలిసి సందర్శించారు. చౌటుప్పల్ ఏసీపీ బాపురెడ్డి, రామన్నపేట సీఐ ఎం.శ్రీనివాస్, స్థానిక ఎస్‌ఐ సీహెచ్.హరిప్రసాద్‌లతో ఎన్నికలకు సంసిద్ధత కావడంపై సమీక్షించారు. అనంతరం జాయింట్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చాలా సున్నితంగా వ్యవహరిం చాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక గ్రామాలను గుర్తించి వాటిలో ఎలా వ్యవహరించాలని తమ సిబ్బందికి వివరించినట్లు తెలి పారు. ప్రజలు స్వేచ్ఛ వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ శాఖ అన్నిరకాల బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment