అత్యాచారం చేసి, మతమార్పిడికి ఒత్తిడి
సుల్తాన్పూర్: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. సుల్తాన్పూర్లో ఓ వ్యక్తి తన భార్య, సమీప బంధువు సాయంతో ఓ దళిత మహిళను ఐదు నెలలుగా బంధించి, అత్యాచారం చేయడంతో పాటు బలవంతపు మతమార్పిడికి ఒత్తిడితెచ్చాడు. బాధితురాలి దుండగుడి బారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు తౌహిద్ అనే వ్యక్తి ఉద్యోగం ఇస్తానని ఆశ చూపి బాధితురాలిని తన ఇంటికి తీసుకెళ్లాడు. తౌహిద్ తన భార్య తబాసుమ్, బావమరిది పప్పు సాయంతో ఆమెను బందీని చేశాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడి, మతంమార్చుకోవమని ఒత్తడి చేశాడు. మంగళవారం బాధితురాలు తప్పించుకుని ఓ ఆశ్రమానికి వెళ్లింది. వారి సాయంతో పోలీసులుకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించారు. ఈ కేసును త్వరితగతిన విచారణ చేయాల్సిందిగా ఎస్పీ సోనియా సింగ్ ఆదేశించారు.