ఈనెల 6న లోకసభ స్పీకర్ ఎన్నిక: వెంకయ్య | lok sabha speaker election on june 6th | Sakshi
Sakshi News home page

ఈనెల 6న లోకసభ స్పీకర్ ఎన్నిక: వెంకయ్య

Published Tue, Jun 3 2014 6:21 PM | Last Updated on Sat, Mar 9 2019 3:08 PM

ఈనెల 6న లోకసభ స్పీకర్ ఎన్నిక: వెంకయ్య - Sakshi

ఈనెల 6న లోకసభ స్పీకర్ ఎన్నిక: వెంకయ్య

న్యూఢిల్లీ: లోక్‌సభలో రేపు ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేస్తారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. గోపీనాథ్ ముండేకు సంతాపం తెలిపిన అనంతరం లోక్‌సభ ఎల్లుండికి వాయిదా పడుతుందని చెప్పారు. ఈనెల 5, 6 తేదీల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. 6వ తేదీ మధ్యాహ్నం లోకసభ స్పీకర్ ఎన్నిక నిర్వహించాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. 9న లోక్‌సభను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారని చెప్పారు. 10, 11 తేదీల్లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ ఉంటుందని వెంకయ్య నాయుడు తెలిపారు.

కాగా, గోపీనాథ్ ముండే మరణం నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమయింది. ముండే మృతికి సంతాపం తెలిపింది. రేపు, ఎల్లుండి సంతాప దినాలు పాటించాలని కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement