Six Nellore Residents In Indian Parliament, Details Inside - Sakshi
Sakshi News home page

Nellore Residents In Parliament: పార్లమెంటులో ఆరుగురు నెల్లూరు వాసులు

Published Wed, May 18 2022 8:48 AM | Last Updated on Wed, May 18 2022 9:10 AM

Six Nellore Residents in Indian Parliament - Sakshi

నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యక్తికి పెద్దల సభ రాజ్యసభలో చోటు దక్కనుంది. బీసీ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బీద మస్తాన్‌రావును వైఎస్సార్‌సీపీ తన అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో రాజ్యసభ, లోక్‌సభ కలిపి ఆరుగురు జిల్లా వాసులకు చోటు దక్కినట్టయింది. బీద మస్తాన్‌రావు రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడం లాంఛనమే.

ఇప్పటికే జిల్లా నుంచి రాజ్యసభలో ఇద్దరు, లోక్‌సభలో ఇద్దరు ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, విజయసాయిరెడ్డి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. నెల్లూరు ఎంపీ ఆదాల, ఒంగోలు ఎంపీ మాగుంట లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా నెల్లూరు జిల్లా వాసే. 

చదవండి: (వైఎస్సార్‌సీపీ నలుగురు రాజ్యసభ అభ్యర్థులు ఖరారు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement